EWS Quota: విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌కు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి

EWS Quota | ఇప్పటికీ చాలామందిలో ఈడబ్ల్యూఎస్ కోటా ఎలా పొందాలి అన్న సందేహాలు, అనుమానాలున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌ పొందాలంటే 8 డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.

news18-telugu
Updated: July 1, 2019, 5:55 PM IST
EWS Quota: విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌కు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి
EWS Quota: విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌కు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 1, 2019, 5:55 PM IST
అగ్రవర్ణ పేదల కోసం ఆర్థికంగా బలహీన వర్గాల(EWS) కోటా పేరుతో విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం నిర్ణయం తీసుకుంది. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. అయితే 5 ఎకరాలకు పైగా పొలం ఉన్నా, 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం ఉన్నా, మున్సిపాలిటీల్లో 200 గజాల స్థలం ఉన్నా ఈడబ్ల్యూఎస్ కోటా వర్తించదు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నాయి. జనరల్ కేటగిరీలో ఉండే నిరుపేదలు ఈడబ్ల్యూఎస్ కోటాలో విద్య, ఉద్యోగావకాశాలను ఎక్కువగా పొందొచ్చు. ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికీ చాలామందిలో ఈడబ్ల్యూఎస్ కోటా ఎలా పొందాలి అన్న సందేహాలు, అనుమానాలున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌ పొందాలంటే 8 డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. అవేంటో తెలుసుకోండి.

1. Income Certificate: ఈడబ్ల్యూఎస్ కోటా ప్రయోజనాలు పొందాలంటే ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి రూ.8 లక్షల లోపు ఇన్‌కమ్ సర్టిఫికెట్ ఉండాలి.

2. Caste Certificate: ఈడబ్ల్యూఎస్ కోటా పొందాలంటే కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. సాధారణంగా అగ్రవర్ణాలకు చెందినవాళ్లు కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకోరు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ పొందాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాల్సిందే.

3. BPL Card: అగ్రకులాలకు చెందినవాళ్లు ఆర్థికంగా వెనుకబడ్డట్టు నిరూపించడానికి బీపీఎల్ కార్డ్ ఉపయోగపడుతుంది. దారిద్ర్యరేఖ(BPL)కు దిగువన ఉన్నవారికి ఇచ్చే కార్డు ఇది.



4. PAN Card: అన్ని ఉద్యోగాలకు, విద్యావకాశాలకు పాన్ కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కాబట్టి పాన్ కార్డు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలి.

5. Aadhaar Card: రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ తప్పనిసరి చేసింది కేంద్రం. దరఖాస్తుదారులు భారతీయులేనని నిరూపించడానికి ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. మీరు ఆధార్ కార్డు జత చేస్తే మీకు సంబంధించిన సమస్త సమాచారం ప్రభుత్వం తెలుసుకోవడానికి అవకాశముంటుంది.

6. Income Tax Return: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి. మీ ఆదాయం రూ.8 లక్షలకు మించి లేకపోతే ఆ విషయం నిరూపించడానికి ఫామ్ 16 సాయపడుతుంది.
Loading...
7. Bank Passbook: ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉంటే పాస్ బుక్ కాపీ ఉండాలి. దాంతో పాటు గత 3 నెలల్లో మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ తీసుకోవాలి.

8. Jandhan Scheme: మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ పొందాలంటే జన్‌ధన్ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం తప్పనిసరి. ఈ స్కీమ్‌లో లబ్ధిదారుల్ని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలుగా గుర్తిస్తుంది ప్రభుత్వం.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Air Force Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Indian Navy Jobs: నేవీలో 2700 ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా
First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...