Home /News /khammam /

GIRLFRIEND HIT PEPPER IN THE BOYFRIEND EYES FOR NOT CARING AFTER A FEW DAYS OF HAVING AN EXTRAMARITAL AFFAIR KMM PRV

Khammam: వీడికి ఇలా కావాల్సిందే.. కట్టుకున్న భార్య ఉండగా మరో మహిళతో సహజీవనం.. చివరికి ట్విస్టిచ్చిన ప్రియురాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధాలు (Extra marital Affair) జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. హత్యలకు (murder) , ఆత్మహత్యల (Suicide) కు కారణమవుతున్నాయి. వాళ్లను నమ్ముకొని ఉన్న కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి.

    వివాహేతర సంబంధాలు (Extra marital Affair) జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. హత్యలకు (murder) , ఆత్మహత్యల (Suicide) కు కారణమవుతున్నాయి. వాళ్లను నమ్ముకొని ఉన్న కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరి తీరు మారడం లేదు. రోజూ ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. కట్టుకున్న భార్యను లేదా భర్తను వదిలి పరాయి పురుషుడు/మహిళ మోజులో పడి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. వీటిపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి కోవకు చెందిందే సత్యవతి కథ.  ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి పట్టణంలో K.Y.R ధమ్ బిర్యానీ సెంటర్ నడుపుతున్న కొండా యువరాజు పై మిరపకాయ్  కారంతో దాడికి పాల్పడింది అతని ప్రియురాలు సత్యవతి.

    పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన కొండా యువరాజు సత్తుపల్లి లో కే.వై.ఆర్ ధమ్  బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. అతని భార్య కస్తూరి స్వగ్రామం లో ఉంటుంది. ఈ క్రమంలో యువరాజు తన హోటల్ లో పనిచేస్తున్న సత్వవతి అనే మహిళతో మూడేళ్ళుగా సహజీవనం చేస్తున్నాడు.

    గత కొద్ది రోజుల నుంచి యువరాజు అతని ప్రేయసి సత్యవతి మధ్య ఆర్థిక లావాదేవీ ల విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే సత్యవతి బిర్యానీ సెంటర్ వద్దకు వచ్చి యువరాజు కంట్లో కారం చల్లి ఆందోళన చేపట్టింది. తనను సరిగ్గా చూసుకోవటం లేదని, అతని భార్య పిల్లలకు డబ్బులు పంపిస్తున్నాడంది. యువరాజు హోటల్ పెట్టి ఈ స్థాయికి రావటానికి కారణం తానే అని అలాంటి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇరువురు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు పోలీస్​లను ఆశ్రయించాయి.


    బంజారా హిల్స్ లో..

    ఇలాంటి ఘటనే ఇటీవలె బంజారాహిల్స్​లో జరిగింది. ఉద్యోగ రీత్యా వాళ్లు హైదరాబాద్ వచ్చి బంజారా హిల్స్ లోనే నివాసం ఉంటున్నారు. ఇలా పెళ్లి తర్వాత ఒక నెల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దిరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రకాష్ భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. ఎలాంటి కారణం లేకుండానే అతడు భార్యను హింసించేవాడు. రాత్రి సమయంలో కూడా ఇంటికి రాకుండా ఉండేవాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో అతడు ఏకాంతంగా ఉన్న ఫొటోలను తన స్నేహితులకు చూపించేవాడని.. భర్త పెట్టే బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొంది.

    అయితే ఇటీవల తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఎలాగైనా ఈ విషయాన్ని బయట పెట్టాలని.. రెడ్ హ్యాండెడ్ గా తన భర్తను పట్టుకోవాలని అనుకుంది. దీనిలో భాగంగానే రాత్రి త్రివేణి తన కుటుంబ సభ్యులతో కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాష్, మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్‌ను, మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషనుకు తరలించారు. తనను మోసం చేశాడని.. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ పోలీసులను కోరింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Extra marital affair, Khammam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు