Home /News /khammam /

COUPLE WHO STOLE 1CRORE 80LAKHS IN KHAMMAM TO GIVE RAILWAY JOBS SNR KMM

Telangana: మొగుడ్ని అడ్డుపెట్టుకొని మోసాలు .. జాబ్స్‌ పేరుతో సుమారు 2 కోట్లు కాజేసిన మాయలేడి

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Job cheaters:భార్యభర్త కలిసి 12మందిని మోసం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డజన్‌ మంది దగ్గర నుంచి కోటి 88లక్షలు తీసుకున్నారు. దోచుకున్న డబ్బుతో ఆస్తులు కొనుక్కొని బాధితులకు మొండి చేయి చూపించడంతో గుట్టురట్టైంది.

    (G.SrinivasReddy,News18,Khammam)
    మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్లు ఉంటారు. ప్రపంచం ఫైజీ స్పీడుతో ముందుకు వెళ్తుంటే అమాయకులు మాత్రం అబద్దాలు చెప్పే వాళ్లను, మాయ మాటలు చెప్పి మోసం చేసే వాళ్లనే నమ్ముతున్నారు. నమ్మడమే కాదు..కోట్ల రూపాయలను వారికి కట్టబెట్టి తర్వాత పోలీసు(Police)లను ఆశ్రయిస్తున్నారు. ఇద్దరు దంపతులు ఖమ్మం(Khammam) జిల్లాలో ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపి పెట్టారు. నగరంలోని సుగ్గలవారి తోట(Suggalavari thota) ప్రాంతానికి చెందిన దాసరి సరిత అనే మహిళ తెలిసిన వాళ్లకు రైల్వే శాఖ(Railways Department)లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు 36 లక్షల  రూపాయలు తీసుకొని మోసం చేసింది.

    ఒకరు లేడీ మరొకరు ఖిలాడీ..
    సరిత చేసిన మోసానికి బలైన వాళ్లు ఎవరూ కాదు ఖమ్మం నగరంలోని చెరువు బజారుకు చెందిన పాలవెల్లి తులసితో పాటు డౌలే సునీత మరో మహిళ బాధితులుగా ఉన్నారు. వాళ్లే ఉద్యోగాల పేరుతో లక్షలు సమర్పించుకొని మోసపోయామని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎస్పీ ఆదేశాల మేరకు దాసరి సరితపై ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా వేసిన సూత్రధారి దాసరి సరిత ఆమె భర్త ముద్దం శ్రీకాంత్‌ అనే 26సంవత్సరాల వ్యక్తిని అడ్డుపెట్టుకొని ఈ తతంగం నడిపించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

    ఉద్యోగాల పేరుతో రెండు కోట్ల మోసం ..
    ఏన్కూర్ మండలం జన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ 2009 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రస్తుతం తల్లాడ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడితో కలిసి సరిత రైల్వే డిపార్టుమెంట్‌లో గెజిటెడ్ ఆఫీసర్ ఫేక్ ఐడి కార్డు తయారు చేయించుకుంది. ఆ ఫేక్ ఐడీ కార్డును చూపిస్తూ బందువులు, ఫ్రెండ్స్, పరిచయస్తులకు రైల్వే డిపార్ట్‌మెంట్‌లో వేర్వేరు హోదాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 12మందిని నమ్మించారు. వాళ్ల దగ్గర నుంచి ఉద్యోగాల పేరుతో కోటి 88లక్షల 95వేల రూపాయలు వసూలు చేశారు. అప్పనంగా సంపాధించిన డబ్బుతో లగ్జరీ లైఫ్‌ని గడుపుతూనే మిగిలిన డబ్బుతో నగలు, స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారు.

    12మందిని మోసం చేసిన జంట..
    ఇద్దరు బాధితుల ద్వారా కూపీ లాగిన పోలీసులకు వీరి మాయలో పడి మరో 10మంది పెద్ద మొత్తంలో డబ్బులు సమర్పించుకున్నట్లుగా తెలుసుకొని వాటిని రికవరీ చేసుకున్నారు. నిందుతులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఖమ్మం వన్ టౌన్ సిఐ చిట్టిబాబు తెలిపారు. డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినందుకు కానిస్టేబుల్‌పై శాఖపరమైన చర్యలు ఆదేశించారు ఉన్నతాధికారులు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Khammam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు