హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

YSRCP Job Mela: ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. 15 వేల మందికి జాబ్స్.. రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ ఇదే

YSRCP Job Mela: ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. 15 వేల మందికి జాబ్స్.. రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 25న భారీ జాబ్ మేళా (YCP Job Mela) నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా (Job Mela) ద్వారా మొత్తం 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వైఎస్సార్‌సీపీ (YSRCP) ఆధ్వర్యంలో ఇటీవల భారీగా జాబ్ మేళా (YSRCP Job Mela) లు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ జాబ్ మేళా (Job Mela) ల ద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, వైజాగ్, తిరుపతిలో విజయవంతంగా జాబ్ మేళాలను నిర్వహించిన వైసీపీ తాగా మరో భారీ జాబ్ మేళాకు సిద్ధమైంది. ఈ నెల 25న కడప జిల్లాలో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ మెగా జాబ్‌ మేళా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్‌సైట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి ఇటీవల విజయసారిరెడ్డి ఆవిష్కరించారు.

ఈ జాబ్ మేళాలో TCL, Green Tech Industries, Tech Mahindra, Conflux Systems Inc, Shriram, Concentrix, Sagar, Cogent, Pioneer, Cerium Technology, Paytm, Byjus, Wingtech, Big Basket, OMICS International, Bharat Fih, Navata Road Transport, Axis Bank, Muthoot Finance, Avani Technology Solution, Mouri Tech, Apollo, Hyundai Mobis, Amara Raja, Med Plus, Airtel Payment Bank, Lomaa, ACN Health Care తదితర కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించనున్నాయి. అయితే, ఈ జాబ్ మేళాకు సంబంధించి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://ysrcpjobmela.com/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ, డిప్లొమా అర్హతతో డెక్కన్ కెమికల్స్ తో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

రిజిస్ట్రేషన్ కోసం ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది...

Step 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://ysrcpjobmela.com/ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం YSR District Job Mela కింద కనిపించే Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, కాంటాక్ట్ నంబర్, మెయిల్ ఐడీ, నియోజకవర్గం, విద్యార్హత, చిరునామా నమోదు చేసి Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

Step 5: రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ నెల 25న జరిగే జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs, Ysrcp

ఉత్తమ కథలు