తెలంగాణలో మార్చి 16 నుంచి, ఏపీలో మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు

తెలుగురాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

news18-telugu
Updated: December 5, 2018, 8:31 PM IST
తెలంగాణలో మార్చి 16 నుంచి, ఏపీలో మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 5, 2018, 8:31 PM IST
తెలుగురాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2019లో మార్చి 16నుంచి ఏప్రిల్ 2 వరకూ తెలంగాణలో.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల కోసం రెండు రాష్ట్రాల్లోనూ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించిన అధికారులు.. పరీక్షలు సక్రమంగా జరిగేలా ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ని అందుబాటులో ఉంచారు.
ఇక తెలంగాణలో ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జరుగనున్నాయి. ఇప్పటికే హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా.. విద్యార్థులను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలు పూర్తైన నెలరోజుల్లోనే ఫలితాలను వెల్లడించనున్నారు.

First published: December 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు