Home /News /khammam /

KHAMMAM DISTRICT TRS SENIOR LEADER AND FORMER MINISTER TUMMALA NAGESWARA RAO SAID HE WAS BEING HARASSED BY HIS OWN PARTY LEADERS KMM PRV

TRS| Tummala: సొంత పార్టీ వాళ్లే ఇబ్బందులు పెడుతున్నారు.. మాజీ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు.. 

తుమ్మల నాగేశ్వరరావు (ఫైల్ ఫోటో)

తుమ్మల నాగేశ్వరరావు (ఫైల్ ఫోటో)

ఖమ్మం (Khammam) జిల్లా రాజకీయాలంటే మొదట గుర్తొచ్చేది తుమ్మల నాగేశ్వరరావు పేరే. అయితే చాలా రోజులుగా తుమ్మల పార్టీలో అంతగా కనిపించడం లేదు. తాజాగా తుమ్మల టీఆర్​ఎస్​ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

  ఖమ్మం (Khammam) జిల్లా రాజకీయాలంటే మొదట గుర్తొచ్చేది తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పేరే. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా.. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన తుమ్మల ఇప్పుడు ఎక్కడున్నారు. ఏంచేస్తున్నారు..? ఆయన రాజకీయ చాణక్యాన్ని.. అభివృద్ధి వ్యూహాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి వాడుకోవడం లేదా..? సముచితమైన ప్రాధాన్యం కల్పించడం లేదా..? తరాలు మారుతున్న రాజకీయంలో ఇప్పుడు తుమ్మల (Tummala) స్థానమెక్కడ..? ఆయన దారెటు అన్నదే పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. అప్పుడప్పుడూ పాలేరు (Paleru) నియోజకవర్గంలో పర్యటిస్తూ.. జనంతో టచ్‌లో ఉంటున్నప్పటికీ.. ఎక్కడో తెలీని గ్యాప్‌ ఇంకా వెంటాడుతునే ఉంది. ఇప్పటికీ టీఆర్ఎస్ (TRS) కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల వస్తున్నారంటే నియోజవర్గంలో ఒక వేవ్‌లా జనం కదిలే పరిస్థితి ఉంది. అయినా ఎన్నో ఎన్నికలు వచ్చిపోతున్నా.. ఎవరెవరికో అటు పార్టీలో.. ఇటు ప్రభుత్వంలో సముచిత స్థానాలు, పదవులు కట్టబెడుతూ ప్రాధాన్యం కల్పిస్తున్నప్పటికీ.. సీనియర్‌ అయిన తుమ్మలకు ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో ఎలాంటి అపాయింట్‌మెంట్‌ లేకుండా నేరుగా సీఎం కేసీఆర్‌ను కలవగలిగే అతి తక్కువ మందిలో తుమ్మల (Tummala) ఒక్కరుగా తెరాస వర్గాల్లో ఇప్పటికీ చెబుతుంటారు. మరి ఇప్పుడు ఏమైంది.. అసలు ఏంజరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఆయన అభిమానులు.. అనుచరగణంలో ఇదో అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. అయితే తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

  శనివారం ఖమ్మంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో (Ugadi celebrations) పాల్గొన్న ఆయన, అక్కడ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని కొంతమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అయితే మనం పార్టీలో ఉన్నందున ఎక్కడ తొందర పడవద్దని కార్యకర్తలకు సూచించారు.  తాను పదవిలో ఉన్నప్పుడు ప్రతి పక్ష పార్టీలకు సంబంధించిన వారిపై కూడా ఎటువంటి వివక్షత చూపించలేదని చెప్పారు. ఇప్పుడు సొంత పార్టీ (Own party) వారికే వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లర వ్యక్తులను పట్టించుకోవద్దని అన్నారు. రాజకీయాల్లో కావలసింది ఓపిక అని అన్నారు. ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారని చెప్పారు.

  నమ్ముకున్న వారి కోసం పని చేయండి..

  మనల్ని ఇబ్బందిపెట్టేవారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని తుమ్మల (Tummala) అన్నారు. అలాంటి వ్యక్తుల గురించి పట్టించుకుంటే.. మనకున్న పరువు, ప్రతిష్టలే దిగజారిపోతాయని చెప్పారు. కాబట్టి మన పనేదో మనం చేసుకోవాలని నమ్ముకున్న ప్రజల కోసం పని చేయాలని కార్యకర్తలకు పిలుపనిచ్చారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాల మేరకు జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు చేసే అవకాశాలు చేసే అదృష్టం దక్కిందని తుమ్మల ఈ సందర్భంగా అన్నారు.

  ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను పదవిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు పార్టీలపై ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. సొంత పార్టీ వాళ్లనే ఈ రకంగా చేస్తున్నారంటే.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేద్దాం. కొద్ది రోజులు ఓపిక పట్టండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. నేను మీ కోసం ఉంటానని చెప్పారు. మనతోని ఉండే వ్యక్తులను ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో అందరూ చూస్తున్నారు. మనం పార్టీలో ఉన్నాం కాబట్టి దాన్ని బజారున పడేసే ఉద్దేశం మనకు లేదు. అటువంటి వ్యక్తులకు భవిష్యతులో పార్టీ ఏ రకమైన ఆదేశాలు ఇస్తుందో చూద్దాం. మనం ఎక్కడా కూడా తొందరకపడకుండా.. వాళ్లు కవ్వించినా, బాధపెట్టిన పట్టించుకోవద్దు. మీరు ఎవరినా కూడా ఇబ్బంది పెట్టొద్దు’అని తుమ్మల కార్యకర్తలను కోరారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Trs, Tummala nageshwara rao

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు