MERCHANTS GIVING TRENDY NAMES TO BUSINESSES IN KHAMMAM SNR KMM
Telangana:ఖమ్మంలో బిజినెస్‌లకు కొత్త పేర్లు..నయా ట్రెండ్ సెట్ చేస్తున్న వ్యాపారస్తులు
(పేరుతోనే పబ్లిసిటీ)
Khammam:పేరులోనే పవర్ ఉంటుంది. పేరుతోనే పాపులారిటీ వస్తుంది. ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవుతున్నారు ఖమ్మంలోని వ్యాపారస్తులు. జిల్లా కేంద్రంలో పెడుతున్న కొత్త వ్యాపారాలకు ట్రెండీ నేమ్స్ పెడుతూ నయా బిజినెస్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
(G.SrinivasReddy,News18,Khammam)
చిట్టి గారె కోడికూర, ఐస్‌క్యూబ్స్(Ice cubes)లిక్విడ్(Liquid), డ్రాప్స్(Drops)కలర్స్(Colors)ఇవన్నీ ఇప మనం చూస్తున్న బ్రాండ్ నేమ్స్. పెద్ద సిటీలకే పరిమితమైన ఈ తరహా క్రిస్పీCrispy.. ఫ్యాన్సీ(Fancy)పేర్లు ఇప్పుడు జిల్లా కేంద్రాలకు సైతం పాకిపోతున్నాయి. వినియోగదారుల దృష్టిని ఇట్టే మళ్లించడానికి.. వారి అటెన్షన్‌ను పట్టుకోడానికి వ్యాపారులు తాము పెడుతున్న షాపులకు ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు. ఖమ్మం(Khammam)నగరంలో పేరుతో వ్యాపారానికి సంబంధం లేకపోయినా..కష్టమర్లను తమవైపు తిప్పుకోవడం, వాళ్ల నోట్లో తమ షాపు పేరు గుర్తుండిపోయేలా చిన్న బిజినెస్ టెక్నిక్(Business Technique)తో దూసుకుపోతున్నారు. గతంలో దేవుడి పేర్లను వ్యాపారాలకు పెట్టుకుంటే కలిసొస్తుందనే సెంటిమెంట్ ఉండేది. అలాగే చేసే వాళ్లు. ఆ తర్వాత ఇంటి పేర్లను తాము చేస్తున్న బిజినెస్ సెంటర్స్(Business Centers)కి పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్(Trend)ని మార్చేసారు కొత్తతరం వ్యాపారులు.
పేరుతోనే పబ్లిసిటీ..
వ్యాపారాల్లో పోటీ తత్వం బాగా పెరిగిపోవడంతో కస్టమర్లను ఇట్టే ఆకట్టుకోవడానికి..షాపు పేరు ఈజీగా గుర్తుండే విధంగా వాడుక పదాలు, చూడగానే ఆకట్టుకునే విధంగా వాక్యాలనే తమ వ్యాపారాలకు పేర్లుగా పెట్టుకుంటూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు ఖమ్మం పట్టణంలోని చాలా మంది వ్యాపారాలు. ఇప్పటిదాకా తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌కే పరిమితమైన క్రిప్సీ నేమ్స్, ట్రెండీ టైటిల్స్ ఖమ్మంలో బాగా వాడకంలోకి వచ్చాయి. 'ఊకో కాకా..' ఇంగ్లీషు అక్షరాల్లో ఉండే ఈ పేరు ఇప్పుడు ఖమ్మంలో చర్చనీయాంశమైంది. అసలేంది ఈ దుకాణం. ఇక్కడ ఏం అమ్ముతారు అనేదానితో నిమిత్తం లేకుండా ఒక్క పేరుతోనే అందరినీ తన వైపునకు తిప్పుకోగలిగారు ఈ దుకాణదారులు. నిజానికి ఇది ఓ బట్టల దుకాణం. బ్రాండెడ్ పైగా. కానీ పేరు మాత్రం మన తెలుగు లోగిళ్లలో.. రచ్చబండలో సాధారణంగా ఉపయోగించే పేరు. బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ రాహుల్సిప్లిగంజ్ పాడే పాటల్లోని ఓ చిన్న ముక్కను తీస్కుని దాన్ని ఓ బ్రాండ్‌గా మార్చారు ఈ వ్యాపారులు.
ట్రెండ్‌కి తగ్గట్లుగా..
మెన్స్ డిజైనర్‌గా పేరున్న శ్రీకాంత్ తన బ్రాండ్‌కు ఊకో కాకా అన్న పేరుతో పాపులర్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో 25, ఏపీలో 5 షోరూంలను ఈ పేరుతో ఓపెన్ చేసి దూసుకుపోతున్నారు. నిజానికి ఊకో కాకా పేరుకి.. అక్కడ విక్రయించే వస్తువుకు ఎలాంటి సంబంధం లేకపోయినా పేరుతోనే బిజినెస్ బాగా పాపులర్ అవుతోంది. ఇదే కాదు 'లెగ్ పీస్' పేరుతో ఓ చికెన్ షాపు నెలకోల్పారు. ఇదే అంతే ఇది నాన్ వెజ్ రెస్టారెంటో, లేక చికెన్ షాపో అర్ధం కాకపోయినా..జనానికి టైటిల్ కొత్తగా ఉండటంతో షాపుకు క్యూ కడుతున్నారు.
నయా బిజినెస్ ట్రిక్స్..
గోదావరి, సుబ్బయ్య గారి హోటల్ వంటి పేర్లతో రెస్టారెంట్లు దూసుకుపోతున్నాయి. అలాగే వైన్స్ షాపలకైతే ఇంకాస్త ముందుకెళ్లి లాస్ట్డ్రాప్స్, డ్రాప్స్, లిక్విడ్ బార్ అంటూ ఇంట్రెస్టింగ్ పేర్లు పెట్టి చూడగానే ఇదేదో బాగుందే అన్నట్లుగా తమ బిజినెస్‌కి పబ్లిసిటీగా మార్చుకుంటున్నారు. నిర్మాణ రంగంలో ఉన్న ఓ సంస్థ తాము నిర్మించే అపార్ట్మెంట్లకు ఫైవ్ ఎలిమెంట్స్ అన్న పేరుతో రాణిస్తోంది. ఖమ్మంలో దశాబ్దాలుగా పాపులర్ అయిన ఓ రెస్టారెంట్ అప్పట్లోనే స్థానికంగా పక్కనే ఉన్న ఖానాపురం హవేలి పేరులోని హవేలి పేరిట రెస్టారెంట్ స్థాపించి ఈ రంగంలో ఇప్పటికీ లీడర్‌గా ఉన్నారు
ప్రతి వ్యాపారి అదే రూట్లో..
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ..వ్యాపారాలు హోటళ్లు, రెస్టారెంట్స్, వైన్సే కాదు చివరకు హాస్పిటల్స్ పేర్లను కూడా ఇదే స్టైల్లో పెట్టి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. శ్రీరక్ష, బిలీఫ్, అభయ పేర్లతో వైరా రోడ్డులోని ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ జనంలోకి వెళ్లిపోయాయి. పేరుతో ఆకర్షించినంత మాత్రాన క్వాలిటీ, గ్యారెంటీ లేకపోతే కష్టమర్లు మరోసారి షాపు వైపు తిరిగి చూడరనే విషయం తెలిసినప్పటికి ఒక్కసారైనా తమ షాపుని విజిట్ చేస్తారనే నమ్మకం.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.