THE UNION MINISTER VISITED THE FAMILY OF SAI GANESH WHO COMMITTED SUICIDE IN KHAMMAM AFTER BEING HARASSED BY POLITICIANS PRV
Khammam: ఖమ్మంలో దిగిన కేంద్ర మంత్రి.. ఆత్మహత్య చేసుకున్న సాయి గణేశ్ కుటుంబానికి పరామర్శ
(బీజేపీ లీడర్ సాయి గణేష్)
రాజకీయ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఈ నెల 14వ తేదీన ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగిన సాయి గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించాడు. ఈ ఘటన ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వివాదంగా మారింది.
ఖమ్మం (Khammam)లో ఆత్మహత్య (Suicide) చేసుకున్న బీజేపీ నేత సాయి గణేశ్ (Sai Ganesh) కుటుంబాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Union Minister Rajeev Chandrasekhar) పరామర్శించారు. సాయిగణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ (BJP)యువ కార్యకర్తను కోల్పోయిందని అన్నారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Visited family of Sai Ganesh, @BJP4Telangana Karyakarta frm #Khammam,hounded n harassed into commttng suicide by #TRS ldrs. I rqstd dist admin to investigate his suicide
Dynasty parties r left wth only violence n intimidation to counter BJPs popularity but will nvr succeed pic.twitter.com/2EFrDGudQi
మరోవైపు ఖమ్మం (Khammam)లో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై CBI విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundararajan )ను బీజేపీ నేతలు కోరారు. బుధవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తో BJP నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.
సాయి గణేశ్ (Sai Ganesh) ఆత్మహత్యకు నిరసనగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. అదేవిధంగా ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) నిర్వహిస్తున్న బండి సంజయ్ నిరసన దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో నిజాం పాలన (Nizam regime)లో అరాచకాలు (anarchy) ఎలా ఉండేవో అదే తరహలో అరాచకాలు టీఆర్ఎస్ పాలన (TRS regime)లో ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Telangana state president Bandi Sanjay) ఆరోపించారు.
శిక్ష పడేవరకు పోరాటం..
సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై సీబీఐ విచారణ జరిపించి తమ తప్పును రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలని కోరారు. తప్పు చేస్తున్న టీఆర్ఎస్ (TRS) నేతలను వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. గణేష్ మరణానికి కారణమైన వారికి శిక్ష పడేవరకు పోరాటం చేస్తామన్నారు. ఖమ్మం (Khammam )లో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి టీఆర్ఎస్ నేతలే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్వేధింపులకు పాల్పడ్డారని బండి అన్నారు. సాయి గణేష్ పై 16 కేసులు నమోదు చేయించారని సంజయ్ ధ్వజమెత్తారు. అంతేకాదు సాయి గణేష్ పై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.