హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Aptitude Easy Method Tips: ఐబీపీఎస్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను.. ఇలా చేస్తే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు..

IBPS Aptitude Easy Method Tips: ఐబీపీఎస్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను.. ఇలా చేస్తే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు..

IBPS Aptitude Easy Method Tips: ఐబీపీఎస్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను.. ఇలా చేస్తే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు..

IBPS Aptitude Easy Method Tips: ఐబీపీఎస్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను.. ఇలా చేస్తే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు..

IBPS Aptitude Easy Method Tips: బ్యాంక్ కొలువు సాధించాలంటే పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు.. దానికి తగిన విధంగా సాధన చేయాలి. ఎక్కువగా ఆప్టిట్యూడ్ పై ఫోకప్ పెడితే.. మార్కులను ఈజీగా పొందొచ్చని తిరుపతి ఎమరాల్డ్స్ కాలేజ్ ఆప్టిట్యూడ్ ఫాకల్టీ శ్రీనివాస్ అభ్యర్థులకు సూచించారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

(GT Hemantha Kumar, News 18, Tirupati)

బ్యాంక్ కొలువు(Bank Job) సాధించాలంటే పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు.. దానికి తగిన విధంగా సాధన చేయాలి. ఎక్కువగా ఆప్టిట్యూడ్ పై(Aptitude) ఫోకప్ పెడితే.. మార్కులను ఈజీగా పొందొచ్చని తిరుపతి(Tirupati) ఎమరాల్డ్స్ కాలేజ్ ఆప్టిట్యూడ్ ఫాకల్టీ శ్రీనివాస్(Srinivas) అభ్యర్థులకు సూచించారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఇక్కడ తెలుసుకుందాం.  ఆప్టిట్యూడ్ అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు. ఎలా సాధన చేయాలి.. ఎలా నేర్చుకోవాలి అని మధనపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆప్టిట్యూడ్ లో పర్సంటేజ్ ప్రశ్నలు(Questions) బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక క్యాలుకేషన్ పార్ట్ పై శ్రద్ద పెట్టాలి. సింప్లిఫికేషన్(Simplifications)., క్వట్రాక్టిక్ ఇక్వేషన్., నెంబర్ సిరీస్(Number Series) పై అధికంగా ఫోకస్ పెట్టాలి. ఈ మూడు టాపిక్స్ పై 15 నుంచి 20 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది.

IBPS Reasoning Tips: ఐబీపీఎస్ రీజనింగ్ ప్రిపరేషన్.. ఈ టిప్స్ పాటిస్తే బ్యాంక్ జాబ్ మీ జేబులో ఉన్నట్లే..


ఇక రేసియెస్ అండ్ ప్రపోసన్స్., పర్సెంటేజెస్., టైం అండ్ వర్క్., ట్రైన్స్ ప్రాబ్లమ్స్.,పైప్స్ అండ్ సీక్వెన్స్ ను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం ద్వారా.. డేటా ఇంటర్ప్రిటేషన్ సులువుగా వచ్చేసినట్లే. అధికసంఖ్యలో టెస్ట్ లు రాయడం ద్వారా టైం అండ్ అక్యురసీ వస్తుంది. తద్వారా మనం ఎక్కడ వెనుకబడి ఉన్నామో మనకు అర్థం అవుతుంది. ఎక్కువ పరీక్షలు రాస్తే వాటితో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముందు పరీక్ష అంటే భయం పోతుంది. 3.3 సెకండ్లలో ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలో తెలుస్తుంది. తద్వారా ఏ ఏ టాపిక్స్ కి ఎంత టైం ఇవ్వాలో బాగా అర్థం అవుతుంది.

క్యాలుకేషన్స్ వేగంగా చేయడం.. పర్సెంటేజ్ అప్లికేషన్, ఆల్జీబ్రాలోని ఫార్ములాస్ మనకు అవగాహన ఉండాలి. పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే... సింప్లిఫికేషన్స్., పర్సెంటెజ్., ప్రాఫిట్ అండ్ లాస్., సింపుల్ ఇన్ ట్రస్ట్., కాంపౌండ్ ఇన్ ట్రస్ట్., డేటా ఇంటర్ప్రిటేషన్., డేటా అనాలసిస్ వంటి వాటిలో పర్సంటేజ్ ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. ఒక్క పర్సెంటెజ్ కాసెప్ట్ స్కోరింగ్ కు మంచి అవకాశం ఇస్తుంది.  ఆల్జీబ్రా లో చిన్న చిన్న ఫార్ములాస్ బాగా కంఠాపాఠం చేయాలి. రేషియో కాన్సెప్ట్స్ ఉంటాయి...రేషియో ప్రపోషన్ ఒక టాపిక్ అయితే...అలిగేషన్ మిక్చార్ మరో టాపిక్ ఉంటుంది.


IBPS Reasoning Tips: బ్యాంక్ పరీక్షలో స్కోరింగ్ టాపిక్ ‘రీజనింగ్’.. తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకోండి..


పార్ట్నర్ షిప్ ఏజ్ అనే మరో టాపిక్ ఉంటుంది. రేషియో ఒక్క టాపిక్ నేర్చుకోవడం ద్వారా...అందులో మిగిలిన మరో మూడు టాపిక్స్ ను సులభంగా చేయవచ్చు. ఇక టైం సిరీస్ లో మరో మూడు టాపిక్స్ ఉంటాయి. టైం., ఎఫిసీఎంసీ., వర్క్ అనేవి టైం సిరీస్ లో భాగం. ఈ మూడు టాపిక్స్ నేమ్స్ మార్చుకుంటూ ప్రశ్నల రూపంలో మన ముందుకు వస్తాయి. పైన చెప్పిన మూడు కాన్సెప్ట్స్ ను మూడు బ్లాకులుగా డివైడ్ చేసి నేర్చుకుంటే మంచిది. మోడల్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మార్కులు రావు.... కేవలం ఆరిజిన్ టాపిక్స్ ని మంచిగా చదువుకుంటే చాలు.

First published:

Tags: Career and Courses, IBPS, Ibps clerks, JOBS, Preparation

ఉత్తమ కథలు