10 HEALTH BENEFITS AND USES OF ROCK SALT HERE IS DETAILS
Rock Salt Health Benefits: కల్లుప్పుతో మన ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలా..?
ప్రతీకాత్మక చిత్రం
Rock Salt Health Benefits: రాతి ఉప్పుతో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీన్నే కల్లుప్పు అని పిలుస్తారు. ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు.
ఉప్పు లేనిదే రుచిలేదు. అయితే ఉప్పుతో మన ఆరోగ్యానికి ముప్పంటారు డాక్టర్లు. ఇంట్లో కూరల్లో వాడే ఉప్పుతో దుష్ఫలితాలున్నా... రాతి ఉప్పుతో మాత్రం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీన్నే కల్లుప్పు(Rock Salt) అని పిలుస్తారు. ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండే ఈ ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
రాతి ఉప్పుతో ప్రయోజనాలు: 1. కల్లుప్పుతో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కడుపు నొప్పిని కూడా దూరం చేస్తుంది. 2. శరీర జీవ క్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా శరీరం మరింత పరిపుష్టమవుతుంది. 3. బీపీని నియంత్రిస్తుంది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం.. రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులను కంట్రోల్ చేస్తుంది. 4. రోగ్య నిరోధక వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. శరీరంలోని బ్యాక్టీరియాను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. 5. రాతి ఉప్పును ఆహారంలో ఉపయోగించడం వలన నిద్ర బాగా పట్టి నిద్రలేమి సమస్య దూరమవుతుంది. 6. ఒక గ్లాసు గోరువచ్చని నీళ్లలో సగం టేబుల్ స్పూర్ రాతి ఉప్పును వేసి..కరిగాక తాగాలి. దీని వలన మానసిక ఒత్తిడి దూరమవుతుంది. 7. బకెట్ నీళ్లలో కాస్త రాతి ఉప్పును కలిపి స్నానం చేస్తే చర్మం కాంతివంతమవుతుంది. చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. 8.షాంపూలో కొంచెం కల్లుప్పు కలిసి తలస్నానం చేస్తే జుట్టు ఊడే సమస్య తగ్గుతుంది. వెంట్రుకలను చక్కగా శుభ్రపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకూ ఉపయోగపడుతుంది. 9.కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా...గాయపడ్డ కండరాలు మళ్లీ కోలుకునేందుకు కల్పుప్పు దోహదపడుతుంది. 10. కల్లుప్పు మంచి యాంటి బయాటిక్ కూడా. గొంతులో ఇన్ఫెక్షన్స్ ఉంటే వెచ్చని నీటిలో కల్లుప్పు వేసి గార్గిల్ చేస్తే వెంటనే ఉపసమనం లభిస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.