MAOISTS ARE SET FIRE TO 12 VEHICLES THAT TRACTORS AND JCBS COMING FOR ROAD WORKS IN CHHATTISGARH AREA KMM PRV
Maoists: మావోల దుశ్చర్య.. రోడ్డు పనులు జరగకుండా వాహనాలకు నిప్పు.. ట్రాక్టర్లు, జేసీబీలు దహనం
దహనమవుతున్న ట్రాక్టర్లు
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు (Border)లో మావోయిస్టులు (Maoists) దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు పనులు చేస్తుండగా 12 వానాలకు నిప్పు పెట్టారు. రహదారి నిర్మాణం పూర్తయితే వారి ఉనికికి ప్రమాదమని భావించి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు (Maoists) దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు పనులు చేస్తుండగా 12 వానాలకు నిప్పు పెట్టారు. రహదారి నిర్మాణం పూర్తయితే వారి ఉనికికి ప్రమాదమని భావించి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం. బీజాపూర్, నారాయణపూర్ (Narayanapur) జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు. బామ్రా గఢ్ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రావిూణ సడక్ యోజన పథకం కింద దోదరాజ్ నుంచి కవండే వరకు రోడ్లు వేస్తుండగా ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం. రోడ్డు నిర్మాణం పూర్తయితే వారి ఉనికి ప్రమాదమని భావించి వాహనాలను తగలబెట్టినట్లు (Burst) తెలుస్తోంది. ఆయుధాలతో నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చిన మావోయిస్టులు… రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది… 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు.
గత డిసెంబరులో..
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు (Maoists) లేరు. ఇది గత కొన్నేళ్లుగా ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు పోలీసు బాస్‌లు చేస్తున్న ప్రకటనలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని రూపుమాపడంలో విజయం సాధించాం అన్నది గొప్పగా చెప్పుకుంటున్న విషయం. కానీ ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న ఘటనలు మావోయిస్టుల ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని చాటి చెబుతునే ఉన్నట్టు తెలుస్తుంది. గత డిసెంబరులో ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని వెంకటాపురం మండలం సూరువీడు మాజీ సర్పంచి రమేష్‌ని పోలీసు ఇన్ఫార్మర్ పేరిట దారుణంగా చంపేశారు. తాను ఏ విధంగా పోలీసు ఇన్ఫార్మర్గా మారింది తెలియజేస్తూ అతని వాయిస్ రికార్డును రిలీజ్ చేశారు.
రోడ్డు పనులు పర్యవేక్షిస్తుండగా కిడ్నాప్..
అంతకు ముందు గత నవంబరులో చత్తీస్ఘడ్ బీజపూర్ జిల్లా పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అజయ్ రోషన్ లక్రాను రోడ్ల నిర్మాణ పనులు పర్యవేక్షిస్తుండగా మావోయిస్టులు కిడ్నాప్ (Kidnapped by Maoists) చేశారు. అతని భార్య వేడుకోలు అనంతరం ప్రజాకోర్టు నిర్వహించి, హెచ్చరికలతో వదిలారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి తెలంగాణ- చత్తీస్ఘడ్ సరిహద్దు (Telangana-Chhattisgarh border) ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు కూంబింగ్‌లతో మావోయిస్టులను నియంత్రించే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ.. అడపా దడపా ఎదురుకాల్పులు.. అనంతరం మావోయిస్టుల లొంగుబాట్లు.. చోటుచేసుకుంటున్నా ఉద్యమ విస్తరణ మాత్రం ఆగిపోలేదన్న సంకేతాలను మావోయిస్టులు పంపుతునే ఉన్నారు.
మైదాన ప్రాంతంలోకి చొచ్చుకుని రావడం..
ఎక్కడో ఏజెన్సీలో అటవీ ప్రాంతంలోనే తమ కార్యకలాపాలకు పరిమితం అయిన మావోయిస్టులు ఇప్పుడు ఇలా మైదాన ప్రాంతంలోకి చొచ్చుకుని రావడం, ఒక మండల కేంద్రమైన గ్రామ పంచాయతీ సర్పంచిని (Sarpanch) కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం నిజానికి తేలిగ్గా తీసుకునే విషయం కాదు. దీనిపై సీరియస్‌గా స్పందించిన పోలీసులు వచ్చినవాళ్లు ఎవరు..? ఒకవేళ మావోయిస్టులే అయితే వాళ్లు ఇంత లోపలికి ఎలా రాగలిగారు అన్నది తేల్చే పనిలో ఉన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.