BIRDS BRIDHAVAN IN VISAKHAPATNAM DIALY MORE THAN 200 PARROTS COME TO THIS HOUSE AND ENJOYING NGS VSJ NJ
Parrot House: ఆ ఇల్లు రామచిలుకలకు బృందావనం.. సాయంత్రం అయితే అక్కడకు చేరాల్సిందే..? ప్రత్యేకత ఏంటో తెలుసా?
రామ చిలుకల ఇల్లు
Parrot House: నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న రోజుల్లో ఒక్క రామచిలక కనిపించడమే కష్టం.. అలాంటిది.. కానీ ఆ ఇంటి నిండా రామచిలకలే దర్శనమిస్తాయి. ఉదయం అంతా ఎక్కడెక్కడ తిరిగినా.. సాయంత్రం అయ్యే సరికి ఆ డాబాపైకి వచ్చి వాలిపోతాయి.. ఎందుకో తెలుసా..?
Parrot House: అందమైన రామ చిలులకలు (Parrot) ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. నగరాల్నీ కాంక్రీట్ జంగిల్ గా మారడంతో.. వాటికి ప్లేస్ లేకుండా పోయింది. కేవలం పల్లెల్లో.. పొలాల్లోనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అయితే విశాఖ (Visakha)లాంటి మహా నగరంలో మాత్రం ఓ రామ చిలుకల బృందావనం ఉందని మీకు తెలుసా..? ఉదయం అంతా ఎక్కడ తిరిగినా సరే.. సాయంత్రం అయ్యే సరికి ఆ రామచిలకలంతా ఆ ఇంటి మేడపైకి వచ్చి చేరుతాయి. అందుకే విశాఖపట్నం (Visakhapatnam )లోని భానూనగర్లోని లక్ష్మీనారాయణరెడ్డి ఇల్లు ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. సాయంత్రం పూటా అక్కడకు గుంపుల కొద్ది రామచిలకలు చేరుతాయి. కిలకిలారావాలతో సందడి చేస్తూ.. కాస్త ఆహ్లాదాన్ని పంచుతాయి.. ఒక్కసారి అన్ని రామ చిలుకలను చూస్తే చాలా ఆహ్లాదంగా.. మనసుకి ప్రశాంతంగా అనిపించడం ఖాయం..
వైజాగ్ లోని కృష్ణాకాలేజీ (Krishna College) సమీపంలోని భానూ నగర్ కు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి (Laxmi Narayana Reddy) ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. భార్య శైలజ (Sailaja) టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు. పదేళ్ల క్రితం లక్ష్మీనారాయణరెడ్డి మేడపైన పెంచుతున్న పూలమొక్కల దగ్గరకు రెండు రామచిలకలు వచ్చాయి. వాటిని చూసి ముచ్చటపడిన లక్ష్మీనారాయణరెడ్డి వాటికి గింజల్ని వేశారు. గింజలకు ఆ చిలుకలు అలవాటు పడ్డాయి. దీంతో ఆ రెండింటికి తోడు.. రోజూ మరి కొన్నిటిని తీసుకొచ్చేవి.. అలా ఇప్పుడవి 200కి పైగా వస్తున్నాయి. ఆ ఇంటికి ఆత్మీయ అతిథులుగా మారిపోయాయి.
అనుకోకుండా రామచిలుకలతో ఏర్పడిన ఈ బంధం.. విడదీయరానిదిగా అల్లుకుపోయిందని ఆ దంపతులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రామచిలుకలు సవ్వడి చేస్తూ వారి మేడమీదకి వచ్చేస్తాయి. మధ్యాహ్నం 1 గంటకు పావురాల కువకువలు వినిపిస్తాయి. మళ్లీ సాయంత్రం 4 గంటలకు రామచిలుకలు అతిథుల్లా పలకరిస్తాయి. ఇది ప్రతి రోజూ దినచర్యగా మారిపోయింది. వీటి కోసం ప్రతి రోజూ దాదాపు 10 కిలోలకు పైగా బియ్యం, ఇతర ఆహార గింజలు ఆహారంగా వేస్తున్నారు. నెలకు సుమారు 4 వేలకు పైగా ఖర్చవుతున్నా.. తమ కుటుంబ సభ్యుల కోసమే కదా అన్నట్లుగా ఈ భార్యభర్తలు చిలుకలను ప్రేమగా సాకుతున్నారు. 2014లో హూదూద్ కు ముందు వరకూ 700కి పైగా రామచిలుకలు వచ్చి సందడి చేసేవని.. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది అంటున్నారు.
హుదూద్ సమయంలో గూళ్లు దెబ్బతినడంతో చిలుకల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం 300 వరకూ రామచిలుకలు, 100 వరకూ పావురాలు, గోరింకలు వస్తున్నాయనీ.. ప్రతి రోజూ వాటికి సమయానికి ఆహారం అందించడం చాలా సంతోషంగా అనిపిస్తోందని భార్యభర్తలు లక్ష్మీనారాయణరెడ్డి, శైలజ చెబుతున్నారు. తమ పిల్లల మాదిరిగానే రామచిలుకలను అపురూపంగా చూసుకుంటున్నామన్నారు. చిలుకల పందిరిలా మారిపోయిన ఈ మేడను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు రామచిలుకలు వచ్చే సమయం కోసం ప్రతి రోజూ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం వస్తున్న రామచిలకల సంఖ్య ఎక్కువగా ఉండటంతో… వాటికి ఈ మేడ సరిపోవడం లేదని ఇల్లు మారేందుకు కూడా సిద్ధమయ్యారంటే వాళ్లు ఎంత ప్రకృతి ప్రేమికులో(Natur lovers), పక్షి ప్రేమికులు(bird lovers) అర్థం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.