హోమ్ /వార్తలు /khammam /

Godavari floods: గోదావరి వరదలపై మావోయిస్టుల లేఖ.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై ఆరోపణలు..

Godavari floods: గోదావరి వరదలపై మావోయిస్టుల లేఖ.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై ఆరోపణలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ నష్గం వాటిల్లింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు రెండు ప్రభుత్వాలకు లేఖ విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G. Srinivas reddy, News18, Khammam)

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు (Heavy rains) భారీ నష్గం వాటిల్లింది.  ముఖ్యంగా తెలంగాణలోని నిర్మల్, బైంసా, మంచిర్యాల, మంథని, రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు నీట మునిగి ఆయా ప్రాంతాలు అస్తవ్యస్తమయ్యాయి. రోడ్లు, భవనాలు, విద్యుత్ స్థంభాలు నెలకొరిగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల  (Godavari Floods) వల్ల తెలంగాణ (Telangana)లో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వరద (Godavari Floods) నష్టాలపై కేంద్రానికి నివేదిక కూడా అందించింది. తక్షణమే రూ. 1000 కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీ రాజ్ శాఖలో రూ.449 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రూ.33 కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రూ.379 కోట్లు విద్యుత్ శాఖలో రూ. 7 కోట్ల నష్టం వాటిల్లింది. ఏపీలోని గోదావరి పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. భద్రాచలం కింద వున్న విలీన గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ సీఎంలు ఏరియల్ సర్వేల ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వాలు విఫలం అయ్యాయని..

భారీవర్షాలు, గోదావరి వరదల ( (Godavari Floods) )వల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావం వల్ల ఇళ్ళను కోల్పోయారు.  ఈ నేపథ్యంలో మావోయిస్టులు (Maoist) రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ (Letter) విడుదల చేశారు. భద్రాద్రి కొత్త గూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని లేఖలో ఆరోపించింది. పునరావాస కేంద్రాల్లో బాధితులు ఆకలితో అలమటిస్తున్నారని, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు సుమారు 500 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయని లేఖలో పేర్కొంది. ఇరు రాష్ట్రాల్లో గోదావరి వరదల నుంచి శాశ్వత రక్షణ కోసం లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. బీకే-ఏ.ఎస్.ఆర్. కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు.

ఇదిలా వుంటే.. వరద నష్టంపై అధ్యయనానికి కేంద్ర బృందం రానుంది. ఢిల్లీ నుంచి తెలంగాణకు 6 గురు సభ్యుల బృందం రాబోతోంది. వరదల నష్టాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది బృందం. 2 రోజుల పర్యటనలో భద్రాచలం, కడెం ప్రాజెక్టులను పరిశీలించనుంది కేంద్ర బృందం.మరోవైపు భారీ వర్షాలకు, వరదలకు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. గోదావరి నది పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు దెబ్బతిన్నాయి.

First published:

Tags: Floods, Godavari, Godavari floods, Heavy Rains, Khammam, Maoists, Telangana

ఉత్తమ కథలు