Khammam:ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఫ్యామిలీ గొడవలో ఓ ఎస్ఐ తలదూర్చి సస్పెండ్ అయ్యాడు. ఓ కేసులో తనకు సపోర్ట్‌గా ఉండమని కోరితే మాటిచ్చిన ఎస్ఐ తిరిగి అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై కానిస్టేబుల్ డైరెక్ట్‌గా సీపీని కలిసి ఎస్ఐని సస్పెండ్ చేయించాడు.
(G.Srinivas Reddy,News18,Khammam)
అవినీతి, కక్కూర్తి ఒకసారి అలవాటు చేసుకుంటే త్వరగా వదిలిపెట్టవు. ఒకే డిపార్ట్మెంట్లో చేస్తున్న పైస్థాయి ఉద్యోగి తన కింద పనిచేస్తున్న కానిస్టేబుల్ చిన్న ఫేవర్ చేసిపెట్టమన్నాడు. చేస్తాలే అని మాటిచ్చినందుకు కానిస్టేబుల్(Constable)కృతజ్ఞతగా ఆ ఎస్సై వాడుకునే జీప్(Jeep)కి డీజిల్ (Diesel)కొట్టించాడు. ఫ్యామిలీ విషయం భార్యతో గొడవపడిన కానిస్టేబుల్‌కి మాటిచ్చిన ఎస్ఐ ఆమె తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశాడు. అంతే ఈ ఎఫెక్ట్ ఎస్సై(SI)పై తీవ్రప్రభావాన్ని చూపింది. ఏకంగా ఉద్యోగంలోంచి సస్పెండ్(Suspended)చేసే వరకు వెళ్లింది. ఖమ్మం (Khammam)జిల్లా హసన్‌పర్తి (Hassanparthi) పోలీస్ స్టేషన్లో ఈఘటన జరిగింది. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్(Police Department)లో పనిచేస్తున్నాడు. భార్యతో గొడవపడటంతో పంచాయితీ పోలీస్ స్టేషన్ (Police Station) వరకు వచ్చింది. అయితే కేసులో తనకు ఫేవర్ చేయమని కానిస్టేబుల్ ఎస్సై సాంబయ్యను ప్రాధేయపడ్డాడు. అందుకు ఎస్ఐ చేస్తానని మాటిచ్చాడు. వాళ్ల కేసు విషయంపై విచారణకు వెళ్లిన ఎస్సై వాహనానికి కానిస్టేబుల్ డీజిల్ కొట్టించాడు. సీన్ అంతటితో ఆగలేదు. కానిస్టేబుల్ భార్య ఎస్ఐపై ఒత్తిడి తెచ్చింది. తన భర్తపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టడంతో ఎస్సై సాంబయ్య కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశాడు. ఇక్కడే సీన్ రివర్స్ అయింది.
ఎస్ఐకి షాక్ ఇచ్చిన కానిస్టేబుల్..
భార్య మాటలు విని ఎస్ఐ తనపైనే కేసు పెట్టడాన్ని కానిస్టేబుల్ జీర్ణించుకోలేకపోయాడు. తనకు వచ్చిన కోపాన్ని ఎలా చల్లార్చుకోవాలో ఆలోచించి ఏకంగా ఎస్ఐ ఉద్యోగానికే ఎసరుపెట్టాలని చూశాడు. అందులో భాగంగానే సీపీని కలశాడు కానిస్టేబుల్. తనకు న్యాయం చేయమని ఎస్సై సాంబయ్యను కోరితే జీపులో డీజిల్ కొట్టించమని డిమాండ్ చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సీపీ తరుణ్‌జోషి విచారణ జరిపి నివేదిక ఆధారంగా ఎస్సై సాంబయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫేవర్ చేయలేదని రివేంజ్..
సాధారణంగా పోలీస్ స్టేషన్‌కి ఏదైనా కేసు నిమిత్తం వెళ్తే ..పోలీసులు వాళ్లు చిన్న చిన్న ఫైన్లు వేస్తారు. స్టేషన్లో అవసరమయ్యే పేపర్ బండిళ్లు, జీపులో డీజిల్‌కు వంటివి ఇండెంట్ పెట్టమని చెబుతూ ఉంటారు. అలవాటులో పొరపాటుగా హసన్‌పర్తి ఎస్ఐ సాంబయ్య కూడా కానిస్టేబుల్ విషయంలో అదే చేశాడు. తన జీపులో కానిస్టేబుల్ డబ్బుతో డీజిల్ కొట్టించడాన్ని అడ్డుపెట్టుకొని కక్ష తీర్చుకున్నాడు. భార్య భర్తల పంచాయితీ తనకు ఫేవర్ చేయమంటే తనపైనే కేసు పెట్టిన ఎస్ఐ సాంబయ్యకు గట్టి జలక్ ఇచ్చాడు.ఓ పోలీస్ ఫ్యామిలీ విషయంలో కూడా ఎస్ఐ కక్కూర్తి పడినందుకు తగిన శాస్తి జరిగిందని స్థానికులు అనుకుంటున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.