Home /News /khammam /

RETIRED GOVERNMENT EMPLOYEE SERVING ORPHANS AND THE NEEDY PEOPLE IN KHAMMAM DISTRICT SNR KMM

Great Humanity: అభాగ్యులు,అనాధ శవాలకు ఆయనే ఆత్మబంధువు..ఆ పెద్దాయన గురించి తెలిస్తే ..

(అందరి బంధువు)

(అందరి బంధువు)

Great Humanity:ఆయన వయసు ఆరు పదులు దాటినప్పటికి సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన మారలేదు. అభాగ్యులు, అనాధలు, నిరాధరణకు గురైన వాళ్లను చేరదీయడంతో పాటు..అనాధ శవాలకు సైతం తానే అంత్యక్రియలు నిర్వహిస్తూ అందరికి ఆత్మబంధువుగా మారారు. ఇంతకీ ఆయన ఎక్కడున్నారో తెలుసా.

ఇంకా చదవండి ...
  (G.Srinivas Reddy,News18,Khammam)
  భద్రాచలం(Bhadrachalam)టౌన్‌లో పదేళ్ల క్రితం ఓ నడి వయస్సు కలిగిన మహిళ మతిస్థిమితం లేకుండా నిత్యం రోడ్‌ డివైడర్‌ పైన కూర్చుని ఉండేది. రోడ్డుపై దొరికింది, ఎవరైనా ఇచ్చింది తింటూ ఉండేది. చేతిలో పెద్ద కర్ర పట్టుకుని, దొరికింది తింటూ, ఎవరైనా తన వద్దకు వస్తే కళ్లెర్ర చేస్తూ ఉండేది. మాచిపోయిన దుస్తులు, చింపిరి జుట్టుతో ఓ పిచ్చిదానిలా తిరుగుతూ ఉండేది. రోడ్లపై తింటానికి ఏమీ దొరకని సమయంలో జనాన్ని తిడుతూ ఉండేది. ఆమె మానసిక పరిస్థితిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక సీఐ అన్నం శ్రీనివాసరావు (Annam Srinivasa Rao)అనే వ్యక్తికి అప్పగించారు. ఆమెను ఖమ్మం(Khammam)తీసుకొచ్చి జుట్టు కత్తిరించి.. శుభ్రమైన దుస్తులు ఇచ్చి..ఆమెను మాములు మనిషిగా మార్చారు. ఈక్రమంలోనే ఆమె వివరాలు తెలుసుకొని ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని సొంత గ్రామానకి పంపారు. ఇదంతా రెండేళ్ల క్రితం జరిగిన వార్త. ప్రస్తుతం ఆ మహిళ తిరిగి తన కుటుంంబానికి దగ్గరైంది.

  అనాధల పాలిట ఆత్మబంధువు..
  కొత్తగూడెంలోనే కాదు ఖమ్మం శివారు ప్రాంతంలో ఓ కుటుంబం ఆర్థిక భారంతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ముక్కలైన మృతదేహాలను ముట్టుకునేందుకు కూడా పోలీసులు సాహసించలేదు. ఆ సమయంలో అన్నం శ్రీనివాసరావు అన్నీ తానై మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం వంటి ఫార్మాలిటీ పూర్తి చేయించారు. అటుపై మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఇలా దిక్కు, మొక్కులేని వాళ్లే కాదు...కరోనా కష్టకాలం అయిన వాళ్లే దగ్గరకు చేరుకొని ఎన్నో మృతదేహాలను ఆయన స్వయంగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

  (ఆత్మబంధువు)


  అందరివాడు అన్నం శ్రీనివాసరావు..
  ఒక్కమాటలో చెప్పాలంటే అన్నం శ్రీనివాస్‌ ఓ వ్యక్తి కాదు అనాధల పాలిట ఆత్మబంధువుగా పేరు తెచ్చుకున్నారు. 64 ఏళ్ల వయసులో ఇప్పటికి సమాజం కోసం పరిశ్రమిస్తున్నారు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు. తన నిస్వార్ధమైన సమాజ సేవతో జనంలో కనుమరుగైపోతున్న మానవత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నారు.

  (అందరివాడు)
  (అందరివాడు)


  దిక్కులేని వాళ్లకు దిక్సూచి..
  నిరాదరణకు గురైన వాళ్లు, సమాజంలో అనాధలుగా మిగిలిపోయిన వాళ్లు, మానసిక స్థితి సరిగా లేనివాళ్లు ఇలా నిర్భాగ్యులు, అభాగ్యులకు అన్నీ తానైపోయారు అన్నం శ్రీనివాసరావు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించాల్సిన సమాజం అభినందించకపోగా..అవమానపరిచిన సందర్భాలు అనేక ఉన్నాయి. సమాజం తన చుట్టూ ఉన్న వాళ్ల విమర్శలు, చీత్కారాలను లెక్క చేయకుండా తన సేవామార్గాన్ని విస్తరిస్తూ మందుకెళ్తున్నారు. అన్నం శ్రీనివాసరావు చేస్తున్న సేవలకు గుర్తింపుగా జిల్లా ఉన్నతాధికారులు ఆయన ఆశ్రమానికి ఓ భవనాన్ని సైతం అందించారు. ఇప్పుడా భవనంలో ఉన్న మూడొందల మందికి పైగా అనాధలకు మూడు పూటలా ఆరోగ్యకరమైన భోజనం, మంచి బట్టలు, ఇంకా అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు. అన్నం శ్రీనివాసరావు చేస్తున్న సేవలకు ఆకర్షితుడైన కొడుకు అమరేశ్వరరావు విప్రో సంస్థలోని తన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకోని మరీ వచ్చి తండ్రికి ఆసరాగా నిలిచారు.

  వేటిని లెక్కచేయకుండా..
  విమర్శలు, ఆరోపణలు, చీత్కారాలు, చీదరింపులు పక్కన పెడితే తోటి మనిషికి సాయం చేయాలన్న తన ప్రయత్నంలో ఎందరో మహానుభావులు అండగా నిలిచారి చెబుతారు అన్నం శ్రీనివాసరావు. బీఎస్‌ఎన్ఎల్‌లో సుదీర్ఘకాలం ఉద్యోగం చేసిన డాక్టర్‌ అన్నం శ్రీనివాసరావు మూడు వందల మంది నిరాధరణ కోల్పోయిన వారికి భోజనం, వసతి, దుస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పెద్దాయన చేస్తున్న సేవలను కాశ్మీర్‌కు చెందిన గ్లోబల్‌ పీస్‌ మిషన్‌ 2021కిగానూ గ్లోబల్‌ శాంతి సమ్మాన్‌ అవార్డుతో సత్కరించింది. శ్రీనగర్‌లో ఈ అవార్డును అందించింది. ఈ అవార్డు తన ఒక్కరికే కాదు..తనను నిత్యం వెన్నంటి ప్రోత్సహిస్తున్న భార్య, కుమారుడితో పాటు స్నేహితులకు చెందుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రదేశంలో కుళ్లిన, దిక్కులేని మృతదేహాలు ఉన్నా..అన్నం శ్రీనివాసరావు ఆశ్రమానికి ఫోన్ చేస్తారు. అయిన వాళ్లు చనిపోతేనే చూడటానికి వెళ్లలేని ఈ రోజుల్లో అన్నం శ్రీనివాసరావు అందరికి ఆత్మబంధువుగా మారి ఖమ్మం జిల్లాతో పాటు నగరానికి సేవల ద్వారా గుర్తింపు తేవడాన్ని స్థానికులు హర్షిస్తున్నారు. ఆయన్ని అభినందిస్తున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, VIRAL NEWS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు