హోమ్ /వార్తలు /khammam /

Khammam : బొ గ్గు రవాణా కోసం కొత్తగూడెం - సత్తుపల్లి మధ్య రైలు..ట్రయిల్‌ రన్‌ సక్సెస్‌

Khammam : బొ గ్గు రవాణా కోసం కొత్తగూడెం - సత్తుపల్లి మధ్య రైలు..ట్రయిల్‌ రన్‌ సక్సెస్‌

(ట్రయిల్‌ రన్‌ సక్సెస్ )

(ట్రయిల్‌ రన్‌ సక్సెస్ )

Khammam : పర్యావరణానికి కాలుష్య ముప్పు ఏర్పడకూడదనే ఆలోచనతో సింగరేణి వేసిన ముందడుగు ఇప్పుడు ఎంతో ఉపయోగపడనుంది. ఖమ్మం జిల్లాలో బొగ్గు రవాణా చేయడానికి సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు నిర్మించిన రైలుమార్గంలో శనివారం ట్రయిల్‌ రన్ సక్సెస్‌ఫుల్‌ నడిపించారు.

ఇంకా చదవండి ...

పర్యావరణానికి కాలుష్య ముప్పు ఏర్పడకూడదనే ఆలోచనతో సింగరేణి వేసిన ముందడుగు ఇప్పుడు ఎంతో ఉపయోగపడనుంది. ఖమ్మం జిల్లాలో బొగ్గు రవాణా చేయడానికి సత్తుపల్లి నుంచి కొత్తగూడెం (Sattupalli to Kottagudem )  వరకు నిర్మించిన రైలుమార్గం శనివారం(Saturday)అందుబాటులోకి వచ్చింది. గత రెండున్న సంవత్సరాల కాలం నుంచి ఈ రైల్వే లైన్‌(Railway line)‌ పనులు పూర్తి చేయడం కోసం అటు సింగరేణి, ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో భాగంగానే చకచక పనులు పూర్తి చేసింది. 927.94 కోట్ల ఖర్చుతో 54.10కిలో మీటర్ల మార్గం వరకు ఈ రైలు లైన్ నిర్మించారు. అత్యంత వేగంగా పూర్తయిన కొత్త రైలు మార్గం ఇదే కావడం విశేషం.

 అందుబాటులోకి కొత్త రైల్ లైన్..

సత్తుపల్లి-కొత్తగూడెం మధ్యలో నిర్మించిన రైల్వే లైన్‌కు 927.94 కోట్ల ఖర్చు అయితే అందులో సింగరేణి తమ వాటా కింది 618.55 కోట్లు చెల్లించింది. దక్షిణా మధ్య రైల్వే వాటా కింద 309.39 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ఈ రైల్‌ మార్గం ద్వారా ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాలని లక్ష్యంతో దీన్ని నిర్మించారు. శనివారం నాడు సత్తుపల్లి నుండి బొగ్గు లోడుతో మొదటి రైలు కొత్తగూడెనికి చేరుకుంది. ఈకార్యక్రమంలో ఛైర్మన్‌ ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ పాల్గొన్నారు. పర్యావరణహితంగా బొగ్గు రవాణా చేయాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశామన్నారు.

ట్రయిల్‌ రన్ సక్సెస్..

ట్రయిల్‌ రన్ ద్వారా పాల్వంచ నుంచి కొత్తగూడెంకు పంపిన తొలి రైలు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరుకుంది. ట్రయల్‌ రన్‌ విజయవంతం అయినట్లుగా సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్రకటించారు. ఎప్పటి నుంచి తమ పట్టణానికి రైలు వస్తుందని ఆశగా ఎదురుచూసిన సత్తుపల్లి ప్రజల కల ఈవిధంగా నెరవేరింది. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి బొగ్గుగనిలో ట్రైన్‌ వెళ్లింది. రైలు కూతపెడుతూ వస్తుంటే స్థానికులు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు.

ఇంకా మిగిలిన లైన్ల సంగతేటి..

ఖమ్మం జిల్లాలో ఈ రైల్వే లైన్‌ పూర్తి కావడం సింగరేణి యాజమాన్యం కంటే స్థానికులే ఎక్కువగా సంతోషపడుతున్నారు. అటు భద్రాచలం(కొత్తగూడెం) నుండి కొవ్వూరు రైల్వేలైన్‌తో పాటు సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, ఆంధ్రాలోని జంగారెడ్డిగూడెం, కోయలగూడెం, గోపాపురం, కొవ్వూరు ప్రజలు సైతం తమ ఊరికి రైలు ఎప్పుడు వస్తుందో అని ఆశగా ఎదురచూస్తున్నారు. మరి వాళ్ల కోరిక నెరవేరేది ఎప్పుడో చూడాలి.

First published:

Tags: Khammam, Singareni, South Central Railway

ఉత్తమ కథలు