Home /News /jobs /

YOU PREPARE ACCORDING TO THIS PLAN YOU CAN GET A GOOD SCORE IN CUET THE DETAILS OF THAT PREPARATION HERE BK VB

CUET Preparation Tips: సీయూఈటీ పరీక్ష కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? మీ కోసం ఈ చిట్కాలు..

CUET Preparation Tips: సీయూఈటీ పరీక్ష కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? మీ కోసం ఈ చిట్కాలు..

CUET Preparation Tips: సీయూఈటీ పరీక్ష కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? మీ కోసం ఈ చిట్కాలు..

CUET పరీక్ష కు ఎలా చదువుకోవాలి? అనే అంశంపై మెజారిటీ విద్యార్ధుల అయోమయానికి గురవుతారు ఎందుకంటే ఈ ప‌రిక్ష‌కు సంబంధించి టిప్స్ చెప్పే నిపుణులు చాలా త‌క్కువ మంది ఉంటారు కాబ‌ట్టి. CUETలో ఉత్తీర్ణత సాధించడానికి చిట్కాలు నిపుణుల స‌ల‌హాలు మీకు చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ స్టోరీ ఉద్దేశం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (M.Balakrishna,News18,Hyderabad)

    అభ్యర్థులు ఈ ప‌రీక్ష‌లో విజయం(Success) సాధించడానికి సరైన CUET పరీక్షా వ్యూహాన్ని రూపోందించుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా కష్టపడి పనిచేయాలి. పరీక్షకు(Exam) సన్నద్ధమయ్యే ప్రతి దశలోనూ తమ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌గ‌ల‌గాలి. ప్రిపరేషన్ వ్యూహం(Preparation), చిట్కాలు ఇప్పుడు చూద్దాం. ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమయ్యే మొదటి దశ పరీక్ష మొక్క స‌రిళికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం. పరీక్షా సరళి పరీక్ష నిర్మాణం, సిలబస్(Syllabus), ప్రశ్నల సంఖ్య, సంబంధిత మార్కులను(Marks) నిర్దేశిస్తుంది.  CUET పరీక్షలో  180 ప్రశ్నలతో  180 మార్కులతో నిర్వ‌హించే ఒక‌ కంప్యూటర్(Computer) ఆధారిత పరీక్ష అనే విష‌యాన్ని గుర్తొంచుకొండి. పూర్తి CUET సిలబస్ తెలుసుకోండి.  CUET పరీక్షా వ్యూహం కోసం సిద్ధమవుతున్నప్పుడు మొత్తం సిలబస్‌ను అర్థం చేసుకోవడం చాలా కీలకం.

    Agniveer Jobs: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ప్రిపరేషన్ టిప్స్ ఏంటి..? తెలుసుకోండి..


    ప్రధాన విషయ పరిజ్ఞానంతో పాటు, CUET పరీక్షా సిలబస్‌లో సంఖ్యా పరీక్ష సామర్థ్యం, తార్కిక సామర్థ్యం, సాధారణ జ్ఞానం, కంప్యూటర్, లిట‌రేచ్చ‌ర్ తోపాటు బోధనాశాస్త్రం వంటి అనేక అంశాలు ఇంగ్లీష్ మరియు హిందీలో స‌బ్జెట్స్ నుంచి చాలా ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఇదే విష‌యాన్ని గుర్తుపెట్టుకొండి. CUET పరీక్ష సిలబస్ తెలుసుకోవడం అభ్యర్థులకు ఏ అంశాలపై దృష్టి పెట్టాలి ఎలా చ‌ద‌వాలి అనే అంశాల‌పై ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహాన క‌లిగి ఉండ‌డం చాలా ముఖ్యం. సరైన వ్యూహాన్ని అభివృద్ధి చేయండి. మీరు పరీక్షా సరళితోపాటు సిలబస్‌ను అర్థం చేసుకున్న తర్వాత, CUET పరీక్ష తయారీలో మ‌రో ముఖ్య‌మైన ప‌ని మ‌న‌ బలాలు మరియు బలహీనతలను పరిగణనలోకి తీసుకునే పరీక్షా వ్యూహాన్ని రూపొందించడం.



    మంచి గ్రేడ్‌లు సాధించడానికి మ‌న‌కు ప‌ట్టు ఉన్న అంశాల్లో తప్పనిసరిగా ప్రావీణ్యం పొందాలి. అయితే పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలను మెరుగుపరచడానికి మ‌నం బలహీనంగా ఉన్న అంశాల్లో మెరుగుపరచాలి. CUET పరీక్ష ప్ర‌స్తుతం ఉన్న అన్ని పరీక్షలలో ఇది చాలా ముఖ్యమైనది. తగిన ప్రిపరేషన్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా మంచి CUET పరీక్ష స్టడీ మెటీరియల్ Pdfని ఉపయోగించాలి. అభ్యర్థులు మీకు ద‌గ్గ‌ర‌ల్లో ఉన్న‌ ఏదైనా బుక్ షాప్ లలో కొనుగోలు చేసిన లేదా ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేసిన ప‌ర్వాలేదు కాని త‌ప్ప‌ని స‌రిగా మీకు ఉప‌యోగ‌ప‌డే సిల‌బ‌స్ ను మాత్రం ఫాలో అవ‌డం మ‌ర్చిపోకూడదు.
    Published by:Veera Babu
    First published:

    Tags: CUCET 2022, Cuet, CUET 2022, JOBS, Preparation, Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు