హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Zoom: బెంగళూరులో జూమ్ టెక్ సెంటర్... ఈ టాలెంట్ ఉన్నవారికి జాబ్స్

Zoom: బెంగళూరులో జూమ్ టెక్ సెంటర్... ఈ టాలెంట్ ఉన్నవారికి జాబ్స్

Zoom: బెంగళూరులో జూమ్ టెక్ సెంటర్... ఈ టాలెంట్ ఉన్నవారికి జాబ్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Zoom: బెంగళూరులో జూమ్ టెక్ సెంటర్... ఈ టాలెంట్ ఉన్నవారికి జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Zoom | వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జూమ్ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించబోతోంది. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వనుంది.

  లాక్‌డౌన్‌లో బాగా పాపులర్ అయిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌‌ఫామ్ జూమ్... బెంగళూరులో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జూమ్‌కు ముంబైలో ఆఫీసు ఉంది. త్వరలో బెంగళూరులో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ టెక్నాలజీ సెంటర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కార్యకలాపాలకు వేదిక కానుంది. అంతేకాదు... టాలెంట్ ఉన్నవారికి ఈ టెక్నాలజీ సెంటర్‌లో ఉద్యోగావకాశాలు ఇవ్వనుంది జూమ్. కొన్నేళ్లలో భారతదేశంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించనుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ ఆపరేషన్స్, ఐటీ, సెక్యూరిటీ, బిజినెస్ ఆపరేషన్స్ లాంటి ఉద్యోగాలను ఆఫర్ చేయనుంది జూమ్. కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో జూమ్ యాప్, వెబ్‌సైట్ బాగా పాపులర్ అయింది. భారతదేశంలో 2300 విద్యా సంస్థలకు ఉచితంగా సేవల్ని అందిస్తున్నామని జూమ్ సీఈఓ చెబుతున్నారు.

  Samsung Galaxy A21s: గుడ్ న్యూస్... సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ధర తగ్గింది

  Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఓ వారం రోజులు ఆగండి

  ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య జూమ్‌లో ఉచిత యూజర్ల సంఖ్య 6700% పెరగడం విశేషం. పెయిడ్ యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ముంబై కార్యాలయంలోనే కార్యకలాపాలు మూడు రెట్లు విస్తరించొచ్చని అంచనా. ప్రస్తుతం ముంబై ఆఫీసులో పనిచేసేందుకు భారతదేశంలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌ను నియమించుకోనుంది జూమ్. భారతదేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలే రిలయెన్స్ జియో నుంచి జియోమీట్ ప్లాట్‌ఫామ్ వచ్చింది. మరోవైపు ఎయిర్‌టెల్ కూడా బ్లూజీన్స్ పేరుతో ఇలాంటి ప్లాట్‌ఫామ్ లాంఛ్ చేసింది. వీటితో పోటీపడనుంది జూమ్.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, JOBS, Technology

  ఉత్తమ కథలు