Home /News /jobs /

YOU WANT TO SCORE GOOD MARKS IN NEET UG FOLLOW THE INSTRUCTIONS AND SUGGESTIONS GIVEN BELOW TPT VB

NEET UG Preparation Tips: నీట్ యూజీ ప్రిపరేషన్ టిప్స్.. తక్కువ వ్యవధిలో ఎక్కువ మార్కులకు ఈ టిప్స్ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET UG Preparation Tips: నీట్ పరీక్షకు ఉన్న వారం రోజుల వ్యవధిలో ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే కచ్చితంగా మంచి స్కోరింగ్ చేసే అవకాశం ఉందని ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్.. శ్రీధర్ అకాడమీ నిర్వాహకులు శ్రీధర్ విద్యార్థులకు సూచించారు. వారి సూచనలు, సలహాలు మీ కోసం.

ఇంకా చదవండి ...
    (GK హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18) 

    నీట్ పరీక్షకు(NEET Exam) ఉన్న వారం రోజుల వ్యవధిలో ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే కచ్చితంగా మంచి స్కోరింగ్ చేసే అవకాశం ఉందని ఐఐటి(IIT), జేఈఈ(JEE), నీట్ కోచింగ్ సెంటర్.. శ్రీధర్ అకాడమీ నిర్వాహకులు శ్రీధర్ విద్యార్థులకు సూచించారు. వారి సూచనలు, సలహాలు మీ కోసం. నీట్ లో బయాలజీ(Biology)., ఫిజిక్స్(Physics)., కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయి. మూడు సబ్జెక్టులకు మూడు భిన్నమైన విధానాన్ని అవలంబించి మార్కులు సాధించవచ్చు. ఎన్సిఆర్టి(NCERT) పాఠ్యపుస్తకాన్ని పూర్తి స్థాయిలో చదవడం సాధ్యం కాదు.... కానీ గత పదేళ్ల నీట్ టెస్ట్ పేపర్స్(NEET Test Papers) క్షుణంగా సాధన చేయండి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సాధన చేస్తే బయాలజీలో(Biology) మంచి మార్కులు(Good Score) సాధించవచ్చు. 900 వందల ప్రశ్నలను సాల్వ్(Solve) చేసే ప్రావిణ్యం మీలో ఉంటుంది. వీటిని పూర్తిగా చదవడం ద్వారా ఎన్సిఆర్టి(NCERT) పాఠ్యపుస్తకంలోని అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. రివిజన్స్ కి ఇది చాల సులభమైన మార్గం.

    NEET Botany Tips: బోటనీలో ఈ టాపిక్స్‌ ప్రిపేర్‌ అయితే చాలు.. నీట్‌(NEET)లో బెస్ట్ స్కోర్ మీ సొంతం..


    కెమిస్ట్రీ ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఫిసికల్ కెమిస్ట్రీ... ఆర్గానిక్ కెమిస్ట్రీ....ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ...గా విభజించుకుని చదువుకోవాలి.  ఈ మూడు విభాగాలకు రెండు రెండు రోజులు చదువుకోవడం ద్వారా మంచి మార్కులు వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీ న్యూమరికాల్ కాబట్టి ఫార్ములాలు ఎక్కువ కాలం గర్తుపెట్టుకునే విధంగా చదవాలి. ప్రతి ఫార్ములాకు నాలుగు నుంచి ఐదు న్యూమరికల్స్ సాల్వ్ చేసేలా ఉండాలి. దీంతో ఫిసికల్ కెమిస్ట్రీలో అన్ని టాపిక్స్ ను పూర్తి చేయవచ్చు. గ్రూప్స్ పైన ప్రత్యేక శ్రద్ద పెడితే ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మార్కులు సొంతం చేసుకోవచ్చు.

    కెమికల్ రీయాక్షన్స్ రివిజన్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రతి రీయాక్షన్స్ ను పేపర్ పై పెట్టి ప్రాక్టీస్ చేయడం ద్వారా 80% ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలను సాల్వ్ చేయవచ్చు. ఇలా చదువుకోవడం ద్వారా 30శాతం పైగా మార్కులు సంపాధించుకునే అవకాశం ఉంది.

    ఇక చివరిది ఫిజిక్స్... రోజుకు నాలుగు గంటల పాటు సాధన చేయండి. ఫిజిక్స్ న్యూమరికాల్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ (సూత్రాలు) నేర్చుకోవడం తప్పనిసరి. న్యూమరికాల్ సాల్వ్ చేయాలంటే ఫార్ములా ఒక టూల్ గా ఉపయోగ పడుతుంది. ఫార్ములా విషయంలో నిర్లక్ష్యం చేయడం ద్వారా..పరీక్షలో ఫిజిక్స్ సాల్వ్ చేయలేక సతమతం అవుతారు. ఒక్కో టాపిక్ కు సంబంధిచిన ఫార్ములాలను రాసుకోవడం ద్వారా మళ్లీ రివిజన్ చేస్తే పూర్తి స్థాయిలో ఫిజిక్స్ పై పట్టు సాధించవచ్చు. మోడల్ టెస్టులు అందరూ అట్టెండ్ అవ్వాలి.

    NEET 2022: నీట్ 2021 టాపర్లు మెడికల్ పరీక్షకు ఎలా సిద్ధమయ్యారో తెలుసా! వారి సక్సెస్ సీక్రెట్స్ ఇవే..!

    వాటిలో వచ్చే మార్కులను బేరీజు చేసుకొని.. టైం మ్యానేజిమెంట్ పై శ్రద్ధ పెట్టి.. ప్రతీ అంశాన్ని నేర్చుకోవడం ముఖ్యం. మాక్ టెస్టుల్లో  మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షా పత్రంలో పేపర్ ఈజీగా వచ్చిందని సంతోషించాల్సిన అవసరం లేదు... కష్టంగా ఉందని భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీకు ఎలా ఉందొ మిగిలిన వాళ్ళకి కూడా అలానే ఉంటుంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, JOBS, NEET, NEET 2022, Neet exam

    తదుపరి వార్తలు