హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

YSRCP Job Mela: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరో భారీ జాబ్ మేళా.. ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోండి

YSRCP Job Mela: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరో భారీ జాబ్ మేళా.. ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోండి

జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (ఫైల్ ఫొటో)

జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్వర్యంలో మరో భారీ జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించేందుకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్యర్యంలో ఏపీలో ఇటీవల భారీ జాబ్ మేళాలు (Job Mela) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారీ జాబ్ మేళాకు సంబంధించి నిర్వహకులు ప్రకటన చేశారు. వచ్చే నెల అంటే మే 7, 8 తేదీల్లో గుంటూరులో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. ఈ జాబ్ మేళాలో HCL, HDFC Bank, Hero, Hetero, Apollo Pharmacy, Avani Technology Solutions, Axis Bank, Bharat FIH, Big Basket, Byjus, Cerium Cogent, Dixon తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    రిజిస్ట్రేషన్ ఇలా..

    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://ysrcpjobmela.com/ ను ఓపెన్ చేయాలి.

    Step 2: అనంతరం Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

    Step 3: అనంతరం పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, పార్లమెంట్ నియోజకవర్గం, విద్యార్హత, ఫుల్ అడ్రస్ ను నమోదు చేసి Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

    Railway Jobs 2022: రైల్వేలో జాబ్స్‌.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    -అయితే ఈ జాబ్ మేళాకు బాపట్ల, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, నర్సారావుపేట, నర్సాపురం, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు చెందిన నిరుద్యోగులు మాత్రమే హాజరుకావాల్సి ఉంది.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, Private Jobs, Ysrcp

    ఉత్తమ కథలు