ఎంసెట్(Eamcet).. ఇంజనీరింగ్(Engineering), మెడికల్(Medical), అగ్రికల్చర్(Agriculture) విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ(Bachelor Degree) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష(Entrance Exam). ఇంటర్మీడియెట్ ఎంపీసీ(MPC)/బైపీసీ(BiPC) విద్యార్థుల లక్ష్యం.. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో(Colleges) ప్రవేశాల కోసం రెండు రాష్ట్రాలు విడివిడిగా ఎంసెట్ పరీక్షను(Exams) నిర్వహిస్తున్నాయి. ఏపీ ఎంసెట్(AP Eamcet), తెలంగాణా ఎంసెట్(Telangana Eamcet) లను రాసి రెండు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు విద్యార్ధులంతా ఎంసెట్ కు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎంసెట్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ఎలా మంచి మార్కులు సాధించాలో ఇక్కడ చూద్దాం..
ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవాలన్నా.. సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా.. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్ తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మంది చూపు ఇంజినీరింగ్ పైనే ఉంటుంది. అందుకే ఏటా ఇంజినీరింగ్‌కు ఎంసెట్‌కు లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఓవైపు ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు.
ఉన్నతమైన భవిష్యత్తుకు త్వరగా ఉద్యోగం సంపాదించడానికి ఇంజనీరింగ్ సులువైన మార్గం. అందుకే తల్లిదండ్రుల్లోనూ ఇంజినీరింగ్ అంటే ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఇలా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధులు జేఈఈ మెయిన్, ఎంసెట్ లాంటి పరీక్షల కోసం సన్నద్దమవుతారు. జేఈఈ జాతీయ స్ధాయి పరీక్ష కాగా, రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చదవాలనుకునే వారికి ఎంసెట్ రాయాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియట్ లో చేరిన తొలిరోజు నుంచే విద్యార్ధులు.. ఎంసెట్ ప్రిపరేషన్ ప్రారంభిస్తారనడంలో సందేహం లేదు. రెండు రాష్ట్రాల్లో లక్షల మంది ఎంసెట్ ఆశావహులున్నారు. ఇంటర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ కావాలనుకునే విద్యార్ధులంతా ఎంసెట్ కోసం ఇంటర్ తొలి సంవత్సరం నుండే .. ఎంసెట్ ప్రిపేర్ అవుతుంటారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించడం అనే ఆలోచనలతో విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇంటర్ సిలబస్‌పై పట్టు సాధిస్తే ఎంసెట్ గురించి ఆందోళన చెందనవసరం లేదని నిపుణులు అంటున్నారు.
ఇక ఈ ఏడాది కూడా కోవిడ్ కారణంగా తగ్గించిన సిలబస్ నుండే ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. కాబట్టి ఎంసెట్ కు కూడా అదే సిలబస్ నుండి వచ్చిన టాపిక్స్ ను చదివితే సరిపోతుంది. సిలబస్ లో లేని సబ్జెక్స్స్, టాపిక్స్ ను వదిలిపెట్టేయాలి. ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ లో ఫిజిక్స్ , కెమిస్ట్రీ, మ్యాధమేటిక్స్ నుండి తగ్గించిన సిలబస్ ను చూసుకొని, అందులో ఏ చాప్టర్ నుండి, ఏ టాపిక్స్ వస్తున్నాయో దాని ప్రకారం చదివితే.. తక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి..
ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించాలన్నా, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు సాధించాలన్నా.. ప్రిపరేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
1) ఎంసెట్ అభ్యర్థులు ఇంటర్ పరీక్షల తర్వాతే ఎంసెట్‌కు ఉపక్రమించాలి.
2) ఇంటర్ ఎగ్జామ్స్ అనంతరం 10 నుండి 12 రోజులు ఫస్ట్ ఇయర్ సిలబస్ కోసం, 10 నుండి 12 రోజులు సెకండ్ ఇయర్ సిలబస్ కోసం కేటాయించాలి. టాపిక్స్ ను రివిజన్ చేసుకోవాలి. ఫార్ములాలు, కాన్సెప్ట్ లు, సినాప్సిస్ లపై ధ్యాస పెట్టాలి.
3) ఎంసెట్ ఎగ్జామ్ కు టైం దగ్గర గా ఉంది కాబట్టి ప్రిపరేషన్ లో కొత్త టాపిక్స్ జోలికి వెళ్లకుండా మీరు నేర్చుకున్న దానిలో పరిపూర్ణత సాధించండి. ఇంటర్ లో అకడమిక్ పరంగా క్లిష్టంగా భావించి విస్మరించిన అంశాల జోలికి వెళ్లకూడదు.
4) ముఖ్యంగా రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్స్‌కు ఎక్కువ టైమ్ కేటాయించాలి.
5) ఎంసెట్ ప్రిపరేషన్లో సమయపాలన చాలా ముఖ్యం. గంటల కొద్దీ ఒకే టాపిక్‌ను చదవకుండా.. ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా సమయం కేటాయించాలి. ఇందుకోసం గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.
6) రోజూ పది నుంచి 12 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా పక్కాగా టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలి.
7) ఎంసెట్‌లో దాదాపు ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. అవి ఇన్‌డెరైక్ట్‌గా ఆయా భావనల ఆధారంగా ఉంటాయి. దీన్ని గుర్తించి కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. అందుకు తగిన విధంగా స్టడీ మెటీరియల్ సిద్దం చేసుకోవాలి
8) అకాడమీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ చివరలో ఇచ్చిన ప్రాక్టీస్ ప్రశ్నలు, ఆయా అధ్యాయాల్లో హైలైట్ చేసిన అంశాలను కచ్చితంగా చదవాలి.
9) టేబుల్స్; చార్ట్స్; పాయింటర్స్ రూపొందించుకోవడం వల్ల సమయం ఆదా చేసుకోవచ్చు.
10) ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. ఎంసెట్ సిలబస్ ఆధారంగా ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంశాల ప్రిపరేషన్‌కు నిర్దిష్ట టైమ్ ప్లానింగ్ అనుసరించాలి.
11) ప్రిపరేషన్ సమయంలోనే వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్ లు వ్రాయండి. కనీసం రోజుకు ఒకటి, రెండు మాక్ టెస్ట్ లు వ్రాయాలి. ఆలా వ్రాయటం వల్ల ఎంసెట్ ను త్వరగా ఎలారాయాలో అవగాహన వస్తుంది. అంతే కాకుండా మీరు ఈ సబ్జెక్టు లో వీక్ గా ఉన్నారో తెలుసుకొని ఆ సబ్జెక్టు లో ఇంప్రూవ్ కావచ్చు. కాన్సెప్టులను అవగాహన చేసుకొని మాక్ టెస్ట్ లు వ్రాయటం వలన సుమారు వంద మార్కులకు పైన సాధించవచ్చు.
12) ఎంసెట్ ఇంజనీరింగ్ లో మ్యాధ్స్ 80 మార్కులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 40, 40 మార్కులతో మొత్తం 160 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.
13) మెడికల్ విభాగంలో జువాలజీ 40, బోటనీ 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మొత్తం 160 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. కాబట్టి ఆయా సబ్జెక్టులలో ఏ చాప్టర్ నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకొని, ఆ చాప్టర్ పై ఎక్కువ పట్టు సాధించాలి
14) చాప్టర్ల వారీ గా కొన్ని పరీక్షలు రాయడం, గ్రాండ్ టెస్ట్ లు రాయడం అవసరం. దీని ద్వారా అప్పటికే ప్రిపేర్ అయిన్ చాప్టర్ లలో లోపాలను సరిదిద్దుకోవచ్చు.
17) పరీక్షకు వారం ముందు కొత్తవి చదవడానికి ప్రయత్నించకండి. చదివిన వాటిని పునశ్చరణ చేసుకుంటూ ముఖ్యమైన ఫార్ములాలు, ప్రిన్సిపల్స్, డెఫినిషన్స విడిగా క్విక్ రిఫరెన్‌సకు రాసుకోండి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.