Home /News /khammam /

TRS SENIOR LEADER TUMMALA NAGESWARA RAO MADE SENSATIONAL REMARKS THAT SOME PEOPLE WERE BETRAYING THE PARTY PRV

Tummala nageswara rao: టీఆర్​ఎస్​ మాజీ మంత్రి తుమ్మల మరోసారి సంచలన వ్యాఖ్యలు.. వారి పని మీరే చేయాలంటూ..

తుమ్మల నాగేశ్వరరావు (ఫైల్ ఫోటో)

తుమ్మల నాగేశ్వరరావు (ఫైల్ ఫోటో)

ఖమ్మంలో గత కొద్దిరోజులుగా రాజకీయాలు హాట్​మాట్​గా మారిపోయాయి. టీఆర్ఎస్ (TRS) సీనియర్ నేత, మాజీ మంత్రితుమ్మల నాగేశ్వరరావు (Tummala nageswara rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఖమ్మం (Khammam) జిల్లా రాజకీయాలంటే మొదట గుర్తొచ్చేది టీఆర్ఎస్ (TRS) సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు (Tummala nageswara rao) పేరే. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా.. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన తుమ్మల ఇప్పుడు ఎక్కడున్నారు. ఏంచేస్తున్నారు..? ఆయన రాజకీయ చాణక్యాన్ని.. అభివృద్ధి వ్యూహాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి వాడుకోవడం లేదా..? సముచితమైన ప్రాధాన్యం కల్పించడం లేదా..? తరాలు మారుతున్న రాజకీయంలో ఇప్పుడు తుమ్మల స్థానమెక్కడ..? ఆయన దారెటు అన్నదే పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. ఈ మధ్య కాలంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

    తాను భిక్షమేసే మనిషిని కాదని..

    కాగా, తుమ్మల నాగేశ్వరరావు  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు పార్టీకి ద్రోహం చేశారని.. వారి సంగతి మీరే ఆలోచించాలని కార్యకర్తలకు తుమ్మల పిలుపునిచ్చారు. తాను భిక్షమేసే మనిషిని కాదని.. మీరే పది మందికి భిక్షమిచ్చే స్థాయికి తీసుకొస్తానని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పాలేరులో పెద్ద పాలేరులా పనిచేశానని.. 70 ఏళ్లలో లేని అభివృద్ధిని మూడేళ్లలో చేశానని తుమ్మల గుర్తుచేశారు. పార్టీలకతీతంగా ప్రజల కష్టాలు తీర్చానని ఆయన వ్యాఖ్యానించారు.

    జిల్లా అభివృద్దిని చూసుకొంటానని..

    కాగా, ఇటీవల కూడా తుమ్మల ఇలాంటి ఆరోపణలే చేశారు. రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ, రాజకీయ ద్రోహులను నమ్మలేమన్నారు. ద్రోహం చేసి పార్టీని ఓడిస్తారని తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యర్ధులపై పరోక్షంగా విమర్శలు చేశారు. ద్రోహన్ని మీరు చూసుకొండి జిల్లా అభివృద్దిని నేను చూసుకొంటానని ఆయన పార్టీ (TRS) కార్యకర్తలను కోరారు. KCR తో మాట్లాడి జిల్లాను అభివృద్ది చేస్తానని చెప్పారు. మళ్లీ మీ ముందుకు వస్తానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

    జలగం వెంగళరావును మరిపించిన నేతగా..

    ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావును మరిపించిన నేతగా తుమ్మలకు పేరుంది. పైగా వీళ్లిద్దరూ సత్తుపల్లి నుంచే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ  (TDP) స్థాపించిన రోజు నుంచి ఆయన వెంటే నడచిన తుమ్మల.. ఆనక మారిన పరిస్థితుల్లో చంద్రబాబుకు చేదోడుగా ఉంటూ ప్రభుత్వంలో అనేక కీలక మంత్రిత్వశాఖలు నిర్వర్తించారు. భారీ నీటిపారుదల, ఆర్‌ అండ్‌ బి, ఎక్సైజ్‌ లాంటి కీలక శాఖలను నిర్వర్తించిన తుమ్మలకు పాలనా దక్షునిగా పేరుంది. తనతో కలసి పనిచేసిన ఐఏఎస్‌ అధికారులతో తుమ్మల ఇప్పటికీ టచ్‌లో ఉంటారని పేరు. ఆయన ఫోన్‌ చేస్తే సెంట్రల్‌ సర్వీస్‌లో డిప్యుటేషన్‌ మీద ఢిల్లీ ఆఫీసర్లయినా సరే వేగంగా స్పందించి పని చేసే స్థాయి ఇప్పటికీ ఉందన్నదీ నిజమే. ఇది పదవిలో ఉన్నా లేకున్నా తుమ్మలకు ఆఫీసర్లు ఇచ్చే మర్యాదగా అందరూ చెబుతుంటారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Khammam, Trs, Tummala nageshwara rao

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు