SEVEN ARRESTED FOR KILLING TRS COUNCILOR IN MAHABUBABAD SNR KMM
Mahabubabad: పగ, ప్రతీకారంతోనే టీఆర్ఎస్ కౌన్సిలర్ మర్డర్ ..హత్యలో మొత్తం ఏడుగురి హస్తం
(ప్రతీకారంతో హత్య)
Mahabubabad:మహబూబాబాద్‌లో అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్ని హతమార్చిన నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు వ్యక్తులు ఆర్ధిక, భూ లావాదేవీల్లో తేడా రావడంతో రవిని అడ్డుతొలగించుకునేందుకు హతమార్చినట్లుగా పోలీసులు ఎంక్వైరీలో తేల్చారు.
మహబూబాబాద్ (Mahabubabad)జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ (TRS councilor) బానోతు రవి (Banotu Ravi)ని హత్యలో మిస్టరీని చేధించారు పోలీసులు. అధికార పార్టీకి చెందిన నాయకుడ్ని పట్టపగలు, అత్యంత దారుణంగా నడిరోడ్డుపై సినిమా స్టైల్లో నరికి చంపిన వాళ్లలో ఏడుగుర్ని అరెస్ట్( Seven arrested)చేశారు. రవిని హతమార్చింది అతని అనుచరులు, సన్నిహితులేనని పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఆర్ధిక లావాదేవీలు, భూవ్యవహారాల్లో బానోతు రవి ఆధిపత్యం చెలాయించడంతో పాటుగా పక్కన తిప్పుకుంటూ నిందితులతో సొంత పనులు, ఆర్ధిక పరమైన లబ్ధి పొందినట్లుగా తేల్చారు. తమకు న్యాయం చేయకపోవడాన్ని భరించలేకే సన్నిహితులుగా ఉన్న ప్రత్యర్ధులుగా మారి హతమార్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన గొడ్డలి, కత్తులతో మూడ్రోజుల పాటు మర్డర్ స్కెచ్ వేసి ప్లాన్‌ని పక్కాగా అమలు చేసినట్లు పోలీసులు రాబట్టారు. ఈనెల 21వ తేది ఉదయం 11.30 గంటల సమయంలో బానోతు రవి పత్తిపాక వైపు బైక్‌పై వెళ్ళటం చూసిన ఏడుగురు నిందితుల్లో ఒకరైన ఆరుణ్ కారులో ఫాలో అవుతూ విజయ్‌కి సమాచారం ఇచ్చాడు. విజయ్ తన ట్రాక్టర్‌తో రవికి ఎదురుగా వచ్చి పత్తిపాకలోని మిలిటరీ శ్రీను ఇంటి దగ్గర ట్రాక్టర్‌తో బైక్‌ని డీకొట్టాడు. కౌన్సిలర్ రవి కిందపడిపోగానే అరుణ్, విజయ్ కత్తి, గొడ్డలి పట్టుకొని అతనిపై దాడి చేశారు. రెప్పపాటులోనే నరికి చంపారు. ఈకేసులో భూక్యా విజయ్ కుమార్(Bhukia Vijay Kumar),భూక్యా అరుణ్(Bhukia Arun),అజ్మీర బాలరాజు, గుగులోతు చింటు, కారపాటి సుమంత్, అజ్మీరకుమార్, గుగులోతు భావుసింగ్ అనే ఏడుగుర్ని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఎందుకు హతమార్చారంటే..
మృతుడు కౌన్సిలర్ బానోతు రవి గతంలో మంగలికాలనీలో ఉంటున్న సమయంలో భూక్యా విజయ్, భూక్యా అరుణ్‌తో సన్నిహిత్యంగా ఉండేవాడు. వాళ్లను తన బిజినెస్‌లకు వాడుకునేవాడు. రవి నిందితులను వాడుకోవడం తప్ప వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో సొంతగా వ్యాపారాలు మొదలుపెట్టారు. ఇదే వాళ్లకు, రవికి మధ్య కోల్డ్ వార్కి కారణమైంది. పలుమార్లు భూక్యా విజయ్ ట్రాక్టర్ని అధికారులు పట్టుకోవడం వెనుక కూడా విజయ్ హస్తముందని ..తన మేనమామకు చెందిన భూమి పట్టా కోసం కూడా కౌన్సిలర్ రవి డబ్బులు డిమాండ్ చేయడంతో పగ పెంచుకున్నారు. భూక్యా అరుణ్ కూడా నల్లబెల్లం తరలిస్తుండగా పోలీసులకు పట్టించి కేసులు పెట్టాడనే కోపం ఉంది. కౌన్సిలర్ రవి నుంచి వేరుపడి వ్యాపారాలు చేసుకుంటున్న తమను తన అధికారం ఉపయోగించి వేధిస్తున్నాడని భావించి అడ్డుతొలగించుకునేందుకు మర్డర్ స్కెచ్ వేశారు.
(ఒక హత్య ఏడుగురు నిందితులు)
మర్డర్‌కి మాస్టర్ స్కెచ్..
రవికి ఇద్దరితో పాటు వాళ్ల బంధువులు అజ్మీర బాలరాజుకు కూడా పగ ఉండటంతో అందరూ కలిసి మద్యం తాగుతూ కొద్దిరోజులుగా రవిని అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ వేశారు. అందుకోసం ఒక గొడ్డలి ,కత్తిని ప్రత్యేకించి తయారు చేయించారు. గొడ్డలికి అన్నీ వైపుల పదును ఉండేలా దాడి చేసిన తర్వాత బతికి బయటపడకుండా పదునుగా తయారు చేయించారు. దాన్ని ఇంట్లో దాచి పెట్టి టైమ్ కోసం ఎదురుచూశారు. మూడ్రోజుల తర్వాత రవి ఓ పెళ్లికి వెళ్తున్నాడని తెలుసుకొని అంతకు ముందు రోజే టౌన్‌కి చెందిన ఓ వ్యక్తి దగ్గర కారును మూడ్రోజులకు కిరాయి తీసుకున్నారు. అందులో తిరుగుతూనే రవి సింగిల్‌గా ఎక్కడ దొరుకుతాడోనని గాలించారు.
మూడ్రోజులుగా రెక్కీ..
ప్లాన్ ప్రకారమే 21వ తేది నాడు రవి పెళ్లికి హాజరై వస్తుండగా అటాక్ చేశారు. సినిమా స్టైల్లో ట్రాక్టర్‌తో ఢీకొట్టి గొడ్డలి, కత్తితో పొడిచారు. కౌన్సిలర్ రవిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు పోయేంతగా దాడి చేశారు. హత్య అనంతరం నిందితులు విజయ్, అరుణ్ పారిపోయే క్రమంలోనే గుగులోతు రావుసింగ్కి హత్య చేసిన విషయం చెప్పి ట్రాక్టర్ని స్పాట్ నుంచి తరలించాలని కోరారు. అదే టైమ్‌లో భావుసింగ్ విజయ్ కి సహాయం చేశాడు. అంతా ఓ యాక్షన్ , క్రైమ్ స్టోరీ సినిమాని తలపించేలా ప్లాన్ చేసి కౌన్సిలర్ బానోతు రవిని హత్యచేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలితో పాటు కారు, ట్రాక్టర్, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.