హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP ICET Preparation Tips: ఈ టిప్స్ పాటిస్తే.. ఐ సెట్ లో మంచి మార్కులు మీ సొంతం..

AP ICET Preparation Tips: ఈ టిప్స్ పాటిస్తే.. ఐ సెట్ లో మంచి మార్కులు మీ సొంతం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఏపీఐసెట్(AP ICET) పోటీ పరీక్షల్లో చాలా ఈజీ అయిన పరీక్షగా చెబుతున్నారు అడారి శివ గణేష్. ఔత్సాహిక విద్యార్ధులు కచ్చితమైన ప్రదర్శన చేస్తే.. రెండు వందల మార్కుల్లో దాదాపు 190రావడం ఈజీయే.

(ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్ 18)

ఏపీఐసెట్(AP ICET) పోటీ పరీక్షల్లో చాలా ఈజీ అయిన పరీక్షగా చెబుతున్నారు అడారి శివ గణేష్. ఔత్సాహిక విద్యార్ధులు కచ్చితమైన ప్రదర్శన చేస్తే.. రెండు వందల మార్కుల్లో దాదాపు 190రావడం ఈజీయే. అయితే అది ఏ ఫార్మాట్ లో చదవాలి. ఏ పాఠం నుంచీ చదవాలి వంటివి చాలా ముఖ్యం. ఏపీఐసెట్ (APICET) పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి అంటే అర్ధమేటిక్స్ అండ్ రెజైనింగ్ (Arithmetic and reasoning) పైన ప్రత్యేక దృష్టి సారించాలి. మేథమెటిక్స్‌లో బేసిక్స్ మరియు షాట్ కట్స్ విధానంపైన దృష్టిపెట్టి ప్రాక్టీస్‌ చేస్తే ఎగ్జామ్‌ హాల్‌ (Exam Hall) లో టైం సేవ్‌ (Time save) అవుతుంది. సమయం ఎక్కువగా తీసుకునే కమ్యూనికేషన్ ఎబిలిటీ సబ్జెక్ట్ ను పరీక్షలో చివర్లో రాస్తే మంచిది. అయితే ప్రతి ప్రశ్నకు ఎంత సమయం ఇస్తామన్నదే ముఖ్యమంటున్నారు శివగణేష్.

అయ్యబాబోయ్.. చైనా వాళ్లు మళ్లీ భయపెట్టేస్తున్నారు..! ఈసారి కరోనా‌తో కాదు అదేదో కొత్త రకం ఐస్‌క్రీమ్‌తో.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?


ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కాస్తంత టిప్స్ ను పాటిస్తే మంచి మార్కులు సాధించవచ్చు. సాధరణంగా ఐసెట్ 200 మార్కులకు పేపర్ ఉంటుంది. పరీక్షా సమయం 150 నిమిషాలు. ఇందులో సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 ఉంటాయి. సెక్షన్ 1లో లాజికల్ రీజనింగ్, సెక్షన్ 2లో మ్యథ్స్, సెక్షన్ 3లో వెర్బల్ ఎబిలిటీ ఉంటాయి. ఇవి కూడా వివిధ మోడళ్లను అనుసరించి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి.  ఇక సెక్షన్ ఒకటి నుంచీ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో డేటా సఫిషియన్సి, 1 నుంచీ 20 ప్రశ్నలు ఉంటాయి. ఇవి కాస్త టఫ్. తర్వాత నంబర్ సిరీస్ అనాలజీ  నుంచీ 15 ప్రశ్నలు వస్తాయి.

వీటిలో కనీసం 10 కొట్టేయొచ్చు. వీటి తర్వాత ఫెటన్ సిరీస్, అనాలజీ నుంచీ కూడా ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఆడ్ మేన్ అవుట్ నుంచి పది మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. అలాగే కోడింగ్ డి కోడింగ్ నుంచీ కూడా 10 మార్కులు వస్తాయి. డేటా అనాలసిస్ వరకూ 10 మార్కులు. ఇక బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, క్లాక్స్, కేలండర్స్ వరకూ అన్నీ ఊడా 15 మార్కులకు కవర్ అవుతాయి.  ఇక సెక్షన్ 2లో మ్యాథ్స్ ఉంటుంది. అర్థమెటిక్ 35 ప్రశ్నలు, ప్యూర్ మ్యాథ్స్ 10 మార్కులు, స్టాటస్టిక్స్ అండ్ ప్రొబబిలిటీ నుంచీ 10 మార్కులకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఈ మూడు సరిగ్గా చదవగలిగితే ఆల్మోస్ట్ 55 నుంచి 40 మార్కులు ఇక్కడ నుంచి పొందవచ్చు.

ఒకవేళ వీటిలో కష్టమైనవి కనిపిస్తే మాత్రం వదిలేయడం బెటర్. బాగా తెలిసినప్పుడు మాత్రం వీటిని ఎటెంప్ట్ చేయాలి. ఇక సెక్షన్ 3 నుంచీ వెర్బల్ ఎబిలిటీ నుంచీ ఉంటాయి. వీటిలో వొకాబులరీ, రీడింగ్ పేసేజ్, మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. అంటే vocabulary నుంచి 15, reading comprehension నుంచి 20 మార్కుల ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఫంక్షనల్ గ్రామర్, 20 ప్రశ్నలు, కంప్యూటర్ బిజినెస్ టెర్మినాలజీ నుంచీ 20. మొత్తం కలిపి 35 ప్రశ్నలు ఉంటాయి. వీటిని పక్కాగా ఎటెంప్ట్ చేయగలిగితే మంచి ర్యాంకు సాధించినట్టే.

Amazon Prime Sale: అమెజాన్ లో అద్భుత ఆఫర్లు.. రూ. 99లకే వస్తువులు.. ల్యాప్ టాప్స్ పై 75 శాతం రాయితీ..


ఇక టైం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ప్రధానం సెక్షన్ 1 కి 50 నిమిషాలు సమయం ఇవ్వాలి. తర్వాత సెక్షన్ 2 కి 60 నిమిషాలు ఇవ్వాలి. తర్వాత ఇంగ్లిష్ కి 30 నిమిషాలు ఇవ్వాలి. అలాగే మిగతా అంతా కవర్ చేయడానికి 10నిమిషాలు సరిపోతాయి. సెట్ పరీక్షకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది విద్యార్ధులకు చాలా పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి మీ మొత్తం ఎంపికలు అయిపోయిన తర్వాత చివరి పది నిమిషాలు ఏదో ఒక ప్రశ్నకి.. సమాధానం ఇచ్చే వదిలేయాలి. ఐసెట్‌ పరీక్షకు ఎలాంటి నెగిటివ్‌ మార్కింగ్ లేదు.


కనుక మొదటి 5 నిముషాల్లో క్వశ్చన్‌ పేపర్‌ను పూర్తిగా చదివి..క్విక్‌ ఆన్సర్స్‌ మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్నలకు ఎంత టైం కేటాయించాలి అన్న విషయం విద్యార్థులకు అర్ధం అవుతుందంటున్నారు. మీకు వచ్చిన సమాధానాలు అన్ని పూర్తి చేసిన తర్వాతే.. మిగిలిన వాటికి ఆన్సర్స్ రాస్తే అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుందంటున్నారు.సాధ్యమైనంతలో ఆఖరి 15 నిమిషాలు ..తప్పులు సరిదిద్దుకోవటంలో కేటాయించాలంటున్నారు. పరీక్షకు ముందు ఎలాంటి కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకూడదంటున్నారు. బేసిక్ మ్యాథమెటిక్స్ మీద షార్ట్‌కట్స్ ఎక్కువగా నేర్చుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఓల్డ్ పేపర్స్ రివిజన్ బాగా సహాయపడుతుందన్నారు. టైమర్ సెట్ చేసుకొని పాత పేపర్స్ పైన ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో సులువుగా ఉంటుంది.

First published:

Tags: Career and Courses, I cet, Icet preparation, JOBS, Tips

ఉత్తమ కథలు