(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ ప్రతినిధి, న్యూస్ 18)
తెలంగాణలో భారీ వర్షాల (Telangana Heavy Rains) నేపథ్యంలో ఎంసెట్ (Telangana EAMCET) అగ్రికల్చర్ పరీక్ష వాయిదా పడింది. రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేయడంతో.. జులై 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ (TS EAMCET 2022) అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కేవలం అగ్రికల్చర్ పరీక్ష (TS EAMCET Agriculture Exam)ను మాత్రమే వాయిదా వేస్తున్నామని.. జులై 18 నుంచి 20 వరకు జరగాల్సి ఉన్న ఇంజినీరింగ్ పరీక్షల(TS EAMCET Engineering Exam)ను యథావిధిగా నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. వాయిదా పడిన అగ్రికల్చర్ పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఉన్న విద్యామండలి తెలిపింది.
అయితే ఈ ఎగ్జామ్ కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో ముఖ్య భాగమైన మ్యాథమేటిక్స్ లో ఎలాంటి టాపిక్స్ చదవాలి.. దేని నుంచి ఎక్కువ మార్కలు వస్తాయి.. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలను మహబూబ్ నగర్ ప్రతిభ జూనియర్ కళాశాల మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడు రామకృష్ణ మూర్తి విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. తెలంగాణ ఎంసెట్ పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు ఇక్కడ చెప్పే కొన్ని ట్రిక్స్ పాటిస్తే.. పరీక్షలో మంచి మార్కులు వస్తాయని తెలిపారు. దానితోపాటు పరీక్ష సమయం వృథా కాకుండా ఏం చేయాలి అనే విషయాలను కూడా పంచుకున్నారు.
ఎంపీసీ స్టూడెంట్స్ కి మ్యాథమేటిక్స్ లో మొత్తం 80 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. మ్యాథమెటిక్స్ కి సంబంధించిన ఫార్ములాస్ ని చాలా క్లియర్ గా నేర్చుకోవాలి. ఎగ్జామ్ కు వెళ్లే ముందు అన్ని టాపిక్స్ కి సంబంధించిన సెనాప్సిస్ ను మరియు ఫార్ములాస్ ని రివైజ్ చేసుకోవాలి. వెక్టార్స్ పైన ఐదు ప్రశ్నలు అని అనుకుంటున్నారు మాత్రికల నుంచి మూడు ప్రశ్నలు మరియు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ పైన నాలుగు ప్రశ్నలు రావచ్చు. మేజర్ గా మాట్రిసిస్ టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మరియు వెక్టార్స్ టాపిక్ ని బాగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఈజీగా 15 ప్రశ్నలు సమాధానం ఇవ్వగలము. అదేవిధంగా పేపర్ వన్ బి లో స్ట్రేట్ లైన్ చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు. లిమిట్స్ టాపిక్ నుంచి మూడు ప్రశ్నలు. డెరివేటివ్స్ నుంచి మూడు ప్రశ్నలు.
ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవే కాకుండా.. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ చాప్టర్స్ పైన కాన్సెంట్రేట్ చేయడం వలన ఈజీగా 15 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలము. 2-A నుంచి క్వాడ్రియాటిక్ ఎక్స్ప్రెషన్ లో మూడు ప్రశ్నలు. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో రెండు ప్రశ్నలు. డెమో యాడ్స్ తీరం మరియు కాంప్లెక్స్ నంబర్స్ లో నాలుగు ప్రశ్నలు . ప్రాబబిలిటీలో నాలుగు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ టాపిక్స్ పైన బాగా శ్రద్ధ పెట్టి చదివితే.. ఈజీగా 15 ప్రశ్నలకు సమాధానాలు చేయగలము.
సర్కిల్స్ నుంచి ఐదు ప్రశ్నలు. పారాబోలా ఎలిప్స్ మరియు హైపర్బోలా నుంచి ఐదు ప్రశ్నలు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మరియు ఇండిపెండెంట్ ఇంటిగ్రేషన్ నుంచి మూడు ప్రశ్నలు. డిఫరెంట్ ఇంటిగ్రేషన్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ టాపిక్స్ ని కవర్ చేయడం వలన ఈజీగా 15 ప్రశ్నలకు సమాధానాలు చేయవచ్చు. ఈ విధంగా చదవగలిగితే మ్యాథమెటిక్స్ సబ్జెక్టును ఈజీగా స్కోర్ చేయవచ్చు. ముఖ్యంగా ఫార్ములాస్ ని రివైజ్ చేయడం వలన 40 ప్రశ్నలకు సమాధానాలను అవలీలగా సాధించవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ అయ్యి పరీక్ష కేంద్రానికి వెళ్లి మంచి ఆలోచనతో రాసి మంచి మార్కులు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను అని మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడు రామకృష్ణ మూర్తి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Preparation, Ts eamcet, TS EAMCET 2022