Home /News /khammam /

PALERU MLA IS TRAINING FOR FREE BY STARTING A COACHING CENTER FOR CANDIDATES TO PREPARE FOR GOVERNMENT JOBS KMM PRV

Free Coaching: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. పోటీ పరీక్షలకు ఆ జిల్లాలో ఉచితంగా కోచింగ్​.. ఫుడ్​ కూడా..

కోచింగ్​ సెంటర్​లో అభ్యర్థులు

కోచింగ్​ సెంటర్​లో అభ్యర్థులు

కోచింగ్‌ తీసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు. వెంటాడుతున్న పేదరికం.. వందల పోస్టుల కోసం లక్షలాది మంది పోటీ పడుతున్న ప్రపంచంలో ఉద్యోగం కష్టమే. అలాంటి వారి కోసం ఒక ప్రజా ప్రతినిధి ఉచితంగా కోచింగ్​ ఇస్తున్నారు.

    (G. Srinivas Reddy, News18, Khammam)

    గ్యాడ్యుయేషన్‌.. పోస్ట్‌ గ్యాడ్యుయేషన్‌ అయిపోతూనే ఉద్యోగం (Jobs) వేటలో పడిన యువతకు అంతా గందరగోళం.. ఏం చదవాలి?. ఎలా చదవాలి.? కోచింగ్‌ తీసుకోకపోతే ఉద్యోగం సాధించలేమేమోనన్న శంక.. బెంగ పట్టుకు పీడిస్తుంటాయి. హైదరాబాద్‌ దాకా వెళ్లి కోచింగ్‌ తీసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు. వెంటాడుతున్న పేదరికం.. వందల పోస్టుల కోసం లక్షలాది మంది పోటీ పడుతున్న ప్రపంచంలో ఉద్యోగం సాధించడం ఎలా..? దీనికి సమాధానంగానే ఒక ప్రజా ప్రతినిధి మొత్తం ఏర్పాట్లు చేశారు. వందలాది మంది ఉద్యోగార్ధులను ఈ కష్టం నుంచి బయటపడేసేందుకు  పాలేరు (Paleru MLA) ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి నడుం కట్టారు. వరుసగా వస్తున్న నోటిఫికేషన్లు గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉచితంగా చేశారు. గత రెండున్నర నెలలుగా కూసుమంచి (Kusumanchi) మండలం జీళ్లచెరువు సమీపంలో సాగుతున్న ఈ శిక్షణా కేంద్రం (Training Institute) ఎందరో నిరుద్యోగుల ఆశలకు వేదికైంది.

    పన్నెండేళ్ల అనంతరం ప్రకటించిన గ్రూప్‌-1, ఇంకా ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లకు (Jobs Notifications) నిరుద్యోగుల నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వీరి శిక్షణ కోసం వీలైనన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి చొరవ తీసుకున్నారు.

    కోచింగ్​ సెంటర్​ బ్యానర్​


    పూర్తిగా వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ దాకా వెళ్లి కోచింగ్‌ తీసుకోవాలంటే ఖర్చును భరించలేక ఏ నిరుద్యోగి నిరాశ పడరాదన్న లక్ష్యంతో అందరికీ ఉచితంగా శిక్షణ (Free coaching) ఏర్పాట్లు చేశారు. ప్రతిభ ఉన్న వారిని కొద్దిగా సరైన దారిలో పెట్టి సానపడితే పోటీలో ముందుంటారన్న ఆలోచనతో వారికోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు.



    దాదాపు వెయ్యి మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు ఈ కోచింగ్‌ సెంటర్‌లో తమ భవిష్యత్‌ కోసం కష్టపడుతున్నారు. ఎంతమంది వచ్చినా కూర్చోడానికి అనువుగా ఇక్కడ ఉన్న జిన్నింగ్‌ మిల్‌లో ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే. సీటింగ్‌, నోట్స్‌ రాసుకోడానికి అనువుగా గ్రీన్‌బోర్డ్‌, వాయిస్‌ అందరికీ వినిపించేలా ఆడియో సిస్టమ్స్‌, ఫ్యాకల్టీ మెంబర్స్‌ ఉండటఆనికి ఏసీ వసతి, భోజనం ఏర్పాట్లు, అభ్యర్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందుబాటులో ఉంచుతున్నారు.

    ఏ ఎగ్జామ్‌కు ఎలా ప్రిపేర్‌ కావాలి..? ఏం చదవాలి..? ఎలా చదవాలి.. అనే దానిపై లోతుగా అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌ బేస్డ్‌గా ఉన్న సీనియర్‌ ఫ్యాకల్టీలను రప్పించి మరీ కోచింగ్‌ ఇస్తున్నారు. వచ్చే ఏడాది కాలానికి సరిపోయినన్ని నోటిఫికేషన్లు వచ్చేసరికి.. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎక్కువ మంది ఉద్యోగాలు పొందేలా అన్ని విధాలా శిక్షణ ఇస్తున్నట్టు ఫ్యాకల్టీ మెంబర్లు చెబుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Free coaching, Jobs in telangana, Khammam

    తదుపరి వార్తలు