YSRCP CONDUCTING JOB MELA IN GUNTUR ON MAY 7 8 HERE REGISTRATION LINK NS
YSRCP Job Mela: ఈ నెల 7, 8న ఏపీలో భారీ జాబ్ మేళా.. ఈ లింక్ తో రిజిస్ట్రేషన్.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం (ఫొటో: ట్విట్టర్)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్వర్యంలో మరో భారీ జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించేందుకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్యర్యంలో ఏపీలో ఇటీవల భారీ జాబ్ మేళాలు (Job Mela) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారీ జాబ్ మేళాకు సంబంధించి నిర్వహకులు ప్రకటన చేశారు. వచ్చే నెల అంటే మే 7, 8 తేదీల్లో గుంటూరులో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. ఈ జాబ్ మేళాలో HCL, HDFC Bank, Hero, Hetero, Apollo Pharmacy, Avani Technology Solutions, Axis Bank, Bharat FIH, Big Basket, Byjus, Cerium Cogent, Dixon తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వచ్చే నెల 7, 8వ తేదీల్లో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా జరగబోతోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. pic.twitter.com/dr4F3nSxdE
-అయితే ఈ జాబ్ మేళాకు బాపట్ల, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, నర్సారావుపేట, నర్సాపురం, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు చెందిన నిరుద్యోగులు మాత్రమే హాజరుకావాల్సి ఉంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.