Home /News /khammam /

TRS LEADERS SAID THAT TELANGANA CM KCR WAS THE ONLY CHIEF MINISTER TO FILL ALL THE VACANCIES IN THE AGRICULTURE DEPARTMENT KMM PRV

Agriculture: వ్యవసాయ శాఖలో ఖాళీలను భర్తీ చేసిన ఏకైన ముఖ్యమంత్రి కేసీఆర్​.. టీఆర్​ఎస్​ మంత్రి వ్యాఖ్యలు

పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్)

పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్)

ఖమ్మంలో జరిగిన వానాకాలం-2022 సాగు సన్నాహక సమావేశంలో రైతులకు మంత్రులు ఎలాంటి పంటలు వేయాలి.. సాగు పద్దతులు, రైతులకు ఎలా సాయం అందించాలి.. విత్తనాలు ఇతర సాగు పద్దతులపై చర్చలు జరిగాయి.

    ఖమ్మం (Khammam)లో జరిగిన వానాకాలం-2022 సాగు సన్నాహక సమావేశంలో రైతులకు (farmers) మంత్రులు ఎలాంటి పంటలు వేయాలి.. సాగు పద్దతులు, రైతులకు ఎలా సాయం అందించాలి.. విత్తనాలు ఇతర సాగు పద్దతులపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్​ కుమార్ (Puvada Ajay Kumar)​, సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..‘‘ రైతులు ఏ పంటలు వేయాలి ? వ్యవసాయాన్ని ఎలా లాభదాయకం చేసుకోవాలి ? అన్న పరిస్థితి లేకుండే. 2014 కు ముందు వ్యవసాయ శాఖను పట్టించుకున్న పరిస్థితి లేదు .. గత పాలకులు పూర్తిగా విస్మరించారు. 2014 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ శాఖలో ఖాళీలు (Vacancies in the Department of Agriculture) భర్తీ చేశారు .. వ్యవసాయ శాఖకు రైతులలో గౌరవం పెంచారు”అన్నారు.

    గుజరాత్ లో 24 గంటల కరెంటు లేదు..

    ‘‘రైతుబంధు సమితులకు ప్రోత్సాహం అందిస్తాం .. వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో గుర్తింపు ఇస్తాం. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి, పథకాలు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి కేసీఅర్ గారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో 24 గంటల కరెంటు లేదు .. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చారు.   తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలగడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం”అన్నారు.

    మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ మాట్లాడుతూ.. ‘‘ వ్యవసాయ బాగుపడాలి అంటే వ్యవసాయ రంగంలో విస్తరణ జరగాలి. నూతన యాజమాన్య పద్దతులు, పంటలు వేయాల్సిన పద్దతులు, వాడాల్సిన ఎరువులు, రసాయనాలపై రైతులకు తెలియజెప్పాలి. వ్యవసాయ శాఖలో అన్ని పోస్టులు ((Vacancies in the Department of Agriculture) )భర్తీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని బలోపేతం చేయమని వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఓలను కోరిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతువేదికలను సద్వినియోగం చేసుకుని ఏఈఓలు రైతులను చైతన్యం చేయాలి. ఖమ్మం వ్యవసాయంలో ఉమ్మడి రాష్ట్రంలో , తెలంగాణ రాష్ట్రంలో ముందున్న జిల్లా .. పంటల వైవిద్యీకరణలో ఖమ్మం ముందున్నది. దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ప్రతి రైతువేదికలో నిరంతరం కార్యక్రమాలు జరగాలి” అన్నారు.

    నూతన యాజమాన్య పద్దతులు..

    ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..“దేశంలో రైతుల గురించి ఆలోచించింది కేసీఆర్ , తెలంగాణ ప్రభుత్వమే. సాగునీరు, 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా అందిస్తున్నారు. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు అందుబాటులో లేదు. రైతుకు ఏం కావాలో కేసీఆర్ అందిస్తున్నారు. రైతులు ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టిసారించాలి. ఆయిల్ పామ్ సాగును ఉమ్మడి ఖమ్మంలో మరింత విస్తృతంగా సాగుచేయాలి. నూతన యాజమాన్య పద్దతులు, పంటలు వేయాల్సిన పద్దతులు, వాడాల్సిన ఎరువులు, రసాయనాలపై రైతులకు తెలియజెప్పాలి.

     ఏకైక ముఖ్యమంత్రి..

    రాష్ట్రంలో వ్యవసాయాన్ని బలోపేతం చేయమని వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఓలను కోరిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతువేదికలను సద్వినియోగం చేసుకుని ఏఈఓలు రైతులను చైతన్యం చేయాలి. ఖమ్మం వ్యవసాయంలో ఉమ్మడి రాష్ట్రంలో , తెలంగాణ రాష్ట్రంలో ముందున్న జిల్లా .. పంటల వైవిద్యీకరణలో ఖమ్మం ముందున్నది. దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది.
    ప్రతి రైతువేదికలో నిరంతరం కార్యక్రమాలు జరగాలి” అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Agriculture, Farmers, Jobs in telangana, Khammam, Palla rajeshwar reddy, Puvvada Ajay Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు