ఎస్సై పరీక్ష ఫలితాలను విడుదల చేసిన ఏపీ సీఎం జగన్.. త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన..

AP Police Exam Results: ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్సై పరీక్ష ఫలితాలను ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 22, 2019, 1:51 PM IST
ఎస్సై పరీక్ష ఫలితాలను విడుదల చేసిన ఏపీ సీఎం జగన్.. త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన..
ఎస్సై ఫలితాలను విడుదల చేస్తున్న ఏపీ సీఎం జగన్
  • Share this:
ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్సై పరీక్ష ఫలితాలను ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ రోజు అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సై సివిల్, డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు 15,409 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆర్ఎస్ఐ, ఏపీఎస్పీ పోస్టులకు 12,934 మంది, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లకు 14,823 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను త్వరలోనే తనిఖీ చేస్తామని హోమంత్రి సుచరిత ఈ సందర్భంగా వెల్లడించారు.

333 ఎస్సై స్థాయి ఉద్యోగాలకు మొత్తం 1,35,414 మంది అభ్యర్థులు పోటీపడినట్లు ఆమె తెలిపారు. మరోవైపు, పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ ఫలితాలను కూడా వారంలోగా విడుదల చేయాలని అధికారులను సుచరిత ఆదేశించారు.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>