ట్విట్టర్(Twitter), ఫేస్బుక్(Facebook) మరియు మైక్రోసాఫ్ట్ వంటి అన్ని పెద్ద టెక్ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగుల తొలగింపులో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ దిగ్గజం OYO మరియు Share Chat కూడా తమ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హోటల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ OYO తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది తమ ఉద్యోగుల్లో 10 శాతం వరకు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఓయోలో ఉద్యోగుల సంఖ్య దాదాపు 3,700 మది ఉన్నారు. దీని నుంచి మొత్తం 600 మందిని తొగించనున్నారు. ఇదే సమయంలో.. 250 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోనుంది. ఇలా.. Oyo యొక్క 3,700-ఉద్యోగుల బేస్‌లో దాదాపు 10 శాతానికి చేరుకుంటుంది.
Oyo యొక్క టెక్ బృందంతో పాటు.. ఇతర డిపార్ట్ మెంట్ ఉద్యోగులను కూడా తొలగించనుంది. అలాగే.. మెరుగైన కంపెనీ నిర్వహణ కోసం కార్పొరేట్ మరియు ఇంజనీరింగ్ బృందాలు కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. దీని కోసమే మరో 250 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది.
OYO వ్యవస్థాపకుడు , CEO రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. "ఉద్యోగాలు కోల్పోయే చాలా మంది ఉద్యోగులకు మంచి ఉద్యోగాలు లభించేలా మేము ప్రయత్నిస్తాము. OYO ఈ ఉద్యోగులకు ఉద్యోగాలు పొందేందుకు సహాయం చేస్తుంది. మిమ్మల్ని వదులుకోవడం దురదృష్టకరం అని అన్నారు. కంపెనీకి విలువైన సహకారాన్ని అందించిన ఈ ప్రతిభావంతులైన ఉద్యోగులను కంపెనీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డారన్నారు. భవిష్యత్తులో అవసరమైతే ఈ ఉద్యోగులను తిరిగి తీసుకురావడానికి OYO ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.
షేర్ చాట్ లో కూడా..
Google, Temasek-మద్దతుగల మొహల్లా టెక్ Pvt.షేర్‌చాట్ మతృ సంస్థ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం షేర్‌చాట్ మరియు దాని అనుబంధ బ్రాండ్ల మొత్తం ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురి చేసింది. షేర్‌చాట్ తన గేమింగ్ వర్టికల్ జీట్ 11ని కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తన ఉద్యోగులలో 5 శాతం మందిని తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ జూన్‌లో ప్రకటించింది. గేమింగ్ ప్లాట్‌ఫారమ్ Dream11కి పోటీగా షేర్‌చాట్ 2020 సంవత్సరంలో Jeet11ని ప్రారంభించింది. కానీ 2 సంవత్సరాల తర్వాత కంపెనీ ఈ ప్లాట్‌ఫారమ్ జీట్11ని మూసివేసింది.
దీని కారణంగా దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం షేర్ చాట్ లో 2,200 మంది పని చేస్తున్నారు. షేర్‌చాట్‌ను 2015లో ఫరీద్ అహ్సన్, అంకుష్ సచ్‌దేవా, భాను ప్రతాప్ సింగ్ స్థాపించారు. ప్రముఖ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ Dream11ని తీసుకోవడానికి సంస్థ ఫిబ్రవరి 2020లో Jeet11ని ప్రారంభించింది. ఇందులో క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై బెట్ కట్టొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.