Home /News /khammam /

AGRICULTURE MINISTER SINGIREDDY NIRANJAN REDDY GAVE INSTRUCTIONS TO FARMERS ON PLANTING CROPS DURING THE MONSOON SEASON KMM PRV

Monsoon crops: వానాకాలం ఎలాంటి పంటలు వేయాలో రైతులకు సూచించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి.. ఏమన్నారంటే..?

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

ఖమ్మంలో వానాకాలం-2022 సాగు సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ సభలో వానాకాలం ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుందో మంత్రి రైతులకు సూచించారు.

  ఖమ్మంలో వానాకాలం-2022 సాగు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Agriculture Minister Singireddy Niranjan Reddy), మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​,  ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ఎంపీ నామా నాగేశ్వర్ రావు , విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు , ఖమ్మం (Khammam), భద్రాద్రికొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.  రైతులకు నేరుగా రైతుబంధు పథకం కింద ఖాతాలలో రూ.50 వేల కోట్లు వేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ (Telangana) అని సింగిరెడ్డి అన్నారు. ఉచిత కరెంటు కోసం రూ.10 వేల కోట్లు భరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఏడేళ్లలో రూ.3 లక్షల 75 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం బలోపేతానికి కృషి చేసిందని ఆయన తెలిపారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలను (Monsoon crops) వేయాలని మంత్రి సూచించారు.

  మార్కెట్ డిమాండ్ ను బట్టి..

  ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ..’’ ఖమ్మం వైవిధ్యమైన పంటలు, ఆధునిక సాగుకు ప్రసిద్ది. 30 ఏళ్లక్రితమే పాలమూరు - ఖమ్మం జిల్లాలకు పూర్తి తేడా కనిపించేది.. సమైక్యపాలనలో పచ్చని పాలమూరు వట్టిపోయింది
  రాష్ట్రం అంతా కరువొచ్చినా ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో సాధారణంగా కరువు రాదు. ఖమ్మం రైతులు ఇతర ప్రాంతాల రైతులకు (Farmers) ఆదర్శం. మార్కెట్ డిమాండ్ ను బట్టి రైతులు పంటలు పండించేలా ఏఏ పంటలు పండించాలి..? ఎలాంటి విత్తనాలు..? ఎంతమోతాదు ఎరువులు వాడాలి ? అన్న విషయాలపై రైతులకు రైతువేదికల ద్వారా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలి.

  రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు..

  ‘‘మన పంటలలో ఉత్పాదకత భారీగా పెరగాల్సిన అవసరం ఉన్నది.
  రైతువేదికలలో 365 రోజులు అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలి.
  ప్రపంచంలోనే రైతు ఏ కారణం చేత మరణించినా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి భీమా ద్వారా రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది రైతు కుటుంబాలు రైతుభీమా ద్వారా లబ్దిపొందారు. కానీ కొందరు విపక్ష నేతలు 80 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రచారం చేస్తున్నారు.

  యాసంగి పంట నెల రోజులు ముందు కోతకు వచ్చేలా చూసుకుంటే ప్రకృతి నష్టాలు ఉండవని రైతులకు వివరిస్తే దానిని కొందరు విమర్శిస్తున్నారు.
  అయ్య సంపాదించిన ఆస్తులతో తెలంగాణల రాజకీయ పార్టీ పెట్టి పరాయి ప్రాంతాలను ఏలాలని ఆశిస్తున్న వారు ఇక్కడ సుద్దులు చెప్తున్నారు. రైతుబంధు, రైతుభీమా, కరంటు, సాగునీళ్లు ఇచ్చిన మా రైతులకు ఏం చెప్పాలి అన్న విషయం మాకు తెలియదా..?

  పంజాబ్ కు మించి వరి ధాన్యం ఉత్పత్తి..

  60 ఏండ్లు అధికారం అనుభవించి రైతులకు ఏం చేయనోళ్లు ఈ రోజు రైతులకు ఏదో చేస్తామని చెబుతున్నారు. కేవలం కంట్రోలు బియ్యం కోసం తండ్లాడిన తెలంగాణ నేడు దేశానికి అన్నంపెట్టిన పంజాబ్ కు మించి వరి ధాన్యం ఉత్పత్తిని సాధించింది.
  తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేతగాక కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది.
  తెలంగాణలో ఏదో చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ , బీజేపీలు ప్రస్తుతం తమ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో దమ్ముంటే అమలు చేసి చూపాలి.

  రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలి .. వ్యవసాయ రంగ మార్పుకు కృషిచేయాలి. సహజసిద్ద ఎరువులు, రసాయనాల వినియోగం వైపు రైతులను ప్రోత్సహించాలి. రైతువేదికల ద్వారా అందించే పుస్తకాలను రైతులు క్షుణ్ణంగా చదివి అనుసరించాలి. మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం ప్రపంచం ఎదురుచూసే రోజులు రావాలి .. అది త్వరలో ఆవిష్కృతమవుతుందని భావిస్తున్నాను.

  వ్యవసాయ వృద్దిరేటు నేడు 8.1..

  నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి జీవితం యువతరం ఆదర్శం. పెట్రోల్ బంకుల్లో పనిచేసి ఐఎఎస్ సాధించారు. యువత పని మీద గౌరవం పెంచుకోవాలి .. నామోషితనం వదులుకోవాలి. వ్యవసాయ రంగం భవిష్యత్ ను మారుస్తాం .. ప్రకృతిని ప్రేమించలేనివాడు తల్లితండ్రులను ప్రేమించ లేడు.
  వ్యవసాయం అంటే పంటలు పండించేది కాదు .. సమాజాన్ని నిర్మించేది, సంస్కరించేది అని ఒక తత్వవేత్త. రైతులు తమ అవసరాల కోసం చెట్టు, పుట్ట,  గొడ్డు, గోదా అమ్ముకున్న దుస్థితిని దగ్గరగా చూసి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిచాం. తెలంగాణ ఏర్పడే నాటికి 1.8 శాతం ఉన్న వ్యవసాయ వృద్దిరేటు నేడు 8.1 శాతానికి పెరిగింది.” అన్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Monsoon rains, Niranjan Reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు