Home /News /khammam /

THE GIRLFRIEND CAME TO THE WEDDING HALL AND PROTESTED AS THE BOY WHO LOVED HER WAS GETTING MARRIED TO ANOTHER GIRL IN KHAMMAM KMM PRV

Khammam: ప్రేమించిన వ్యక్తిని కాదని మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. అదే సమయంలో మండపానికొచ్చిన ప్రియురాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ ప్రియురాలు ప్రియుడి పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించింది. పెళ్లి చేసుకుంటానని యువతి రజినీకి మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడు శ్రీనాథ్‌ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో ప్రియురాలి వచ్చింది మండపానికి.

    నమ్మితే చాలు మోసం చేసే వాళ్లు అడుగడుగున ఉంటారు. ఇంకా చెప్పాలంటే ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి వాళ్ల బలహీనతలు తెలుసుకొని శారీరకంగా లోబర్చుకునే వాళ్లు ఎక్కువయ్యారు. తాజాగా ఖమ్మం  (Khammam) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ప్రియుడి తన ప్రియురాలిపై మోసం చేశాడు. దీంతో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో జరుగుతున్న తన ప్రియుడి (Boyfriend) వివాహ వేడుకను ఆ ప్రియురాలు (Girl friend) అడ్డుకునేందుకు యత్నించింది. ప్రేమ (Love), పెళ్లి అని తన చుట్టూ తిరిగిన వ్యక్తి తనతో మాట మాత్రమైనా చెప్పకుండా మరో యువతితో పెళ్లి (Marring another girl) చేసుకుంటున్నాడని తెలిసి గొడవకు దిగింది. అయితే ఫంక్షన్ హాల్‌లోకి చొచ్చుకెళ్లిన ఆ యువతిని వరుడి బంధువులు (Bride Relatives) అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే ఆ యువతి (Girl friend) ఎంతకీ బయటికి వెళ్లకపోవడంతో అక్కడున్న బంధువులకు కోపం వచ్చింది. దీంతో ఆ యువతిని జుట్టు పట్టుకుని బలవంతంగా  బయటకు ఈడ్చుకొచ్చారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది.

    ప్రేమ పేరుతో దగ్గరై..

    బాధితురాలు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన శ్రీనాథ్, రజనీ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పేరుతో రజనీకి దగ్గరైన శ్రీనాథ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం (Physical Relationship) ఏర్పడింది. కొన్నాళ్లుగా రజనీ పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తుండటంతో శ్రీనాథ్ ఆమెకు కనిపించకుండా తిరుగుతున్నాడు.

    Hyderabad police: హైదరాబాద్​ పోలీసుల సంచలన నిర్ణయం.. ఇకపై డ్రంకెన్​ డ్రైవ్​ మాదిరిగానే ఆ టెస్టులు కూడా..

    అయితే ఖమ్మం బైపాస్ రోడ్డులోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం (ఏప్రిల్ 15) శ్రీనాథ్ మరో యువతితో పెళ్లి చేసుకుంటున్నట్లు రజనీకి తెలిసింది. దీంతో ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లిన రజనీ (Rajani) పెళ్లి ఆపేయాలని గొడవకు దిగింది. అక్కడే ఉన్న వరుడు శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, బంధువులైన కొంతమంది మహిళలు రజనీని జుట్టు పట్టుకుని బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లారు.

    దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు..

    అయితే తనను పెళ్లి (marriage) చేసుకుంటానని మాటిచ్చి శ్రీనాథ్ మోసం చేశాడని బాధితురాలు రజనీ వాపోయింది. తాను ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చి గొడవ చేస్తానని తెలిసి ముందు గానే పోలీసులకు(Police) చెప్పి ఉంచారని రజనీ ధ్వజమెత్తింది. వరుడి బంధువులు తనపై దాడి చేసినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారే తప్ప వారిని అడ్డుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Khammam, Love affair, Love cheating, Marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు