MINISTER KTR AND MP KAVITHA VISITED THE HOUSE OF TELANGANA TRIBAL AND WOMEN AND CHILD WELFARE MINISTER SATYAVATHI RATHORE AND VISITED HER KMM PRV
Mahabubabad: టీఆర్ఎస్ మహిళా మంత్రి ఇంటికి వెళ్లిన కేటీఆర్, కవిత, ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం.. ఆ కార్యక్రమానికి హాజరు
మంత్రిని పరామర్శిస్తున్న కేటీఆర్
తెలంగాణ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ (85) పది రోజుల క్రితం (17.02.2022) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. నేడు లింగ్యానాయక్కు పెద్ద కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
తెలంగాణ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ (85) పది రోజుల క్రితం (17.02.2022) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. నేడు లింగ్యానాయక్కు పెద్ద కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో మంత్రులు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గారు, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీలు మాలోతు కవిత తదితరులు సత్యవతి ఇంటికి వెళ్లారు. మంత్రిని, స్వర్గీయ లింగ్యా నాయక్ గారి సతీమణి దష్మి గారిని , పుత్రుడు కిషన్ నాయక్ గారిని పరామర్శించి, వారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
పసునూరి దయాకర్, పూర్వ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, హరిప్రియ నాయక్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.
లింగ్యానాయక్ గురించి చూస్తే..
కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్దతండా.. కాలిబాట కూడా సరిగాలేని గిరిజనతండా.. ఆ..తండాలో నివాసం ఉండే గుగులోత్ లింగ్యా నాయక్, దస్మి దంపతులు చూడ ముచ్చటయిన జంట.. వ్యవసాయం పైన ఆధారపడి జీవించేవారు.. వారికి కిషన్ నాయక్, లక్ష్మీ బాయి, కాంతిబాయి, శారదా బాయి, సత్యవతి రాథోడ్ లు ఐదుగురు సంతానం. ఐదుగురు పిల్లలను ఆప్యాయంగా పెంచారు.
ఆడపిల్లలను కూడా ఆ రోజుల్లోనే బడికి పంపించారు. వివాహాలు చేసి తమ బాద్యతలు తీర్చుకున్నారు.. తమ పిల్లలు అందరిలో ఒక్కరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని. పదిమందికి సహాయం చేసే స్థితికి చేరుకోవాలని ఆ..తల్లిదండ్రుల కలలుగనే వారు. పిల్లలకు ఆ విషయాన్ని పదే..పదే చెప్పేవారు.. తల్లిదండ్రుల ఆలోచనల ప్రభావం వారి సంతానాన్ని ప్రభావితం చేసింది.. కిషన్ నాయక్ వ్యవసాయం చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాడు.. గుండ్రాతి మడుగు ఉపసర్పంచ్ గా.. సర్పంచ్ గా పదవులు నిర్వహించారు.
కూతురు సత్యవతి రాథోడ్ దైర్యంగా రాజకీయాల్లోకి అడుగువేసి ప్రతికూల పరిస్థితులను చిరునవ్వుతో దాటుకుంటూ రాష్ట్రస్థాయిలో ఖ్యాతి సాధించారు. సర్పంచ్ గా.. జెడ్పీటీసీగా.. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా. అనేక విజయాలు అలవోకగా సాదిస్తూ ప్రస్తుతం రాష్ట్రమంత్రిగా ఉన్నారు. మరో కూతురుబిడ్డ వీరి మనవరాలు ఆంగోతు.బిందు మహబూబాబాద్ తొలి జిల్లాపరిషత్ చైర్మైన్ గా ప్రస్తుతం కొనసాగుతు చరిత్ర తన స్వంతం చేసుకున్నారు.. మనువడు గుగులోత్.శ్రీరాంనాయక్ సతీమణి వనజ పెద్దతండ తొలిసర్పంచ్ గా ఉన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.