మీ కిచెన్ క్లీన్ చేసేందుకు 10 ఉత్తమ మార్గాలు

Kitchen cleaning tips | కిచెన్ లో ఎటువంటి దుమ్ము, లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  కిచెన్ ను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు 10 ప్రభావవంతమైన మార్గాలను ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:48 PM IST
మీ కిచెన్ క్లీన్ చేసేందుకు 10 ఉత్తమ మార్గాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కిచెన్ లో ఎటువంటి దుమ్ము, లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  కిచెన్ ను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు 10 ప్రభావవంతమైన మార్గాలను ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

అద్భుతాలు చేసే బేకింగ్ సోడా

మీ సింక్ బాగా మురికి పట్టినా లేదా మీ సింక్ డ్రెయిన్ నిండిపోయినా కొంత బేకింగ్ సోడాను వాటిపై కొంత బేకింగ్ సోడా చల్లండి. తర్వాత దాన్ని పాత టూత్ బ్రష్ రుద్దండి. అవసరమైతే స్పాంజ్ ఉపయోగించవచ్చు. అయితే ఇది స్టీల్ సింకులకు మాత్రమే పనిచేస్తుంది. బేకింగ్ సోడాతో సింగ్ శుభ్రంగా మారుతుంది.

అమ్మోనియాతో బర్నర్స్ శుభ్రం చేయడం

బర్నర్లపై ఉండే జిడ్డు మరకలు వదిలించడం అంత సులభం కాదు. అమ్మోనియో, నీళ్లతో నింపిన జిప్ లాక్  బ్యాగ్ లో బర్నర్లు ఉంచండి. రాత్రంతా బర్నర్లు ఆ నీటిలోనే ఉండనీయండి. మరుసటి రోజు వాటిని సబ్బు నీళ్లలో నానబెట్టండి.

ఫ్రిజ్ కోసం బేకింగ్ సోడా

ఫ్రిజ్ శుభ్రం చేసేందుకు రసాయనాలు వాడకపోవడం మంచిది. బేకింగ్ సోడా కలిపిన వెచ్చని నీటితో ఓ బాత్ టబ్ నింపండి. ఫ్రిజ్ లోని అన్ని షెల్ఫులను వాటిలో ముంచండి. బేకింగ్ సోడా, నీటి మిశ్రమంతో మొత్తం ఫ్రిజ్ శుభ్రం చేయండి.అవెన్ శుభ్రం చేసేందుకు నిమ్మకాయలు

ఓ గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని వాటికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. కొన్ని నిమ్మకాయ ముక్కలను కూడా ఆ నీటిలో కలిపి ఆ నీటిని హై టెంపరేచర్ లో మూడు నిమిషాల పాటు మైక్రో వేవ్ లో ఉంచండి. ఆ తర్వాత వేడి లేకుండా ఆ నీటిని మరో 5 నిమిషాలు అవెన్ లో ఉంచండి. ఆ తర్వాత తడి వస్త్రంతో అవెన్ తుడవండి.

కట్టింగ్ బోర్డులు

కట్టింగ్ బోర్డులపై ఉండే మురికి తొలగించేందుకు రాళ్ల ఉప్పులో ముంచిన నిమ్మచెక్కను ఉపయోగించండి.

చిన్న పరికరాలు

చిన్న పరికరాలను సబ్బు నీటిలో ముంచి తుడవండి. వాటి సైజు చిన్నగా ఉందని  పట్టించుకోకుండా వదిలేయకండి. డీప్ క్లీనింగ్ లో అవి కూడా ముఖ్యం.

 

కిచెన్ కేబినెట్లు

ముందు తేలిక రంగుల కేబినెట్లపై దృష్టి పెట్టి అవి శుభ్రంగా ఉండేలా చూడండి. కిచెన్ వేగంగా  శుభ్రం చేసేందుకు పైనుంచి కిందకు టెక్నిక్ ఎంచుకోండి.

కౌంటర్ టాప్స్

కౌంటర్ టాప్స్ చక్కగా శుభ్రం చేసేందుకు సబ్బు నీటిని ఉపయోగించండి.

ఫ్లోర్లు

ఫ్లోర్లను ఊడ్చడం లేదా వ్యాక్యూమింగ్ చేయడం సరిపోదు. మిగిలిన గదులతో పోల్చితే కిచెన్ లో జిడ్డు ఉంటుంది కాబట్టి అక్కడి ఫ్లోరును వెట్ మాప్ ఉపయోగించి శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

సిరామిక్ సింక్ శుభ్రం చేసేందుకు కెమికల్స్

సిరామిక్ సింక్స్ శుభ్రం చేసేందుకు మార్కెట్ లో దొరికే కెమికల్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించండి.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading