Home /News /khammam /

THE LADY GANG IS COLLECTING MONEY TO INCLUDE THE NAME IN THE LIST OF DOUBLE BEDROOM BENEFICIARIES IN KHAMMAM KMM PRV

Double Bedroom: ఖమ్మంలో లేడీగ్యాంగ్‌.. డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పేరిట కోట్లలో వసూలు.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఖమ్మం నగరంలో ఓ లేడీ గ్యాంగ్‌ తయారైంది. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయిస్తే ఒక్కో పేరుకు రూ.60 వేల నుంచి లక్షా ఇరవై వేలదాకా వసూలుకు తెరతీసింది.

    (G. Srinivasa reddy, News18, Khammam)

    ఖమ్మం (Khammam) నగరంలో ఓ లేడీ గ్యాంగ్‌ (The lady gang) తయారైంది. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు  (Double bedroom House) మంజూరు చేయిస్తే ఒక్కో పేరుకు రూ.60 వేల నుంచి లక్షా ఇరవై వేలదాకా వసూలుకు తెరతీసింది. పైగా ప్రభుత్వం ఇచ్చే ఈ ఇంటిని పెట్టుకుని అదనంగా లోన్‌ ఇప్పిస్తామని నమ్మించి సైతం జనం నుంచి డబ్బు వసూలుకు (collecting money )ఈ గ్యాంగ్‌ తెగబడింది. ఇలా గత ఆరునెలల వ్యవధిలో సుమారు కోటికి పైగా వసూలు చేసినట్టు చెబుతున్నారు. తమ వద్ద ఖమ్మం పట్టణానికి చెందిన షకీనాబేగం, పుట్టకోటకు చెందిన లక్ష్మిలు కలసి ఇల్లు (Double bedroom House) ఇప్పిస్తామని నమ్మబలికి డబ్బు తీసుకున్నారని.. ఎన్నాళ్లకు ఇవ్వకపోయేసరికి నిలదీయడంతో మంజూరు సర్టిఫికెట్లు ఇచ్చారని.. తీరా అవి డూప్లికేట్‌ అని తేలిందని.. మళ్లీ ప్రశ్నించడంతో ఇవ్వాల్సిన డబ్బుల కింద  ప్రామిసరీ నోట్‌ రాశిచ్చారని బాధితులు వాపోయారు.

    ఈమేరకు ఖమ్మం నగరంలోని ఖానాపురం (Khanapuram) ప్రాంతానికి చెందిన నాసబోయిన నరేష్‌, అజయ్‌లు ఫిర్యాదు చేశారు.  తమకు జారీ చేసిన నకిలీ సర్టిఫికెట్లు, బాధితులకు రాసిచ్చిన రూ.20 మేర ప్రామిసరీ నోట్లను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ (Minister Puvvada Ajay kumar)కు బాధితులు చూపి న్యాయం చేయమని వేడుకున్నారు. దీంతో మంత్రి విచారణకు ఆదేశించారు. మంత్రి సూచన మేరకు బాధితులు ఖానాపురం హవేలి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.



    ఎలాంటి పేమెంట్‌ చేయనక్కర్లేదు..

    డబుల్‌ బెడ్‌రూం ఇల్లు (Double bedroom House) . పేదింటి కల. సీఎం కేసీఆర్ (CM KCR) మానస పుత్రిక. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఓ కుటుంబానికి గౌరవ ప్రదంగా బతకడానికి అనువుగా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడానికి స్కీం రూపొందించారు. నిజానికి ఈ స్కీంలో లబ్దిదారుడు ఎలాంటి పేమెంట్‌ చేయనక్కర్లేదు. కానీ పేదలు, బడుగు బలహీన వర్గానికి చెందిన వారికి ఉన్న ఆశలను అడ్డం పెట్టుకుని దళారులు ఇలా వసూళ్లకు తెగబడుతున్నారు. ఇలా ఒకరిద్దరికి వల వేయడం, వారిని అడ్డం పెట్టి వారి బంధువులు, స్నేహితుల వద్ద ఇలా ఖమ్మంలో వందలాది  మంది నుంచి రూ.కోటికి పైగా ఇలా వసూలు చేసి.. అదేమంటే మేం అధికార పార్టీ వాళ్లమని బెదిరిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు.

    ఇది కేవలం ఖమ్మం నగరానికే పరిమితం కాలేదని, జిల్లాలో పలు చోట్ల ఇలాంటి దళారుల దోపిడీ ఉందని గతంలోనూ, ఇప్పుడూ విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం గొప్ప ఆశయంతో అమలు చేస్తున్న పథకానికి ఇలా అధికార పార్టీ ముసుగులో దళారులు తూట్లు పొడవడం.. నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతోంది.  డబుల్‌ బెడ్‌రూం ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cheating case, Double bedroom houses, Khammam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు