Diet and weight loss : బరువు తగ్గాలి అనుకోగానే తగ్గిపోయే పరిస్థితి ఉంటే... అంతకంటే ఆనందం ఏముంటుంది. కానీ... బరువు తగ్గడం అన్నది చాలా కష్టమైన ప్రక్రియ. దాన్ని మాటల్లో చెప్పలేం. బరువు తగ్గేందుకు ఎంతగానో శ్రమించేవారికే ఆ కష్టం తెలుస్తుంది. బరువు తగ్గేందుకు ఎక్సర్‌సైజ్‌లు చెయ్యడమే కాదు... ఏం తినాలన్నా ముందూ వెనకా ఆలోచించుకోవాల్సిందే. ఐతే... నిద్రపోయే ముందు... కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం మానేస్తే... చాలా వరకూ బరువు తగ్గిపోతారు. అవేంటో తెలుసుకుందాం.
సోడా : షుగర్ ఉండే సోడా లాంటి డ్రింక్స్... బరువు తగ్గాలనుకునేవారికి బద్ధ శత్రువులు. సోడాల వల్ల ఏ పోషకాలూ కలగవు. వాటిలో కేలరీలు ఎక్కువ. అందుకే సోడాలు తాగితే బరువు పెరిగిపోతారు. సోడాల వల్ల డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్, ఒబెసిటీ సమస్యలు ఎక్కువ.
ప్రాసెస్డ్ ఫుడ్స్ : ఫుడ్ ఇండస్ట్రీలో దూసుకొస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. సాసేజ్‌లు, సలామీ, హామ్ వంటి వాటిని నిద్రపోయేముందు తినకపోవడం మేలు. వీటిని తింటే బీపీ, హార్ట్ ఎటాక్, ఒబెసిటీ వంటివి వస్తాయి. ప్రాసెస్డ్ మాంసంలోని ట్రాన్స్ ఫాట్స్, సాల్ట్, షుగర్ వంటివి కేలరీలను పెంచేస్తాయి. ఈజీగా బరువు పెరిగిపోతారు.
పిజ్జా : పిజ్జా తినేందుకు చాలా టేస్టీగా ఉంటుంది. చీజీగా, సాసీగా నోరూరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఫేమస్. కాకపోతే రేటు ఎక్కువ. ఎంత ఎక్కువ చీజ్ (వెన్న) తింటే అంత కొవ్వు. సాస్‌లో షుగర్ ఉంటుంది. ఇక డఫ్‌లో రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందువల్ల ఓవరాల్‌గా పిజ్జా అనేది బరువును పెంచుతుంది. ఇక నాన్ వెజ్ టైపైతే... వాటిలో ప్రాసెస్డ్ మాంసం ఉంటుంది. అది ట్రాన్స్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. పిజ్జా బదులు... సంప్రదాయ రోటీలను కర్రీతో తినడం ఎంతో మేలు.
నట్స్ : బాదం, వాల్‌నట్, జీడిపప్పు, పిస్తా వంటివి ఎక్కువ పోషకాలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఐతే... వీటిలో కేలరీలూ ఎక్కువే. అందువల్ల పడుకునేముందు వీటిని తినకూడదు. ఎందుకంటే వీటిని తిన్నాక ఎక్సర్‌సైజ్ చేయకపోతే, ఇవి కొవ్వుగా మారి... బాడీలో స్టోర్ అవుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు.
ఐస్ క్రీమ్ : రాత్రి భోజనం చేశాక ఐస్ క్రీమ్ తింటే ఆ సంతృప్తే వేరు. కానీ... బరువు తగ్గాలనుకునేవారికి... ఐస్ క్రీమ్ అంత డేంజర్ ఇంకోటి ఉండదు. ఐస్ క్రీమ్‌లలో బోలెడంత షుగర్, ఎక్కువ కేలరీలు ఉంటాయి. అయినప్పటికీ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే... 15 గ్రాములకు మించి షుగర్ లేని ఐస్ క్రీమ్ తినడం బెటర్.
ఫ్రూట్ జ్యూస్ : ఇళ్లలో ఫ్రూట్ జ్యూస్ చేసుకోవడం మేలు. బయట కొంటే వాటిలో ఫుల్లుగా షుగర్ వేస్తారు. సోడా కలుపుతారు. ఫలితంగా వాటిలో ఫైబర్ పోతుంది. ముఖ్యమైన పోషకాలు మాయమవుతాయి. పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలూ దెబ్బతింటాయి. కమర్షియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా పిల్లలకు వాటిని అస్సలు ఇవ్వొద్దు. నిద్రపోయేటప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగొద్దు.
ఫ్రెంచ్ ఫ్రైస్ : ఆలూ చిప్స్ వంటి వాటిని నూనెలో బాగా వేయిస్తారు. అంటే ఫుల్లు ఫ్యాట్. పైగా ఆలూ అనేది కూడా ఫ్యాట్ ఎక్కువ ఉండే పదార్థం. అందువల్ల ఈ ఫ్రైలు, పాప్ కార్న్ వంటి వాటికి దూరంగా ఉండాలి. జస్ట్ 139 గ్రాముల ఫ్రెంచ్ ఫ్రైలలో 427 కేలరీలుంటాయి. ఈజీగా బరువు పెరిగిపోతారు. పైగా వీటిలో సాల్ట్ చాలా ఎక్కువ. అది మనకు తీవ్ర హాని కలిగిస్తుంది. తిన్నకొద్దీ తినాలనిపించే ఈ ఫ్రైల విషయంలో కచ్చితంగా నోరు కట్టేసుకోవాల్సిందే. లేదంటే... బరువు తగ్గాలి అనే ఆలోచన మానుకోవాల్సిందే.
కమర్షియల్ పీనట్ బటర్ : ఈమధ్య ప్రజలు పీనట్ బటర్ (వేరుశనగతో చేసే వెన్న)కి బాగా అలవాటు పడ్డారు. తినే ప్రతీ దానిపై పీనట్ బటర్ వేసుకొని లాగించేస్తున్నారు. బట్... కమర్షియల్ పీనట్ బటర్‌లో షుగర్, హైడ్రోజనేటెడ్ విజిటబుల్ ఆయిల్స్, సాల్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ బరువును పెంచేస్తాయి. కావాలంటే ఇంట్లోనే చేసుకోండి. వేరుశనగ పప్పుల్ని వేపి... కొద్దిగా ఉప్పు వేసి... మిక్సీలో వేసి పేస్టులా చేసుకుంటే సరి. ఏదేమైనా నిద్రపోయేటప్పుడు పీనట్ బటర్ అస్సలు తినొద్దు. దాని నిండా కేలరీలే.
చాకొలెట్ : చాకొలెట్ లాంటి వాటికి ఒక్కసారి అలవాటుపడితే చాలు... ఇక పదే పదే తినాలనిపిస్తాయి. డార్క్ చాకొలెట్స్ (కోకోతో చేసినవి) గుండెకు, బ్రెయిన్‌కీ మంచివే. కానీ... వాటిని నిద్రపోయేముందు మాత్రం తినకూడదు. వాటి నిండా షుగర్, ఫ్యాట్ ఉంటుంది. జంక్ ఫుడ్ ఎలాగైతే తినే కొద్దీ తినాలనిస్తుందో, చాకొలెట్స్ కూడా ఇంకా ఇంకా తినాలనిపించేలా చేస్తాయి. అందుకే వాటిని దూరం పెట్టాలి. అప్పుడు వద్దన్నా బరువు తగ్గి తీరతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Tips For Women, Weight loss, Women health, Women helath