ఇండియన్ ఎడ్‌టెక్ స్పేస్‌లోకి యూట్యూబ్ అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు వంటి సంస్థలకు గట్టి పోటీ ఎదురుకానుంది. సోమవారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2022 ఈవెంట్‌లో యూట్యూబ్ ఫ్యూచర్ ప్లాన్స్‌ను పంచుకొంది. edtech ప్రొవైడర్‌లకు తమ కంటెంట్‌ని సులువుగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ‘కోర్సెస్(Courses)’ ఫీచర్‌ను అందించనున్నట్లు తెలిపింది.
* లేటెస్ట్ ఫీచర్ కోర్సెస్
లేటెస్ట్ కోర్సెస్ ఫీచర్ పూర్తి వివరాలు ప్రకటించనప్పటికీ.. కోర్సెస్ ఆప్షన్ అనేది YouTube యాప్‌లో LMS-స్టైల్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కాంపోనెంట్‌గా కనిపిస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. కోర్సెస్ ద్వారా కంటెంట్ ప్రొడ్యూసర్స్ తమ పనికి డబ్బు సంపాదించే అవకాశం కలుగుతుంది. ఆర్గనైజ్డ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉచిత, పెయిడ్ కోర్సులను అందించవచ్చు. యూజర్లు ప్రస్తుత YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఎటువంటి యాడ్స్ లేకుండా కోర్సును వీక్షించే ఆప్షన్ ఉంటుంది.
ఇండియాలో లెర్నింగ్ వీడియోల కొరత
ఈ సందర్భంగా యూట్యూబ్ ఇండియా సీఈఓ ఇషాన్ ఛటర్జీ మాట్లాడుతూ.. యూట్యూబ్ లెర్నింగ్‌లో ఒక భాగం అయిన కోర్సెస్ ఆప్షన్ త్వరలో భారతదేశంలోని యూట్యూబ్‌లో అందుబాటులోకి వస్తుందన్నారు. దీని ద్వారా క్రియేటర్స్‌కు కొత్త మానిటైజేషన్ అవకాశాలను అందుతాయని చెప్పారు. యూట్యూబ్ లెర్నింగ్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇప్పటికే లెర్నింగ్, స్కిల్-బిల్డింగ్ మెటీరియల్‌కి ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాట్‌ఫారమ్‌గా ఉందని తెలిపారు. అయితే భారతదేశంలో లెర్నింగ్ వీడియోల కొరత ఉందని, కచ్చితంగా చెప్పాలంటే 60 మిలియన్లకు పైగా మాత్రమే ఉన్నాయన్నారు.
రెవెన్యూ- షేరింగ్ మోడల్
భారతదేశం యూట్యూబ్‌కు టాప్ ప్రయారిటీ అని ఇషాన్ ఛటర్జీ చెప్పారు. అందుకే కోర్సెస్ ట్రయల్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. డిజిటల్, ప్రొఫెషనల్, ఎంట్రప్రెన్యూరియల్, పర్సనల్ ఇంట్రెస్ట్, ఎబిలిటీస్‌కు సంబంధించి ఫ్రీ కోర్సులను యూట్యూబ్ అందిస్తుందన్నారు. ఈ ఫీచర్‌పై ఫీడ్‌బ్యాక్ పొందిన తర్వాత, మరింత విస్తరిస్తామని తెలిపారు. యూజర్లకు ఇప్పుడు పేపర్లు, ఫోటోలు, PDFలు, ఇతర మార్గాల్లో కంటెంట్ ప్రొడ్యూసర్లు కంటెంట్‌ను అందించే అవకాశం ఉందన్నారు. అందుకే వారితో రెవెన్యూ- షేరింగ్ ప్రాతిపదికన కలిసి పని చేస్తామని అన్నారు. 45–55 రెవెన్యూ-షేరింగ్ మోడల్‌గా మానిటైజేషన్ మెథడ్ ఉంటుంది. ఇతర కంటెంట్ ప్రొడ్యూసర్లకు YouTube ఉపయోగించే మోడల్ తరహాలోనే ఉంటుంది.
ఆ కంపెనీలకు షాక్
యూట్యూబ్ లెర్నింగ్ కోర్సులకు ప్లాట్‌ఫారం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అందరికీ బాగా పరిచయమైన యూట్యూబ్ లెర్నింగ్ కోర్సులను ఆర్గనైజ్డ్ మ్యానర్‌లో అందించడంపై ఫోకస్ చేసింది. దీంతో ఈ విభాగంలో ఇప్పటికే ఉన్న అన్ అకాడమీ, బైజూస్, వేతాంతు, అప్‌గ్రేడ్, ఇతర విద్యా వెబ్‌సైట్‌లపై ప్రభావం కనిపించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.