ఖమ్మం (Khammam)లోని బీజేపీ కార్యకర్త అయిన సాయి గణేష్ ఆత్మహత్య (sai ganesh suicide) చేసుకోవడం రాష్ట్రంలో పెను దుమారం రేపింది. అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధించడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విపక్షాలు మండిపడ్డాయి. తన చావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay kumar), పోలీసులే కారణమంటూ చనిపోయే ముందు సాయి గణేష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వ్యవహారం ఇటు అజయ్ కుమార్‌నే కాకుండా టీఆర్ఎస్ని కూడా ఇరుకున పెట్టింది. ఘటనను సీరియస్‌గా పరిగణించిన హైకోర్టు మంత్రి పువ్వాడకు నోటీసులు సైతం జారీ చేసింది. మరోవైపు సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు ఆందోళనలు కూడా చేశాయి. తనను పదవి నుంచి తప్పించే కుట్ర జరుగుతోందంటూ పువ్వాడ మండిపడ్డారు. ఈ వివాదం సమిసిపోకముందే తాజాగా మంత్రి అజయ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు (embroiled in another controversy ). విద్యార్థులను బెదిరించి వారికొచ్చే స్టైఫండ్ లాక్కుంటున్నారంటూ కవిత అనే దళిత మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన మమత మెడికల్ కాలేజీ (Mamatha Medical College) యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందంటూ వారు ఆరోపిస్తున్నారు.
స్కాలర్షిప్ డబ్బులు తీసుకుంటున్నారని..
వివరాల్లోకి వెళితే.. మమత మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యం పీజీ విద్యార్థుల స్టైఫండ్ (PG Student Stipend) నొక్కేస్తోందని దళిత (Dalit) సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల చేత విత్ డ్రాయల్ ఫామ్‌లపై సంతకాలు తీసుకుని వారి డబ్బులు తీసుకుంటున్నారని కవిత (kavita) అనే దళిత మహిళ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ డబ్బులు (Scholarship money) తిరిగి ఇవ్వకపోతే ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు (National SC Commission) ఫిర్యాదు చేసినట్లు కవిత పేర్కొన్నారు. దళితుల నోటికాడ కూడు లాక్కుంటున్న అజయ్ కుమార్ మంత్రి పదవి ఊడగొడతామని ఆమె హెచ్చరించారు.
విద్యార్థుల ఖాతాల్లోకి వేయకుండా..
షెడ్యూల్డ్ కులం (Scheduled caste) వారు చదువుకోవద్దా అని ఈ సందర్భంగా దళిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి వేయకుండా తెలంగాణ ప్రభుత్వం కాలేజీల అకౌంట్లోకి వేస్తున్నారని ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తామని, నీ మంత్రి సీటు పోయే వరకు ఆందోళన చేస్తామని అజయ్ కుమార్‌ను సదరు మహిళ హెచ్చరించారు.
అయితే ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో మంత్రి గారి సానుభూతిపరులు సోషల్ మీడియాలో ఓ సందేశం ట్రెండింగ్‌గా మార్చారు. పువ్వాడపై కేసు వేసిన దళిత మహిళపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఏముందటే..?
‘‘ఎక్కడి దళితురాలివి అక్క .. ఫిర్యాదు చేస్తే చెయ్ ..
మళ్లీ అజయ్ కుమార్ పేరెందుకు మధ్యలో ..
తెలంగాణ మరియు భారతదేశ మెడికల్ కాలేజిలన్ని కూడా అజయ్ కుమార్ కు చెందినవేన అక్క ..
సదువుకున్నవ అక్క ..
మనువాదుల పార్టీ అన్నావు .. ఇప్పుడు నిన్ను ఆడిస్తున్నది అచ్చమైన మతోన్మాద , కులోన్మాద పార్టీ కాదా అక్క..
హత్రస్ లో దళిత యువతిని రేప్ చేసి , అర్థరాత్రి అంత్యక్రియలు చేస్తే నిన్ను ఆడిస్తున్న మతోన్మాద మనువాదులను ఏమని ప్రశ్నించినావు దళితక్క ..
మొన్న గుజరాత్ లో దళిత యంఎల్ఎ జిగ్నేష్ మెవానిని అరెస్ట్ చేస్తే నిన్ను ఆడిస్తున్న మతోన్మాద , మనువాదులను ఏమని నిలదీసావక్క ..
ఆంధ్ర ప్రదేశ్ లో దళితుల పై ప్రతి రోజు దాడులు , హత్యలు జరుగుతుంటే ఎన్ని దండోరా ధర్నాలు చేసావక్క..
రాజస్థాన్ లో దళిత యువకుడిని అగ్ర కులస్థుల అమ్మాయిని ప్రేమించాడని చితకబాదిన మనువాద & మతోన్మాదులు చంపితే ఏ సెంటర్ లో ఆందోళన చేసావక్క ..
అయోధ్య భూమి పూజ కు దళిత బిడ్డ దేశ రాష్ట్ర పతిని ఆహ్వానించకపోతే నిన్ను ఆడిస్తున్న , పాడిస్తున్న మనువాద , మతోన్మాదులకు వ్యతిరేకంగా ఎన్ని దీక్షలు చేసావక్క..
మహారాష్ట్ర లో అంబేద్కర్ స్టిక్కర్ బైక్ పై అతికించారని చావు అంచులు చూసే విధంగా దాడి చేసిన మనువాద , మతోన్మాదులకు శిక్ష పడేలా ఎక్కడ ఆమరణదీక్ష చేపట్టావక్క ..
గొడ్డు మాంసం తినే లంజకొడుకులు అని మతోన్మాద , మనువాది సారాసింగ్ బహిరంగంగా తిట్టినప్పుడు ఏ మతోన్మాద , మనువాదుల కార్యాలయం ముట్టడి చేసావక్క ..
కాన్పూరు దేహాత్ ( యూపి ) లో దళితులను బట్టలు విప్పి కొట్టిన మతోన్మాద ,మనువాదులకు వ్యతిరేకంగా ఎన్ని ధర్నాలు చేసావక్క..
చందౌలి ( యూపి ) లో దళితుల గుడిసెలు తగలపెట్టినప్పుడు మతోన్మాద , మనువాదులకు వ్యతిరేకంగా ఎన్ని రాస్తారోకోలు చేసావక్క..
ఆజమ్ ఘర్ ( యూపి ) లో దశితుల ఇండ్లను కూల్చిన మతోన్మాద , మనువాదులకు వ్యతిరేకంగా ఎన్ని జాతీయ రహాదారులు బంద్ చేసావక్క…
ఢోల్ పూర్ ( రాజస్థాన్ ) లో భర్త , పిల్లల ముందు గ్యాంగ్ రేప్ చేస్తే మతోన్మాద , మనువాదులకు వ్యతిరేకంగా ఎక్కడ మౌన దీక్ష చేసావక్క ..
బరైన ( యూపి ) లో దళితులు ప్రశ్నిస్తున్నారని .. అక్కడి మతోన్మాద , మనువాద యంఎల్ఎ చిల్లిగవ్వ నిధులు కేటాయించకుండా ఊరిని వెలివేస్తే ఎన్ని నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నావక్క ..
అక్క ఇవి మచ్చుకే అక్క ..
మీరు చేయాల్సిన మనువాద & మతోన్మాద పోరాటాలు డిల్లీ కేంద్రంగా మొదలు పెట్టండక్క..
మా మద్దతు కూడా ఉంటుంది.
జై తెలంగాణ ✊
జై కేసిఆర్ ✊’’
ఈ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Puvvada Ajay Kumar, Scholarships, Social Media, Trs