(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ ప్రతినిధి, న్యూస్ 18)
భారీ వర్షాల కారణంగా.. నేటి నుంచి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష(Eamcet Agriculture Exam) వాయిదా పడింది. కానీ.. ఇంజనీరింగ్(Engineering) కొరకు నిర్వహించే పరీక్ష(Exam) మాత్రం యథావిధిగా జూలై 18 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఎగ్జామ్ కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కెమిస్ట్రీలో(Chemistry) మంచి స్కోర్ సాధించాలంటే.. ఎలా ప్రిపేర్ అవ్వాలి.. అనే విషయాలను మహబూబ్ నగర్ ప్రతిభ జూనియర్ కాలేజి కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు (Teacher) రాంచరణ్ నాయక్ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటి గురించి తెలుసుకుందాం.
బైపీసీ, ఎంపీసీ(MPC) స్టూడెంట్స్ ఎంసెట్ రాయబోయే స్టూడెంట్స్ కి ఈజీ స్కోరింగ్ సబ్జెక్టు కెమిస్ట్రీ. కెమిస్ట్రీని మూడు భాగాలుగా చేసుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ(Organic Chemistry), ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ(In Organic Chemistry) అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ(Physical Chemistry). ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పిరియాడిక్ టేబుల్(Periodic Table) కెమికల్ బాండింగ్ టాపిక్స్(Chemical Bonding Topics) చాలా ఇంపార్టెంట్(Important). ఈ రెండు టాపిక్ ల నుంచి ఎంసెట్లో మినిమం మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ చదవడం వల్ల 25 శాతం కాన్సెప్ట్ కవర్ అవుతాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ స్కోరింగ్. సబ్జెక్టు ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. ఇందులో నుంచి 2 బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది.
ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్టు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నేమ్ రియాక్షన్ గురించి అడిగే అవకాశం ఉంది. మూడు నుంచి 20 వరకు రియాక్షన్స్ నేమ్స్ ఉంటాయి. వాటిని రివైజ్ చేసుకొని చదువుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అనే టాపిక్స్ ని రివైజ్ చేసుకోవాలి. వీటిని కేటగిరి వైస్ చేసుకుని ఈ ప్రశ్నలను ప్రిపేర్ అవ్వాలి. టాపిక్ వైస్ గా చదివితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కేటగిరీ ప్రకారం డివైడ్ చేసుకుని చదవడం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
కేటగిరి వైస్ అనగా ఎగ్జాంపల్ ఆల్సీన్స్ ఆక్సిడేషన్ జరగడం వలన ఏ ప్రోడక్ట్ వస్తాయి. హాల్టికెట్స్ ఆక్సిడేషన్ వలన ఏ ప్రోడక్ట్ వస్తాయి. అలాగే కీటోన్స్ ఆక్సిడేషన్ వలన ఏ ప్రోడక్ట్స్ వస్తాయి.. అనేది గుర్తుపెట్టుకోవడం వలన ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అలాగే రిడక్షన్ రియాక్షన్స్ గురించి కూడా గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది . ఈ విధంగా చేయడం వలన కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఫిజికల్ కెమిస్ట్రీ లో ఆటోమిక్స్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మేటర్ ,ఈక్విలిబ్రీయం ఆసిడ్స్ మరియు బేసెస్ ఉంటాయి. సెకండ్ ఇయర్ లో సొల్యూషన్స్ అండ్ సాలిడ్ స్టేట్స్ కెమికల్ క్యానిటిక్స్ ఫార్ములాస్ ని అన్నింటిని ఒకసారి రెండు రోజుల ముందు రివైజ్ చేసుకోవాలి, అలాగే జనరల్ టాపిక్స్ అయినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ వయోమాలిక్యుల్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. అందులో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్ మీద ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కెమిస్ట్రీలో 25 బిట్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు.
ఈజీగా స్కోర్ చేసుకోవడానికి చదవాల్సిన లెసెన్స్ ఏంటంటే,, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పిరియాడిక్ టేబుల్ కెమికల్ బాండింగ్ S బ్లాక్ అండ్ P బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రో కార్బన్స్ గురించి చదవాలి. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో ఓన్లీ ఫార్ములాస్ వరకు రివైజ్ చేసుకోవడం వలన స్కోరు సాధించవచ్చు. లెన్తీ టాపిక్స్ అయినటువంటి ఎలక్ట్రో కెమిస్ట్రీ వంటి టాపిక్స్ ని లాస్ట్ కి ప్రయారిటీ ఇవ్వండి, ముందుగానే వీటికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అని రాం చరణ్ నాయక్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Ts eamcet, TS EAMCET 2022