10 HIDDEN GEMS TO VISIT IN INDIA IN 2022 DETAILS HERE GH VB
Tourist Places: 2022లో టూర్లకు వెళ్లాలనుకుంటున్నారా..? భారత్‌లో ఉన్న టాప్-10 బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో ఎన్నో ప్రాంతాలు టూరిజం స్పాట్స్‌గా మారుతున్నాయి. అయితే వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్-10 హిడెన్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవో చూద్దాం.
కొత్త సంవత్సరంలో టూర్లకు వెళ్లాలనుకుంటున్నారా? బెస్ట్ టూరిజం డెస్టినేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇందుకు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. భారత్‌లో ఎన్నో ప్రాంతాలు టూరిజం స్పాట్స్‌గా మారుతున్నాయి. అయితే వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్-10 హిడెన్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవో చూద్దాం.
1. మావ్లిన్నాంగ్, మేఘాలయ
ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచిన మావ్లిన్నాంగ్ కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్‌గా మారుతోంది. ఎక్కడా చెత్త కనిపించని వీధులు, మెరిసిపోయే రోడ్లు, పచ్చదనాన్ని సంతరించుకున్న ఇళ్లు, వెదురు డస్ట్బిన్లతో ఈ గ్రామం టూరిస్ట్‌లను ఆకట్టుకుంది
2. గురేజ్ వ్యాలీ, కశ్మీర్
గురెజ్ వ్యాలీలోని అందమైన సీనరీలు, నిశ్శబ్దంగా ఉండే పరిసరాలు, ప్రవహించే నదుల శబ్దం.. వంటివి మీకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోల్‌కు దగ్గర్లో ఉంటుంది. పెట్రోలింగ్, నిఘాలో ఉండే బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా గురేజ్ వ్యాలీ పేరొందింది.
3. జవాయి, రాజస్థాన్
ఇక్కడ చిరుతలు ఎక్కువగా సంచరిస్తాయి. స్థానిక జవాయి లెపర్డ్ క్యాంప్‌లో సఫారీ చేస్తూ చిరుతలను చూడవచ్చు. వలస పక్షుల సందడి, అన్ని సదుపాయాలు అందించే లగ్జరీ టెంట్లలో విడిది అడ్వెంచర్ ఫీలింగ్.. వంటివి వెకేషన్ మీకు గుర్తుండిపోయేలా చేస్తాయి.
4. లేపాక్షి, ఆంధ్రప్రదేశ్:
ఇది ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం. ఇక్కడ అపూర్వ కళా సంపద ఉంటుంది. లేపాక్షిలో వీరభద్రుడి ఆలయం ఉంటుంది. ఇక్కడ పైకప్పుకు వేలాడే రాతి స్తంభం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. స్థానికంగా ఉన్న ఇతర ఆలయాలను సైతం టూరిస్ట్‌లు దర్శించుకోవచ్చు.
5. చోప్తా, ఉత్తరాఖండ్:
నేచర్ లవర్స్‌కు బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇది. హిమాలయాల చెంతన, సముద్ర మట్టానికి 8790 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడి హిమాలయాల అందాలు, దట్టమైన అటవీ మార్గాలు, శీతల వాతావరణంలో మనుగడ సాగించే జంతువులను చూస్తూ అందాలను ఆస్వాదించవచ్చు.
6. పటాన్, గుజరాత్
ఇది ఒక బెస్ట్ ఆఫ్-బీట్ ట్రావెల్ డెస్టినేషన్ సిటీ. ఇక్కడ పురాతన దేవాలయాలు, అద్భుతమైన నిర్మాణాలు, దర్గాలు, జైన మందిరాలు ఉంటాయి.
7. మజులి, అస్సాం
మజులికి అస్సాం సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు ఉంది. జోర్హాట్ నగరానికి 20 కి.మీ దూరంలో బ్రహ్మపుత్ర నదిపై ఉన్న ద్వీపం ఇది. స్థానికుల సంస్కృతి, సంప్రదాయాలు టూరిస్ట్‌లను ఆకట్టుకుంటాయి. ఇక్కడికి ఫెర్రీలలో వెళ్లవచ్చు.
8. హెమిస్, లేహ్
లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో ఈ అందమైన గ్రామం ఉంటుంది. ఆకట్టుకునే ల్యాండ్స్కేప్స్కు ఈ ప్రాంతం నిలయం. హెమిస్ మొనాస్టరీ బౌద్ధ మందిరం టూరిస్ట్‌లకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో పెద్దగా కనిపించని మర్మోట్లు, లాంగర్లు, చిరుతలు, తోడేళ్లను ఇక్కడ చూడవచ్చు
iPhone: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి తరుణం.. భారీగా తగ్గిన ఐఫోన్ ధర.. వివరాలివే..
9. చంపానేర్, గుజరాత్
హిస్టారికల్ ప్లేస్‌లకు వెళ్లాలనుకునే వారు చంపానేర్ నగరాన్ని ఎంచుకోవచ్చు. ఇది UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్. గుజరాత్‌లోని పావగఢ్ కొండల్లో ఉంటుంది. ఈ ఇస్లామిక్-మొఘల్ నగరం నిర్మాణ శైలి, కోటల నిర్మాణం, హిల్స్ అందాలు ఆకట్టుకుంటాయి.
10. లుంగ్లీ, మిజోరాం
బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని అందమైన టూరిస్ట్ ప్లేస్ ఇది. నేచర్ లవర్స్‌కు లుంగ్లీ బెస్ట్ డెస్టినేషన్‌గా చెప్పుకోవచ్చు. జనసంచారం పెద్దగా ఉండదు. స్థానికంగా కనిపించే అందమైన పక్షులను చూస్తూ, ట్రెక్కింగ్, ఇతర సాహస క్రీడలను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.