దేశీయ అతిపెద్ద రిటైల్(Retail) బ్రోకరేజీ సంస్థ జెరోధా (Zerodha) లేదా జెరోధా పుణ్యమా అని ఎంతో మంది యువత స్టాక్ మార్కెట్ రంగంలోకి సులభంగా అడుగుపెట్టగలిగారు. ఈ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ (Broking) సంస్థను సోదరుడు నిఖిల్(Nikhil)తో కలిసి నితిన్ కామత్ స్థాపించారు. ఈ సంస్థ అనతికాలంలోనే అతి పెద్ద కంపెనీగా ఎదిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నితిన్ కామత్ (Nithin Kamath) తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించారు. తమ సంస్థలో పనిచేస్తున్న 1100 మంది ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మంది అంటే 950 మంది ఉద్యోగులకు ఇంటి నుంచే శాశ్వతంగా (Work From Home Permanently) పని చేసే వెసులుబాటు కల్పిస్తామన్నారు. మెయిన్ టీమ్‌లోని ఉద్యోగులు మాత్రం హైబ్రిడ్ మోడల్లో పని చేస్తారని కామత్ మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
కరోనా కారణంగా అనేక ఆఫీసులు, వర్క్‌ప్లేస్‌లు మూసివేసిన తర్వాత జెరోధా కంపెనీ తన వర్క్స్ అన్ని ఆన్లైన్లోనే పూర్తి చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల కోసం, కర్ణాటకలోని చిన్న పట్టణాలలో శాటిలైట్ ఆఫీసులను కంపెనీ ఏర్పాటు చేసింది. కామత్ మాట్లాడుతూ, “మా టీమ్‌లో 85-90% మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. మేం ఇదే వర్క్ మోడల్‌ను కొనసాగిస్తాం. మేం కర్ణాటకలోని బెలగావి సిటీలో కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేశాం" అని అన్నారు. "మేం ఇంటి నుంచే ఉద్యోగులను పర్మినెంట్ వర్క్ చేయిస్తాం. ఉద్యోగులు వారి చిన్న పట్టణాలలో నివసించడాన్ని ఆనందిస్తున్నారని మాకు తెలిసింది. బెలగావిలో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు. మాకు అక్కడ ఒక పెద్ద బృందం పని చేస్తోంది. ఉద్యోగులు బెలగావిని ఒక నగరంగా ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఉద్యోగులు పనిమనుషులు, స్వతంత్ర గృహాలను కలిగి ఉన్నారు. బెంగళూరులో నివసించేందుకు కావాల్సిన స్థోమత గురించి వారు ఎప్పటికీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు,” అని అతను చెప్పారు.
అంతకుముందు, వరుస ట్వీట్లలో ఉద్యోగులను ఇంటి నుంచి శాశ్వతంగా పని చేయడానికి అనుమతించడం ద్వారా భారతదేశంలోని అనేక సమస్యలను పరిష్కరించవచ్చని నితిన్ సూచించారు. పెద్ద నగరాలు అధిక జనాభాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇక్కడ నివసించే ప్రజలు నీటి కొరత, కాలుష్యం, వరదలు మొదలైన కారణాలతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. సిటీల్లో జనాభా తగ్గుదల వల్ల నగరాల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని, అలాగే జీవన నాణ్యత మెరుగు పడుతుందని గతంలో నితిన్ అన్నారు.
జెరోధా భారతదేశంలోని అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీలలో ఒకటి. బయట నిధులలో ఒక్క పైసా కూడా సేకరించని భారతీయ యునికార్న్‌లలో ఒకటి. అదనంగా ఈ కంపెనీ భారీ ఎత్తున లాభాలను ఆర్జిస్తోంది. వ్యవస్థాపకులు - బిలియనీర్ సోదరులు నితిన్ కామత్, నిఖిల్ కామత్‌లకు ఇప్పటికీ కంపెనీలో గణనీయమైన వాటా ఉంది. ఇది ఆగస్టు 2010లో స్థాపించిన కంపెనీ ఈ రోజు భారతదేశపు అతిపెద్ద స్టాక్ బ్రోకర్ గా అవతరించింది. ఈ కంపెనీకి దేశంలోని రిటైల్ ట్రేడింగ్ వాల్యూమ్లలో 15 శాతానికి పైగా ఖాతాదారులు అంటే 9 మిలియన్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Nithin, Work From Home, Zerodha