Home /News /khammam /

TUMU SARALA FAMILY MEMBERS THANKS THE DIRECTOR FOR MAKING VIRATAPARVAM FILM SNR KMM

Khammam| Virataparvam : విరాటపర్వం సినిమాలో కొన్ని కల్పితాలున్నాయి .. వాస్తవాలు చెప్పిన సరళ సోదరి

(కల్పితాలతో కూడిన యదార్ధం)

(కల్పితాలతో కూడిన యదార్ధం)

Khammam: ఉడుకు నెత్తురు ఆమెను నిలువనీయలేదు. విస్త్రతంగా సాగిన కమ్యూనిస్టు సాహిత్య అధ్యయనం ఆమెను పోరాటం వైపు నడిపించింది. కళ్ల ముందే అన్యాయం జరుగుతున్నా.. కిమ్మనలేని ప్రభుత్వాలు.. చర్యలు తీసుకోలేని అధికారులను చూస్తూ ఆమె ప్రశ్నించడమే శ్వాసగా బయలుదేరింది. కుటుంబం.. ఊరు.. చుట్టూ ఉన్న సమాజమే ఆమెకు విద్యాలయం కాగా.. తన పోరాటానికి మాత్రం ఆమె మన్యాన్ని కేంద్రంగా ఎంచుకుంది.

ఇంకా చదవండి ...
  (G.SrinivasReddy,News18,Khammam)
  ఉడుకు నెత్తురు ఆమెను నిలువనీయలేదు. విస్త్రతంగా సాగిన కమ్యూనిస్టు సాహిత్య అధ్యయనం ఆమెను పోరాటం వైపు నడిపించింది. కళ్ల ముందే అన్యాయం జరుగుతున్నా.. కిమ్మనలేని ప్రభుత్వాలు.. చర్యలు తీసుకోలేని అధికారులను చూస్తూ ఆమె ప్రశ్నించడమే శ్వాసగా బయలుదేరింది. కుటుంబం.. ఊరు.. చుట్టూ ఉన్న సమాజమే ఆమెకు విద్యాలయం కాగా.. తన పోరాటానికి మాత్రం ఆమె మన్యాన్ని కేంద్రంగా ఎంచుకుంది. అందుకే బందూకు పట్టుకోడానికి దాదాపు పరిగెత్తింది. కానీ కామ్రేడ్ల అనుమానపు చూపులకు, తానేంటో.. తన ఆశయాలేంటో చెప్పుకునే లోపుగానే సొంత బందూకులకే పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో బలైంది. ఖమ్మం(Khammam) జిల్లాలోని రఘునాథపాలెం(Raghunathpalem)మండలం కామంచికల్ (Kamanchikal)గ్రామానికి చెందిన తూము సరళ జీవితం ఆధారంగా... కొద్దిపాటి సినిమాటిక్ మార్పులతో రచయిత, దర్శకుడు ఊడుగుల లక్ష్మణ్(Udugula Lakshman)'విరాటపర్వం'(Virataparvam)మూవీని తెరకెక్కించారు.

  సరళ సోదరి మాటలు ..
  విరాటపర్వం సినిమాలో సరళ పాత్రలో నటించిన సాయిపల్లవి ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా సరళ కుటుంబ సభ్యులు అయితే తమ సోదరిని మళ్లీ చూసినట్లుగా ఉందన్నారు. సినిమా చూసిన తర్వాత వారి గత జీవితాల్లో జరిగిన యదార్ధ దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. 1977లో జోరుగా వానలు కురుస్తున్న సమయంలో స్వరాజ్యం, భిక్షమయ్య దంపతులకు జన్మించారు సరళ. భిక్షమయ్య వ్యవసాయం చేస్తూ గ్రామంలో భూముల కొలతలు కొలిచేవారు. పుట్టిన 20 రోజులకు కోమాలోకి వెళ్లిన సరళ తిరిగి ప్రాణాపాయం నుంచి బయట పడిందన్నారు ఆమె అక్క. తనకు చెల్లికి మధ్య ఏడేండ్ల వ్యత్యాసం ఉందంటూ తనకు చెల్లి సరళతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ ఇద్దరి మధ్యలో వెంకటేశ్వరరావు, మోహన్ రావు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.

  (రియల్‌ స్టోరీలో స్మాల్ చేంజ్)
  (రియల్‌ స్టోరీలో స్మాల్ చేంజ్)


  చిన్నతనం నుంచే..
  స్వతహాగానే వామపక్ష భావజాలం కలిగిన కుటుంబం. అందులో తండ్రి కమ్యూనిస్టు కావడం ఆయనకు దగ్గరగా సరళ ఉండటంతో ఆమెకు పుస్తకాలపై మక్కువ పెరిగింది. స్కూల్ బుక్స్‌తో పాటు ఇంట్లో ఉన్న విప్లవ పోరాటాలు, భూపోరాటాలకు సంబంధించిన వాటిని చదువుతూ ఉండేవారని సరళ పెద్దక్క తెలిపారు. పేపర్లలో చూసిన వార్తలపై వాదనకు దిగేదని ...ఆమెను తలుచుకుంటేనే తనకు ఏదో తెలియని బాధ కలుగుతుందన్నారు. బీపీ, షుగర్‌ కారణంగా విరాట్ పర్వం చూసి తట్టుకోలేనని తెలిసే సినిమాకి వెళ్లలేదన్నారు.

  ఇది చదవండి : జాతకాలు చెప్పుకునే వాడిని అమ్మాయి పేరు అడ్డుపెట్టుకొని చంపారు .. హత్య వెనుక పెద్ద కథే ఉందా  ఆమె అంటే అందరికి ఇష్టం..
  టీవీ, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై కూడా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమాలో సరళ క్యారెక్టర్ శంకరన్న అనే వ్యక్తిపై ప్రేమతో వెళ్లినట్లు చూపించారని ..అందులో వాస్తవం లేదని కేవలం కల్పితమేనన్నారు.సరళ ఐదో తరగతి వరకు భూపాలపల్లి జిల్లా సెల్పూర్‌లో చదివిన విషయాన్ని గుర్తు చేశారు ఆమె పెద్దక్క. 6వ తరగతి ఖమ్మం వన్ టౌన్ గర్ల్స్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు ఓ వామపక్ష పార్టీ విద్యార్ధి విభాగంలో చురుగ్గా పనిచేసింది. ఆ పరిచయాలు, ప్రేరణతోనో ఉద్యమాల పట్ల ఆకర్షితురాలై ఉండొచ్చన్నారు. సరళ అడవి బాట పడతానని వాళ్లతో అన్నప్పుడు మాకు చెప్పి ఉండాల్సింది. మేము ఏదో విధంగా నచ్చజెప్పేవాళ్లమన్నారు.

  ఇది చదవండి: యాదాద్రిలో దారుణం.. మాస్కు ధరించి బాలిక దగ్గరికొచ్చి గొంతకోసి పరారైన యువకులు..  కథలో మార్పులు చేర్పులు..
  సరిగ్గా ఆమెకు 10 ఏళ్ల 2నెలల వయసులో 1992 ఫిబ్రవరి 18న చిన్నతమ్ముడి జేబులో నుంచి రూ.200, ఆమె రాసుకున్న డైరీ తీసుకుని ఇంటి నుంచి వెళ్లింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనైతే నాన్నకు తెలిసిన వారు సమాచారం ఇస్తారనమో నిజామాబాద్ జిల్లా మానాల అటవీ ప్రాంతానికి చేరింది. తాను రాసుకున్న డైరీ చూడకుండా అనుమానించి చంపి ఉంటారు. డైరీ చదివి తప్పు తెలుసుకుని ప్రకటన విడుదల చేశారు. నాడు టెలిఫోన్, టెలిగ్రామ్ సౌకర్యం ఉంది. అనుమానం ఉంటే ఆమెను విచారించి మాకు సమాచారని చెప్పారు. చిన్నకూతురు కావడం, ఎంతో కలుపుగోలుగా హుషారుగా ఉండే సరళ అంటే నాన్నకు ఎంతో అభిమానం ఉండేదన్నారు సరళ సోదరి. ఆమె కోసమే అన్నీ వదులు కొని ఖమ్మం వచ్చి ఇక్కడే డెయిరీ ఫామ్ నిర్వహిస్తూ తమను పెంచి ,పెద్ద చేశారని చెప్పారు. సరళ దూరమవడాన్ని తట్టుకోలేకపోయిన తన తండ్రి మంచాన పడి 2009లో కన్నుమూశారు. అమ్మ వరంగల్ తమ్ముళ్ల దగ్గర ఉంటోంది. చిన్నతమ్ముడి భార్య ప్రశాంతి డాక్టర్ కాగా, తమ్ముడు ఓ డిజిటల్ మీడియా సంస్థకు ఎండీగా ఉన్నారు. ఇటు హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారని సరళ పెద్ద అక్క కుటుంబ విషయాలను మరోసారి అందరికి తెలియజేశారు.

  పెళ్లి ఆలోచనే లేదు..
  విరాట పర్వం సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసినప్పటికి తన సోదరి జీవితాన్ని చిత్ర రూపంలో తెరకెక్కించిన ఊడుగుల లక్ష్మణకు రుణపడి ఉంటామన్నారు సరళ సోదరి. వరంగల్ లో తమ్ముడి ఇంటికి వెళ్లిన సాయిపల్లవిని చూసి మేం గర్వపడ్డామని మా సరళను చూసినట్టే ఉందన్నారు. సాయిపల్లవికి సినిమాలో పెట్టిన వెన్నెల పేరు లాగానే తమ సోదరి జీవితం కూడా అడవి కాసిన వెన్నెలా మారిందన్నారు. అంతే కాదు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రవర్తించాలని..చదువుకొని కుటుంబానికి అండగా ఉంటూనే సమాజానికి సేవ చేయాలని సూచించారు తూము సరళ సోదరి.

  ఇది చదవండి: కొత్త జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇప్పుడు కాదు.. అప్పుడే..!


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Virataparvam

  తదుపరి వార్తలు