Home /News /khammam /

MLC Tension: టీఆర్ఎస్ లో అంతర్మథనం.. అంతా ఒకే.. అయినా ఎక్కడో డౌట్

MLC Tension: టీఆర్ఎస్ లో అంతర్మథనం.. అంతా ఒకే.. అయినా ఎక్కడో డౌట్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

TRS Tension: అంతా బాగానే ఉంది.. కచ్చితంగా గెలుపు తమదే అని ఇంటర్నల్ సర్వేలు చెబుతున్నాయి. నాయకులు మద్దతూ ఉంది.. కానీ ఎక్కడో ఎదో బెంగ అధిష్టానాన్ని వెంటాడుతోంది.. ఇంతకీ అసలు సమస్య ఏంటి..?

  జి. శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా..  MLC Tension In TRS:  మెజారిటీకి సరిపడా ఓటర్లు.. చేతిలో అధికారం.. పుష్కలంగా వనరులు.. కనుసైగతోనే పనిచేసుకుపోయే పార్టీ యంత్రాంగం.. ఎక్కడో అల్లంత దూరం తీసుకుపోయి మరీ గోవా (Goa)లో రోజుల తరబడి క్యాంపులు.. అయినా ఎక్కడో ఏదో తెలీని భయం..  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections) మరో ఇరవైనాలుగు గంటల సమయం మిగిలి ఉండగా టీఆర్ఎస్  నేతల్లో (TRS Leaders) నెలకొన్న అభద్రతాభావం ఇది.  ఖమ్మం జిల్లా (Khamma District)లోని పార్టీ సీనియర్ల మధ్య ఉన్న పొరపొచ్ఛాలు.. ఒకరి పై ఒకరికి గిట్టని పరిస్థితి.. వెరసి బలం ఉన్నా భయపడుతున్న దుస్థితిలో పడేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించిన టీఆర్ఎస్... ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు సాధించడానికి కేవలం గ్రూపు తగాదాలు.. వెన్నుపోట్లే కారణం అన్నది బహిరంగ రహస్యం.. అంతర్గత కుమ్ములాటల వల్లే మహామహులు అపజయం పాలయ్యారు.  మూడేళ్లయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు వచ్చిన దాఖలా లేదు. పైగా ఇంకా నేతల మధ్య దూరం పెరిగినట్లే పరిస్థితి ఉంది.  పైకి అంతా బాగాగే ఉందన్నట్టున్నా ఎక్కడో ఏదో తెలీని భయం ఇప్పటికీ గులాబీ నేతల్లో వ్యక్తమవుతునే ఉంది.

  స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ స్థానానికి  అధికార పార్టీ తరపున అనూహ్యంగా తాతా మధుసూదన్‌ (Tata Madhusudhan) తెరపైకి వచ్చారు. అప్పటిదాకా కనీసం చర్చ కూడా లేని తాతా మధు అభ్యర్థిత్వం ఖరారుకు రైతుబంధు రాష్ట్ర కన్వీనర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeswar Reddy) చొరవే కారణం అన్న ప్రచారం ఉంది. తన చిన్ననాటి స్నేహితుడు, ఉద్యమ సహచరుడు అయిన మధుసూదన్‌ అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్‌ (CM KCR)దగ్గర ప్రస్తావించి ఒప్పించడంలో పల్లా సక్సెస్‌ అయ్యారనే చెప్పవచ్చు.

  ఇదీ చదవండి : ఉదయం భార్య పిల్లలతో వీడియో కాల్.. ఇంతలో ఊహించని విషాదం.. చివరి మాటలు ఇవే

  జిల్లాలో పలువురు రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నప్పటికీ, ఉద్దండ పిండాలను తోసిరాజంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా టికెట్‌ను తాతా మధుసూదన్‌కు కేటాయించడం ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే. వాస్తవానికి పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించడంలో భాగంగానే ఇలా జరిగిందా.. లేదా కమ్మ సామాజికవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా వేసిన ఎత్తుగడా అన్నది కాలం నిర్ణయించాల్సిన విషయం.

  ఇదీ చదవండి : రేస్ పావురాలు గురించి ఎప్పుడైనా విన్నారా..? వాటి ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

  ఇప్పటికే తమ సిట్టింగ్‌ సీటును సైతం వాళ్లకే కేటాయించారంటూ రగిలిపోతున్న జిల్లాలోని బీసీ వర్గాలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మరోమారు తనకు అవకాశం ఇస్తారని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆశించినా.. ఒకవేళ బీసీ కోటాలో వేరేవారిని ఎంపిక చేయాల్సి వస్తే తనకు దక్కుతుందన్న ఆశతో గాయత్రి రవి, ఇంకా గతంలో ఖమ్మం నియోజకవర్గం నుంచి పార్టీ తరపున  పోటీ చేసిన ఆర్జేసీ కృష్ణ... ఇలా అనేక మంది ఈ కోటాలో ఆశించారు.

  ఇదీ చదవండి : ఐర్లాండ్ నుంచి వచ్చాడు కరోనా పాజిటివ్ అని తేలింది..? ఐసోలేషన్ లో ఉండమంటే.. ఇష్టం వచ్చినట్టు తిరిగాడు

  వీళ్లే కాకుండా సీనియర్‌ అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి అవకాశం ఇచ్చి, మంత్రిగా తీసుకుంటారని.. గత ఎన్నికల సమయంలో టికెట్‌ ఇవ్వలేకపోవడం వల్ల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగింది.

  ఇదీ చదవండి : రోడ్డుపై గర్భిణీ అవస్థలు.. చలించి పోయిన చిన్నారి.. ఏం చేసిందంటే..? వీడియోలో చూడండి

  జలగం వెంకటరావు అభ్యర్థిత్వం  సైతం పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నఫళంగా తాతా మధును పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీలోని దాదాపు అందరు ఆశ్చర్యపడ్డారు. ఏదో అనుకుంటే ఇదేంటి ఇలా అయ్యిందంటూ ఉలికిపాటును కప్పిపుచ్చుకుని మరీ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందేనంటూ నినాదాలు చేస్తున్నారు. కానీ నిజానికి అలా లేదన్న భయం అందరిలోనూ లోలోపల వెంటాడుతోంది.
  ఇదీ చదవండి : క్షమాపణ సరిపోదు.. వారం రోజుల పాటు ఆ పని చేయండి. ఖర్చులూ భరించాలి.. అధికారికి హైకోర్టు వింత శిక్ష

  కాంగ్రెస్‌ కు పెద్దగా ఓట్లు లేకపోయినా తాతా మధు సామాజికవర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావుకు  టికెట్‌ ఇచ్చింది. తెరాసలోని ఒకరిద్దరు ముఖ్యులు కాంగ్రెస్‌ అభ్యర్థికి దండిగానే వనరులు సమకూర్చినట్టు చెబుతున్నారు. గోవాలో ఏర్పాటు చేసిన క్యాంపులోనూ వివక్ష చూపారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సామాజికవర్గాన్ని బట్టి, స్థాయిని బట్టి ట్రీట్‌ చేశారన్న కారణంగా కొందరు ఓటర్లు హర్ట్‌ అయినట్టు చెబుతున్నారు. కొందరికి ఫ్లైట్‌లలోనూ, మరికొందరికి బస్సులలోనూ ప్రయాణ ఏర్పాట్లు చేయడం.. గోవాలో ఏర్పాటు చేసిన విడిదిలోనూ, విందు వినోదాల్లోనూ ముఖం చూసి పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  ఇదీ చదవండి : పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. ఏపీకి ఎంత విరాళం ఇచ్చారంటే?

  ఈ లెక్కలన్నీ  ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న బెంగ నేతల్లో కనిపిస్తోంది. దీనికితోడు ఇంతటి ఉద్దండులున్న ఖమ్మం జిల్లాలో ఎక్కడో నల్గొండకు చెందిన నాయకుడి నిర్ణయాలేంటన్న చర్చకూడా  నడుస్తోంది. మొత్తానికి ఇది ఎటు దారితీస్తుందోనన్న బెంగ కనిపిస్తోంది. ఇలా ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ పార్టీ అభ్యర్థి విజయానికి తామంతా సమష్టిగా కష్టిస్తున్నామని, తమ అభ్యర్థి విజయం నల్లేరుమీద నడకేనని రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెబుతున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు