ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ.. ‘నువ్వు బాగున్నావ్.. నువ్వంటే ఇష్టం’ అంటూ సీఐ ఆమెను .. .

ప్రతీకాత్మక చిత్రం

Telangana News: పొలం గట్టు తగాదాపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళతో సీఐ అసభ్యకరంగా మాట్లాడారని ఓ మహిళ ఆరోపించింది. సీఐ అనుచితంగా మాట్లాడాడని బాధితురాలు ఆరోపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  పొలం గట్టుకు సంబంధించిన వ్యావహారంపై న్యాయం చేయల్సిందిగా ఓ మహిళ పోలీసులకు పిర్యాదు చేసేందుకు వెళ్లింది. వివరాలను సేకరిస్తున్న అక్కడ సీఐ ఏం జరిగిందో చెప్పమన్నాడు. ఆమె చెబుతున్న క్రమంలోనే నీవు మంచిగ ఉన్నావు.. నువ్వు నాకు బాగా నచ్చావ్ అంటూ సీఐ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం కాస్త స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ విషయాన్ని ఆమె విలేకరులకు కూడా చెప్పింది. విలేకరులకు చెప్పిన కొన్ని గంటల్లోనే మళ్లీ ఆ బాధిత మహిళ వారికి ఫోన్ చేసి.. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని పేపర్లో రాయొద్దు అంటూ ఆమె వాళ్లను కోరింది. అసలేం జరిగిందంటే.. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుబంలో తల్లీకూతుళ్లు నివసిస్తున్నారు.

  అందులో కూతురుకు ఆమె  పెళ్లి చేసిన  కొన్ని రోజులకు  భర్తతో గొడవ జరిగింది. దీంతో ఆమె అప్పటి నుంచి  తల్లి ఇంట్లోనే  ఉంటుంది.  ఆమెకు వరుసకు బాబాయ్ అయ్యే భూక్యా లక్ష్మణ్ తమ పొలం గట్టును ఆక్రమించుకొని దున్నుతుండగా ఆమె వెళ్లి అడ్డుకుంది. ఈ వ్యవహారంలో లక్ష్మణ్ ఆమెను కొట్టినట్లు ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతడు వినిపించుకోకుండా పత్తి చేను వద్ద గట్టు దాటి వచ్చి అర ఎకరం వరకు ఆక్రమించి దున్నుతుండగా రాత్రి 7 గంటలకు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు  వెళ్లింది. అప్పుడే సీఐ ఆమెను అనుచితంగా మాట్లాడాడని..  విలేకురులతో వెల్లడించింది. అంతేకాకుండా 7 గంటలకు వెళ్లిన తనను రాత్రి 11.30 వరకు ఒక్కదాన్నే పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టారని.. పెద్దవాళ్లతో గొడవలు ఎందుకు అని చెప్పారని ఆరోపించింది.

  Also Read: ఒంటరిగా ఉన్న యువతిపై కన్నేసిన కామాంధుడు.. ఇంట్లోకి చొరబడి.. ఆమెను బలవంతంగా..


  అయితే ఈ విషయాలను విలేకరుకు చెప్పిన ఆమె మళ్లీ వాళ్లకు ఫోన్ చేసి ఇవన్నీ పేపర్లో రాయకండి.. అంటు ఆమె విలేకురులకు చెప్పింది. ఎందుకు అని వాళ్లు ప్రశ్నించగా.. అనుకోకుండా ఈ ఘటన జరిగిందని.. మనస్సులో ఇవన్నీ పెట్టుకోకు.. అని తన బాబాయ్ తనతో చెప్పాడని తెలిపింది. అంతేకాకుండా సమస్యను పరిష్కరించి.. హద్దులు పెట్టించేందుకు సహకరిస్తామని పోలీసులు తనకు హామీ ఇచ్చినట్లు తెలిపింది. బాధిత మహిళ ఆరోపణలపై సీఐ బి. శ్రీనివాసులును వివరణ కోరగా.. ఆమె ఫిర్యాదు సరిగ్గా లేదని.. మార్చి రాయాలని అన్న మాట వాస్తవమే.. కానీ అనుచితంగా మాత్రం మాట్లాడలేదని ఆయన వివరణ ఇచ్చారు.
  Published by:Veera Babu
  First published: