హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Zomato Layoffs: ఇక జొమాటో వంతు.. ఎంత మంది ఉద్యోగులు ఔట్ అవుతున్నారంటే?

Zomato Layoffs: ఇక జొమాటో వంతు.. ఎంత మంది ఉద్యోగులు ఔట్ అవుతున్నారంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లే ఆఫ్స్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో పని చేస్తున్న వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ మెటా లో భారీ ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఇప్పుడు మరో సంస్థ ఆ పేరు ప్రచారంలోకి వచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

లే ఆఫ్స్ (Layoffs).. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో పని చేస్తున్న వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్విట్టర్ (Twitter) మరియు ఫేస్‌బుక్ (Facebook) యొక్క మాతృ సంస్థ మెటా లో భారీ ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఇప్పుడు మరో సంస్థ ఆ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ మరియు డ్రింక్స్ ను డెలివరీ చేసే ప్లాట్‌ఫారమ్ అయిన జోమాటో సైతం తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ వారంలోనే కంపెనీ తన ఉద్యోగులను తొలగించడం ప్రారంభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఖర్చు తగ్గించుకుని లాభాలు పెంచుకునే లక్ష్యంతో ఈ నిర్ణయానికి వచ్చింది సంస్థ. ఈ నేపథ్యంలో దాదాపు 100 మందిని తొలగించినట్లు సమాచారం. వీటిలో ప్రొడక్షన్, టెక్, కేటలాగ్ మరియు మార్కెటింగ్ తదితర విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం, రిట్రెంచ్‌మెంట్ సరఫరాతో అనుబంధించబడిన ఉద్యోగులపై మాత్రం ప్రభావం చూపలేదు.

దాదాపు 4 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా జొమాటో ప్రతినిధి మాట్లాడుతూ.. “పనితీరు ఆధారంగా, దాదాపు 3 శాతం మంది ఉద్యోగులను తొలగించే కసరత్తు కొనసాగుతుంది. అంతకుమించి ఏమీ లేదు.’’ జొమాటోలో ఉద్యోగాల తొలగింపుపై కొన్ని రోజుల క్రితమే జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఇలా పరోక్షంగా వెల్లడించారు. పనితీరు సరిగా లేనివారిని తొలగించే అవకాశం ఉన్నట్లు ముంబైలోని టౌన్‌హాల్ లో జరిగిన మీటింగ్ లో ఇటీవల ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ Layoff కాలంలో కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని జొమాటో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

జొమాటో ప్రతినిధి ఒకరు ఈ ఉద్యోగుల తీసివేతపై స్పందిస్తూ.. పనితీరు మెరుగ్గా లేనివారిని తొలగించే ప్రక్రియ ప్రతీ సంవత్సరం జరిగేదేనన్నారు. ఈ తాజా నిర్ణయం కారణంగా 3 శాతం వర్క్‌ఫోర్స్‌పై ప్రభావం పడుతుందన్నారు. ఇందులో కొత్తేం లేదని వివరించారు. ఇదిలా ఉంటే కంపెనీ మేనేజ్‌మెంట్‌లో నిరంతర రాజీనామాలు కలవరపెడుతున్నాయి. శుక్రవారం కంపెనీ సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా కంపెనీకి రాజీనామా చేశారు.

ఇటీవలి వారాల్లో Zomatoలో ఇది మూడో పెద్ద రాజీనామా. ఇంకా రాహుల్ గంజూ, సిద్ధార్థ్ ఝెవర్ వంటి పెద్ద తలలు సైతం సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్ విభాగం నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో న‌ష్టాలు రావ‌డంతో కంపెనీ 2020 మే నెల‌లో దాదాపు 13 శాతం మందిని తొలగించింది. గురుగ్రామ్‌కు చెందిన దీపింద‌ర్ గోయ‌ల్, పంక‌జ్ చ‌ద్ధా జొమాటోను 2008లో ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలోనే ఫుడ్ డెలివరీలో సంచలనం సృష్టించిన జొమాటో దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది.

First published:

Tags: JOBS, Layoffs, Private Jobs, Zomato

ఉత్తమ కథలు