(M. Balakrishna, News 18, Hyderabad)
ప్రస్తుతం తెలంగాణా లో గురుకుల పోస్టులకు ఆర్థిక శాఖ(Finance Ministry) నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే ఈ నోటిఫికేషన్(Notification) వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అసలు ఎస్జీటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మన స్టడీ ప్లాన్ ను(Study Plan) ఎలా రూపోందించుకోవాలి? సబ్జెక్టలవారీగా ఎన్నేన్ని మార్కులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్(Current Affairs) లో మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి వీటికి గాను 10 మార్కులు ఉంటాయి. నోటిఫైడ్ లో 20 ప్రశ్నలు ఉంటాయి వీటికి కూడా 10 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్-I (భారతీయ భాషలు) లాంగ్వేజ్ I & II సిలబస్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం, లాంగ్వేజ్లోని అంశాలు, కమ్యూనికేషన్(Communication) విభాగాల్లో మొత్తం 18 ప్రశ్నలకు 9 మార్కులు ఉంటాయి.
లాంగ్వేజ్ –II (ఇంగ్లీష్) లో మొత్తం 18 ప్రశ్నలకు గాను 9 మార్కులు ఉంటాయి. గణితం లో మొత్తం 18 ప్రశ్నలకు గాను 9 మార్కులు ఉంటాయి. సైన్స్ లో మొత్తం 18 ప్రశ్నలకు గాను 9 మార్కులు ఉంటాయి. సామాజిక అధ్యయనాలు లో కూడా మొత్తం 18 ప్రశ్నలకు గాను 9 మార్కులు ఉంటాయి. టీచింగ్ మెథడాలజీ సిలబస్ లో మొత్తం 30 ప్రశ్నలకు 15 మార్కులు ఉంటాయి. అయితే ఈ పరిక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటే వాటికి 80 మార్కులు ఉంటాయి.
ప్రాథమిక సంఖ్య సిద్ధాంతం: సంఖ్యా వ్యవస్థ (N, W, Z, Q, R) సంఖ్య అండ్ సంజ్ఞామానం, సంఖ్యా రేఖపై సంఖ్యల ప్రాతినిధ్యం, స్థాన విలువ, సంఖ్యల లక్షణాలు, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు లతోపాటు వాస్తవ సంఖ్యలు క్యూబ్ మూలాలు వాటి సంగ్రహణ వర్గమూలాలు, కారకం పద్ధతి, సర్డ్స్ సంయోగ రకాలు నుంచి చాలా వరకు ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటు చాలా ప్రశ్నలు 5 వ తరగతి నుంచి 10 తరగతి వరకు మనం చదువుకున్న పాఠ్యపుస్తకాల నుంచి వస్తాయి.
దీంతోపాటు కరెంట్ అఫైర్స్ , సామాజీక అంశాలపై కూడా చాల ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా మెథ్మెటిక్స్ లో నుంచి వచ్చే ప్రశ్నల్లో మంచి మార్కులు సాధించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. సబ్జెక్ట్స్ వారిగా ప్రీపేర్ అవుతున్నప్పటికి సరైన పద్దతి లో రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు చదువుకు కేటాయించినట్లైయితే మంచి మార్కులు ఈ పరిక్షల్లో స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exam Tips, JOBS, Sgt preparation