Home /News /jobs /

YOU WANT TO GET MORE MARKS IN TELANGANA EAMCET FOLLOW THE EXPERT ADVICE AS MENTIONED HERE VB KNR

TS EAMCET Preparation Tips: మ్యాథ్స్ పై పట్టు సాధిస్తే.. ఎంసెట్ లో ర్యాంక్ సులువే.. నిపుణుల సలహాలు, సూచనలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

చాలా మంది ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఇంటర్(Inter) తరువాత ఎం చేద్దాం అని ఆలోచిస్తుంటారు. ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం  ఎంసెట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

    చాలా మంది ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఇంటర్(Inter) తరువాత ఎం చేద్దాం అని ఆలోచిస్తుంటారు. ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం  ఎంసెట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఇంజినీరింగ్(Engineering), డాక్టర్స్(Doctors) కావాలన్నా.. ఉన్నత విద్యలో రాణించాలన్నా ఎంసెట్ పరీక్ష (Eamcet Exam) తప్పని పరిస్థితి. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు(Intermediate Students) ఎక్కువగా ఎంసెట్(Eamcet)కు ప్రిపేర్ అవుతుంటారు. మరి ఎంసెట్ కే ప్రిపేర్ అయ్యే వారు ఎక్కువగా మ్యాథ్స్ పై(Mathes) దృష్టి పెడితే 80 మార్కులు కచ్చితంగా మనవే అంటున్నారు  Sr విద్యా సంస్థల సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ వి రాజేశ్వర్ సార్. ఎంసెట్ లో మ్యాథ్స్ సబ్జెక్టులతో ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చదవాలి.. ఎం ఎం సిలబస్ నుండి ఎక్కువగా మార్కులు వస్తాయో ఒకసారి చూద్దాం.

    Agnipath Agniveers Salaries: అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల.. అగ్నివీరులకు వేతనం ఎంతో తెలుసా?


    ఎక్కువగా ఎంసెట్ లో మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి నాలుగు టాపిక్స్ పై అడుగుతున్నారు. అవి..1)అల్జీబ్రా 2) కో- ఆడినెట్ జామెట్రి 3)కాలుక్లేస్, 4)త్రికోణమితి. ఈ నాలుగు టాపిక్స్ లల్లో ఒక్కొక్క టాపిక్స్ నుండి 20మార్కుల ప్రశ్నలు అడుగుతారు. ఆలా 20×4=80 మార్కులు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద పోకస్ చేస్తే సరిపోతుంది అని నిపుణులు అంటున్నారు.

    మిగతా మార్కుల కోసం కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదివితే 20మర్క్స్ వస్తాయి. మ్యాథ్స్ 80.ఇవి 20కలుపుకుంటే 100మర్క్స్ వస్తాయి కాబట్టి.. ఎంసెట్ పరీక్షలలో టాప్ ర్యాంక్స్ సాధించవచ్చని సీనియర్ ఫ్యాకల్టీ రాజేశ్వర్ సార్ అంటున్నారు . మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీ లో సీటు వస్తుంది. మంచి భవిష్యత్తుకు కూడా బంగారు బాటలు వేసుకోవచ్చు.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ అవకాశం మరో ఏడాది పొడిగింపు


    ఎంసెట్ కు లక్షల్లో పోటీ పడుతుంటారు . సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడం లేదు . ఉన్నతమైన భవిష్యత్తు త్వరగా ఉద్యోగం సంపదించాలంటే.. ఎంసెట్ భవిష్యత్తు ను డిసైడ్ చేస్తుంది . అందుకే ఎంసెట్ లో మంచి రాంక్ సాధించాలంటే మాత్రం ఈ పై నాలుగు టాపిక్స్ ఎక్కువగా చదవాలి. ఒకటికి రెండు సార్లు రివైస్డ్ చేసుకోవాలి. ఎంసెట్ ఎగ్జామ్స్ కు సమయభావం తక్కువ ఉంది కాబట్టి ప్రిపరేషన్ లో కొత్త టాపిక్ జోలికి వెళ్లకుండా మీరు నేర్చుకున్న దానిలో నైపుణ్యం పెంచుకోవాలి. ఎక్కువ మోడల్ టెస్ట్ లు, మాక్ టెస్ట్ లు రాయాలి.

    ఇది చదవండి: జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఏపీ.. పెట్టుబడుల్లో టాప్.. జగన్ సర్కార్ సరికొత్త రికార్డు..


    కనీసం రోజు కు ఒకటి నుండి రెండు మోడల్ టెస్ట్ పరీక్షలు రాయాలి . ఆలా రాయడం వలన పరీక్షలు త్వరగా ఎలా రాయాలో అవగాహనా వస్తుంది . అంతే కాకుండా మీరు ఏ సబ్జెక్టు లో వెనుక ఉన్నారో తెలుసుకొని ఆ సబ్జెక్టుపై నైపుణ్యం పెంచుకొవడం వలన .. దాదాపు వంద మార్కులకు పైన సాధించవచ్చని ఇలా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ పోతే ఎంసెట్ ఓ మంచి రాంక్ సాధించవచ్చని రాజేశ్వర్ సార్ అంటున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, JOBS, Students, Ts eamcet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు