హోమ్ /వార్తలు /khammam /

Khammam: ఖమ్మం కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. జాబితా ఇదే

Khammam: ఖమ్మం కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. జాబితా ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌లతో పాటు జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, సిద్ధిపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30న పోలింగ్ జరుగుతుంది. మే3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన బరిలోకి దిగుతోంది. ఇప్పటికే సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పొరేషన్‌లో బీజేపీ 44 స్థానాల్లో, జనసేన 6 స్థానాల్లో పోటీ చేస్తోంది. 8, 16, 23, 28, 48, 51 డివిజన్లలో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుగుతున్నారు. తమకు కేటాయించిన ఆరు స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆరుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

జనసేన అభ్యర్థులు

1. మిరియలా జగన్- 23వ డివిజన్

2. ధనిశెట్టి భానుమతి- 48వ డివిజన్

3. భోగా హరిప్రియ- 28వ డివిజన్

4. బండారు రామకృష్ణ- 16వ డివిజన్

5. బోడా వినోద్- 8వ డివిజన్

6. సింగారపు చంద్రమౌళి-51వ డివిజన్


కాగా, తెలంగాణ ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌లతో పాటు జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, సిద్ధిపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30న పోలింగ్ జరుగుతుంది. మే3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

First published:

Tags: Khammam, Khammam muncipal elections, Telangana, Telangana Politics

ఉత్తమ కథలు