Home /News /khammam /

THE RULING PARTY LEADERS ARE SQUEEZING SETTLEMENTS IN THE REAL ESTATE LAND DISPUTES THAT ARE RAMPANT IN KHAMMAM KMM PRV

Real Estate Fights: కార్పొరేటర్ల భర్తల రియల్ దందా.. వర్గాలుగా విడిపోయి మరీ భూకబ్జాదారులకు అండ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఖమ్మం.  నాడు సుఖశాంతులతో వర్ధిల్లింది. ప్రజల ధనమాన ప్రాణాలకు చింత ఉండేది కాదు. ఆస్తుల పరిరక్షణ గురించి ఏరోజూ చీకూచింతా లేదు. నాడు పట్టణంగా ఉన్న ఖమ్మం నేడు నగరంగా రూపాంతరం చెందింది. దానితో పాటే రియల్ మాఫియా విస్తరించింది.

  ఖమ్మం (Khammam).  నాడు సుఖశాంతులతో వర్ధిల్లింది. ప్రజల ధనమాన ప్రాణాలకు చింత ఉండేది కాదు. ఆస్తుల పరిరక్షణ గురించి ఏరోజూ చీకూచింతా లేదు. నాడు పట్టణంగా ఉన్న ఖమ్మం నేడు నగరంగా (City) రూపాంతరం చెందింది. దానితో పాటే రియల్ మాఫియా విస్తరించింది. నాడు ప్రజల ఆస్తులకు ప్రభుత్వం (Government) రక్షణగా ఉండేది. నేడు 'కంచే చేను మేసిన చందంగా పాలకులే ప్లాట్ల కబ్జాకు పూనుకుంటున్నారు. కార్పొరేషన్ స్టీరింగ్ చేబూనిన 'కారు' నేతలు ఆక్రమణదారులకు అండగా ఉంటూ సామాన్యుల చెరబడుతున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో ప్లాట్ను డబుల్, అంతకుమించి రిజిస్ట్రేషన్లు చేయిస్తూ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల  'అండతోనే అధికారం మాటున దురాక్రమణల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని ఉదంతాలు దీనికి ఉదాహరణలుగా ఉన్నాయి. ఏరోజు ఎక్కడ ఏ దురాక్రమణ జరుగుతుందో..! రియల్ మాఫియా (real estate mafia) ఎలా పడగ విప్పుతుందో.!! ఏ ప్లాట్ను కాజేస్తుందోనని నగర వాసులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక విలువైన ప్రాంతాల్లో ఖాళీ జాగాలున్న వారైతే ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. ముఖ్యంగా టూటౌన్ ప్రాంతంలో నిత్యం ఏదో ఒకచోట గొడవే.

  నగరంలో జరిగే ప్రతిఘటనకు భూ తగాదాలే (Land fights) కారణం. అదీ రమణగుట్ట మొదలు మనుత ఆస్పత్రి వరకూ ఎక్కడైనా సరే ఇదే తంతు. పేదలు 50 గజాల లోపు స్థలంలో గుడిసెలు వేసుకుంటే రాత్రికి రాత్రి వాటిని తొలగించే అధికారులు.. అదే ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యవసాయం, చిరు వ్యాపారాలతో పైసా పైసా పోగేసుకుని మిగిలిన కొద్దిపాటి ఆదాయంతో పది పదిహేనేళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు ఖాళీగా ఉన్నాయంటే కబ్జా కన్ను పడినట్లేనని దానిపై మాత్రం అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు.

  మంత్రి గారి దగ్గరికి పంచాయితీ..

  ఖానాపురం (Khanapuram) హవేలీ రెవెన్యూ పరిధిలోని ఖమ్మం బైపాస్ రోడ్డు 50వ డివిజన్లో రెండురోజుల క్రితం చోటుచేసుకున్న ఉదంతం అధికార పార్టీలో చిచ్చుపెట్టిందనే చర్చ నడుస్తోంది. ఇక్కడి విద్యానగర్ 1184 చదరపు గజాల స్థల వివాదం చినికి చినికి గాలివానగా మారింది. 304 సర్వేనంబర్లలో దేనికి చెందినదో నిర్ధారించాల్సిన ఈ స్థలం విషయంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు తలదూర్చినట్లు సమాచారం. రూ.3 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలం తమదంటే తమదంటూ వర్గాలుగా విడిపోయి వైరానికి (Real Estate Fights) పాల్పడుతున్నారు. దీనికి  కార్పొరేటర్ల భర్తలు కొమ్ము కాస్తున్నారని అంటున్నారు.  ఈ గొడవ కాస్త చినికి చినికి గాలివానగా మారి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minsiter Ahay kumar)దగ్గరకు వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఇరు వర్గాలను పిలిపించి చర్చించిన మంత్రి వీరిలో ఓ కార్పొరేటర్ భర్త (Corporator Husband)ను తీవ్రంగా మందలించినట్లు సమాచారం. అయితే ఆ కార్పొరేటర్ భర్త కూడా మంత్రికి ధీటుగా సమాధానం ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది. అవసరమైతే ఈ స్థలం వ్యవహారం కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR) వరకూ తీసుకెళ్తానని, ప్రాణాలు పోయినా సరే రాజీ పడేదే లేదని హెచ్చరించారని అంటున్నారు.

  అధికారపార్టీలో 'విద్యానగర్' దురాక్రమణ దుర్బుద్ధి!

  నగరంలో డబుల్, అంతకుమించి రిజిస్ట్రేషన్లు ఉన్న ప్లాట్లు వందలాదిగా ఉన్నాయి. వీటిలో అత్యధికం అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల గుప్పిట్లోనే ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఖానాస్వరం హవేలీ సర్వే నంబర్ మూడులో కృష్ణుడి గుడి, దానికి కొద్ది దూరంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో 200 పైగా ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. 4,6,7 తదితర డివిజన్లలో ఇలా వందలాది ప్లాట్లు దురాక్రమణకు గురై డబుల్, అంతకుమించి రిజిస్ట్రేషన్లు చేశారని స్థానికులంటున్నారు. రఘునాథపాలెం డబుల్ బెడ్రూంల సమీపంలో శవాయిగూడెంకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు చివరికి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఆధారంగా కూడా పాట్ల రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ రూ.2000 విలువ చేసే ప్లాట్లను రూ.5వేలకు పైగా విక్రయిస్తున్నట్లు సమాచారం.  ఇప్పటికే 50కి పైగా ప్లాట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇతగాడి వలలో పడి చేస్తా కానీ, తెరవెనుక రాజకీయాలు నడిపిస్తున్నారని అంటున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Land mafia, Land scam, Puvvada Ajay Kumar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు