హోమ్ /వార్తలు /khammam /

Khammam: ఆ ఎంపీపీ ఓ స్వయం ప్రకటిత దేవత.. పైగా వైద్యశాఖ డైరెక్టర్‌ పూజలతో వివాదం.. అసలెందుకీ రగడ.. ?

Khammam: ఆ ఎంపీపీ ఓ స్వయం ప్రకటిత దేవత.. పైగా వైద్యశాఖ డైరెక్టర్‌ పూజలతో వివాదం.. అసలెందుకీ రగడ.. ?

నిన్నమొన్నటి దాకా ఆమె ఏంచేసినా బయట ప్రపంచానికి పెద్దగా పట్టలేదు. కాకపోతే ఒక్కసారిగా ఈ ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనికి కారణం ఉంది.. స్వయంగా రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టరే ఈ హోమంలో పాల్గొనడం..

నిన్నమొన్నటి దాకా ఆమె ఏంచేసినా బయట ప్రపంచానికి పెద్దగా పట్టలేదు. కాకపోతే ఒక్కసారిగా ఈ ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనికి కారణం ఉంది.. స్వయంగా రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టరే ఈ హోమంలో పాల్గొనడం..

నిన్నమొన్నటి దాకా ఆమె ఏంచేసినా బయట ప్రపంచానికి పెద్దగా పట్టలేదు. కాకపోతే ఒక్కసారిగా ఈ ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనికి కారణం ఉంది.. స్వయంగా రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టరే ఈ హోమంలో పాల్గొనడం..

ఇంకా చదవండి ...

  (జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్‌ 18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  ఆమె ఓ మండల ప్రజా పరిషత్‌కు అధ్యక్షురాలు. అంటే ప్రజా ప్రతినిధి. గత కొన్నాళ్లుగా ఆమె తనకు తానే దేవత (Goddess)గా ప్రకటించుకున్నట్టు భక్తులు చెబుతున్నారు. నమ్మకం ఉన్నవాళ్లు ఆమె చెప్పేది వింటున్నారు. పూజలు చేస్తున్నారు. హోమాల్లోనూ పాల్గొంటున్నారు. ఆమె నిర్వహించే ప్రత్యంగిరాదేవి హోమాలు.. ఆ సందర్భంలో ఆమె హోమంలో విసిరే వస్తువులు భిన్నంగా ఉంటాయంటారు భక్తులు. సాధారణంగా క్షుద్రపూజలకు (Kshudrapuja) ఉపయోగించే మిరపకాయలను (Mirchi)ఇక్కడ హోమంలో విసరడం.. హోమం నిర్వహించే సమయంలో ఆమె చేసే అభినయం.. ప్రకటించే హావభావాలు.. నృత్యాలు.. ఇవన్నీ సాధారణంగా అనిపించవు. దీంతో సడెన్‌గా చూసేవాళ్లకు ఇదేదో క్షుద్ర తంత్ర పూజల్లా (Occult worships) అనిపించినా.. నిజానికి ఆమె చేసేది మాత్రం ఫక్తు పూజలేనని పండితులు కూడా చెబుతున్నారు.

  ఇక తనకు తానే స్వయంప్రకటిత దేవత (Godess)గా పేర్కొనడం పట్ల మాత్రం తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ప్రజలను హేతుబద్ధంగా నడిపించాల్సిన బాధ్యతల్లో ఉండి కూడా ఇలా వ్యవహరించడం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిన్నమొన్నటి దాకా ఆమె ఏంచేసినా బయట ప్రపంచానికి పెద్దగా పట్టలేదు. కాకపోతే ఒక్కసారిగా ఈ ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనికి కారణం ఉంది.. స్వయంగా రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టరే (health director) ఈ హోమంలో పాల్గొనడం.. ఆమెను దేవతగా అభివర్ణించడం.. ఇక్కడకు రావడం.. దర్శించుకోవడం.. హోమంలో పాల్గొనడం.. ఇవన్నీ తన పూర్వజన్మ సుకృతం అని ఒక  స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయి అధికారి చెప్పడం విస్మయానికి గురిచేస్తున్న విషయం.

  అలా పాల్గొనడం తన అదృష్టంగా..

  ఇక తనను తాను స్వయం ప్రకటిత దేవతగా చెప్పుకుంటున్న మహిళ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem) జిల్లా సుజాతనగర్‌ మండల ఎంపీపీ (MPP) భూక్యా విజయలక్ష్మి కాగా.. ఆమె భక్తునిగా హోమంలో పాల్గొన్నదీ.. అలా పాల్గొనడం తన అదృష్టంగా పేర్కొన్నదీ సాక్షాత్తూ వైద్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు (Gadala Srinivasa Rao.). కోవిడ్‌-19 కరోనా వైరస్‌ విజృంభించిన కాలంలో ప్రతి నిత్యం రాష్ట్రంలోని వైద్యారోగ్యశాఖ తరపున ఆ శాఖ బాధ్యునిగా వైద్య సేవల్లో చురుగ్గా పాల్గొన్న  డాక్టర్‌ గడల శ్రీనివాసరావు.. ప్రసార మాధ్యమాల్లో డీహెచ్‌ (DH)గా ప్రాచుర్యం పొందారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ సహా సోషల్‌మీడియాలో సైతం డీహెచ్‌ నిత్యం కనిపించిన పరిస్థితి. ఈ పాపులారిటీతో ఆయన ఇంటిపేరు కలిగిన వారంతా కలసి ఆయనతో 'గడల' వారి గెట్‌టుగెదర్‌ ఏర్పాటు చేశారంటే ఆయన ప్రాచుర్యాన్ని అంచనా వేయొచ్చు. దీనికితోడు డాక్టర్‌ శ్రీనివాసరావుది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి తరచూ వచ్చి వెళ్తున్న పరిస్థితి.

  రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన..

  ఈ మధ్య కాలంలో ఆయన తండ్రి మరణంతో రాకపోకలు పెరిగాయని ఆయనే చెప్పారు. దీనికితోడు తన తండ్రి పేరిట ఓ ట్రస్టు స్థాపించడం.. తరచుగా మెగా హెల్త్‌క్యాంపులు నిర్వహిస్తూ వైద్యసేవలు అందిస్తున్నారు. తాను వైద్య, విద్య,  ఉపాధి రంగాలలో ప్రజలకు సర్వీసు చేస్తున్నానని చెబుతున్నారు. అయితే డాక్టర్‌ గడల శ్రీనివాసరావుకు రాజకీయాల్లోకి(Politics) రావాలన్న ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.

  పదవి రీత్యా గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్‌ (Cm KCR)కు దగ్గరవ్వడం.. సామాజికవర్గం పరంగా బీసీ కావడం.. కొత్తగూడెం నియోజకవర్గంలో తెరాస తరపున సిట్టింగ్‌గా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ప్రతిష్ట ఈ మధ్య కాలంలో బాగా మసకబారడం.. ఇవన్నీ చూస్తే ఒక కొత్త వ్యక్తి ఇక్కడ పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అదనుగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ప్రజల్లోకి దూసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలోనే గిరిజన వర్గాల్లో సైతం తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశలోనే ఎంపీపీ విజయలక్ష్మి నిర్వహించిన పూజలు, హోమాల్లో పాల్గొన్నట్టు చెబుతున్నారు.

  ఏదిఏమైనా శాస్త్ర సాంకేతిక అంశాలను, వైద్య పరిజ్ణానాన్ని ప్రజల్లో చాటాల్సిన స్థానంలో ఉండి ఇలా హోమాల్లో పాల్గొనడం ఏంటన్న ప్రశ్న సైతం ఉత్పన్నమైంది. అయితే దీన్లో తప్పేముందని, మన సంప్రదాయాలకు అనుగుణంగానే తాను వ్యవహరించినట్టు శ్రీనివాసరావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను పాల్గొన్నది ప్రత్యంగిరాదేవి హోమంలోనేనని, కొందరు ప్రచారం చేసినట్టు క్షుద్రపూజలు ఎంతమాత్రం కాదని చెప్పారు. అయితే స్వయం ప్రకటిత దేవతగా చెప్పుకుంటున్న ఎంపీపీ విజయలక్ష్మి కి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈరోజల్లోనూ ప్రజలను మూఢనమ్మకాలవైపు తీసుకెళ్లడమేంటన్న ప్రశ్న జనం నుంచి వినిపిస్తోంది.

  First published:

  Tags: Khammam, TRS leaders

  ఉత్తమ కథలు